అమృత్ దేశాయ్
| అమృత్ అయ్యప్ప దేశాయ్ | |||
| పదవీ కాలం 2018 మే 15 – 2023 మే 12 | |||
| నియోజకవర్గం | ధార్వాడ్ | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1977 జూన్ 20 హుబ్లీ , కర్ణాటక | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ (సెక్యులర్) | ||
| తల్లిదండ్రులు | అయ్యప్ప దేశాయ్ | ||
| జీవిత భాగస్వామి | ప్రియా | ||
| సంతానం | 2 కుమార్తెలు | ||
| పూర్వ విద్యార్థి | బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అమృత్ అయ్యప్ప దేశాయ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో ధార్వాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అమృత్ దేశాయ్ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2008 శాసనసభ ఎన్నికలలో ధార్వాడ్ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 21302 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో జెడిఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి వినయ్ కులకర్ణిపై 18,320 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు.
అమృత్ దేశాయ్ ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2018 శాసనసభ ఎన్నికలలో ధార్వాడ్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి వినయ్ కులకర్ణిపై 20340 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి వినయ్ కులకర్ణి చేతిలో 18,037 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Dharwad Constituency Election Results". The Times of India. 13 May 2023. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Dharwad". Election Commission of India. 10 May 2023. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.