అమీబియాసిస్
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అమీబియాసిస్ | |
---|---|
Specialty | Infectious diseases ![]() |
అమీబియాసిస్ వ్యాధి 'ఎంటమీబా హిస్టోలిటికా' అనే ప్రోటోజోవా పరాన్న జీవి వల్ల వస్తుంది. ఈ జీవి కోశీయ దశలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడిలో ప్రవేశిస్తుంది. పేగులో కోశీయ దశ నుంచి వెలువడిన జీవులు పేగు గోడపై దాడి చేసి పుండ్లను ఏర్పరుస్తాయి. దీనివల్ల రక్తం, జిగట పదార్థాలతో కూడిన విరోచనలవుతాయి. మలం దుర్వాసనతో ఉంటుంది. ఈ వ్యాధినే అమీబిక్ డీసెంటరీ అనికూడా పిలుస్తారు. సరైన ఔషధంతో అమీబియాసిస్ ను పూర్తిగా నయం చేయవచ్చు. ఆహారం, నీటిపై మూతలను ఉంచడం, వంట, భోజనానికి ముందు చేతులను శుభ్రపరచుకోవడం, కూరగాయలను, పండ్లను కడగడం లాంటి చర్యల ద్వారా వ్యాధి రాకుండా చేయవచ్చు.
ఇది ఆరోగ్యానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |