అమృతగాథ (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృతగాథ
కృతికర్త:
దేశం: భారతదేశం
భాష: తెలుగు, ఆంగ్లం
ప్రక్రియ: స్ఫూర్తిదాయక కథనాల సంకలనం
విభాగం (కళా ప్రక్రియ): స్వాతంత్ర సంగ్రామ చరిత్ర
ప్రచురణ: ఈనాడు
విడుదల: 2022 అక్టోబరు 26
ఆంగ్ల ప్రచురణ: 2022 అక్టోబరు 26

అమృతగాథ ఇది భారత స్వాతంత్ర యోధుల వీరగాథలతో కూడిన సంకలనం.[1] స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా స్వాతంత్రోద్యమ చరిత్ర, పోరాట ఘట్టాలు, వీరగాథలను ఈనాడు పత్రిక 2021 ఆగస్టు 15 నుంచి 2022 ఆగస్టు 15 వరకు వరుస కథనాలు ప్రచురించింది. ఇలా సంవత్సరం పొడవునా అందించిన ప్రత్యేక కథనాలను ఈనాడు సంకలనంగా అమృతగాథ పుస్తకాన్ని ముద్రించింది. దీనినే ఆంగ్లంలో ది ఇమ్మోర్టల్ సగా (The Immortal Saga - India's Struggle for Freedom)గా తీర్చిదిద్దారు. ఈ పుస్తకాలను ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో 2022 అక్టోబరు 26న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈనాడు దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్. కిరణ్‌, మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ శైలజా కిరణ్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి హాజరయ్యారు.

నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో స్వాతంత్య్ర సమరయోధులను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కొన్ని ప్రయత్నాలను గుర్తుచేసారు. అలాగే ఈ విషయంలో ఈనాడు గ్రూపు కృషి అత్యద్భుతమని ఆయన అన్నారు. ఆ గ్రూప్ చైర్మన్ రామోజీ రావుతో తనకున్న సాన్నిహిత్యం గురించి ప్రధాని మాట్లాడారు.[2]

మూలాలు[మార్చు]

  1. "Immortal Saga: 'అమృతగాథ' పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ." web.archive.org. 2022-11-06. Archived from the original on 2022-11-06. Retrieved 2022-11-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Eenadu's Azadi Ka Amrit Mahotsav: Modi launches 'The Immortal Saga - India's Struggle for Freedom'". web.archive.org. 2022-11-06. Archived from the original on 2022-11-06. Retrieved 2022-11-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)