Jump to content

అమెరికా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
యునైటెడ్ స్టేట్స్
దస్త్రం:USA Cricket logo.svg
మారుపేరుచుక్కలూ చారలూ (స్టార్స్ అండ్ స్ట్రైప్స్)
అసోసియేషన్USA Cricket
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్మొనాంక్ పటేల్
కోచ్పుబుడు దాస్సనాయక్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC హోదావన్‌డే హోదాతో అనుబంధ సభ్యత్వం (1965)
ICC ప్రాంతంఐసిసి అమెరికాస్
ఐసిసి ర్యాంకులు ప్రస్తుత[1] అత్యుత్తమ
వన్‌డే 14వ 14వ (2025 జూన్ 10)
టి20ఐ 18వ 17వ (2024 జూన్ 6)
వన్‌డేలు
తొలి వన్‌డేv.  New Zealand - ది ఓవల్, లండన్; 2004 సెప్టెంబరు 10, 2004
చివరి వన్‌డేv.  United Arab Emirates - దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్; 2025 నవంబరు 3
వన్‌డేలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[2] 75 40/32
(3 టైలు, 0 ఫలితం తేలనివి)
ఈ సంవత్సరం[3] 0 0/0
(0 టైలు, 0 ఫలితం తేలనివి)
ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ9 (first in 1979 ఐసిసి ట్రోఫీ)
అత్యుత్తమ ఫలితం7వ (2001 ఐసిసి ట్రోఫీ)
ట్వంటీ20లు
తొలి టి20ఐv.  United Arab Emirates ఐసిసి అకాడమీ గ్రౌండ్, దుబాయ్; 2019 మార్చి 15
చివరి టి20ఐv.  Pakistan సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్, కొలంబో; 2026 ఫిబ్రవరి 10
టి20ఐలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[4] 56 29/22
(3 టైలు, 2 ఫలితం తేలనివి)
ఈ సంవత్సరం[5] 2 0/2
(0 టైలు, 0 ఫలితం తేలనివి)
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ1 (first in 2024)
అత్యుత్తమ ఫలితంసూపర్ 8
ఐసిసి టి20 ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ6 (first in 2010 ఐసిసి ప్రపంచ టి20 క్వాలిఫయరు)
అత్యుత్తమ ఫలితం4వ (2022 క్వాలిఫయరు B)

ODI kit

T20I kit

As of 2026 ఫిబ్రవరి 10

యునైటెడ్ స్టేట్స్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో యునైటెడ్ స్టేట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ జట్టును గతంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ అసోసియేషన్ (USACA) నిర్వహించింది. ఇది 1965లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో అసోసియేట్ సభ్యత్వం పొందింది.[6] 2017 జూన్‌లో పాలనాపరమైన, ఆర్థిక సమస్యల కారణంగా ఐసిసి, USACAను బహిష్కరించింది, కొత్త పాలక మండలి స్థాపించబడే వరకు అమెరికా జట్టును ICC అమెరికాస్ తాత్కాలిక పర్యవేక్షణలో ఉంచింది.[7] 2019 జనవరిలో ఐసిసి, USA క్రికెట్‌కు అసోసియేట్ సభ్యత్వం అధికారికంగా ఇచ్చింది. [8] సభ్యత్వ బాధ్యతలను ఉల్లంఘించినందుకు గాను ఐసిసి, 2015 సెప్టెంబరులో USA క్రికెట్‌ను మళ్ళీ సస్పెండ్ చేసింది.

1844లో కెనడాతో జరిగిన మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో అమెరికా ప్రతినిధి జట్టు పాల్గొంది. ఒకటిన్నర శతాబ్దాల పాటు, అమెరికా జాతీయ జట్టు ఇతర జాతీయ జట్లతో పెద్దగా ఆడలేదు. ఇది ఎక్కువగా కెనడాతో (వార్షిక ఆటీ కప్‌లో) లేదా ఇతర దేశాల నుండి వచ్చిన పర్యాటక జట్లతో ఆడింది.

1979లో ఇంగ్లాండ్‌లో జరిగిన ICC ట్రోఫీతో అమెరికా, తన అంతర్జాతీయ టోర్నమెంటు చరిత్రను ప్రారంభించింది (ఇప్పుడు దీనిని ప్రపంచ కప్ క్వాలిఫైయర్ అని పిలుస్తారు); అప్పటి నుండి అది కేవలం రెండు సార్లు మాత్రమే ఈ టోర్నమెంటులో ఆడలేదు. 2004 ICC సిక్స్ నేషన్స్ ఛాలెంజ్ గెలిచి ఆ జట్టు, 2004 ICC ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. దాని మొదటి రెండు వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లను ఆడింది. 2018 ఏప్రిల్‌లో ఐసిసి తన సభ్యులందరికీ పూర్తి ట్వంటీ20 ఇంటర్నేషనల్ (టీ20ఐ) హోదాను ఇవ్వాలని నిర్ణయించింది. అందువల్ల, 2019 జనవరి 1 తర్వాత యునైటెడ్ స్టేట్స్‌కు ఇతర ICC సభ్యులకూ మధ్య ఆడే అన్ని ట్వంటీ20 మ్యాచ్‌లకు టీ20ఐ హోదా ఉంటుంది. [9]

ప్రపంచ క్రికెట్ లీగ్‌లో, అమెరికా 2019 డివిజన్ టూ టోర్నమెంట్లో నాల్గవ స్థానంలో నిలిచింది, పాపువా న్యూ గినియా చేతిలో మూడవ స్థానం కోసం ఆటలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను వన్‌డేగా నియమించారు (15 సంవత్సరాల తర్వాత అమెరికా ఆడిన మూడవ వన్‌డే మ్యాచ్‌ అది). ఈ నాల్గవ స్థానంలో నిలిచిన దేశానికి 2019–22 ICC క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 లో స్థానం సంపాదించడానికి సరిపోతుంది, దీనిలో జట్టు ఆడే మ్యాచ్‌లన్నిటికీ వన్‌డే హోదా ఉంటుంది. 2019 సెప్టెంబరు 13 న మొదలైన మొదటి దేశీయ వన్‌డే సిరీస్‌లో అమెరికా, పాపువా న్యూ గినియా నమీబియాలకు ఆతిథ్యం ఇచ్చింది.[10]

చరిత్ర

[మార్చు]

ప్రారంభం

[మార్చు]

18వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ అమెరికా కాలంలో పదమూడు కాలనీలలో క్రికెట్ ఆడేవారు. 18వ శతాబ్దంలో క్రికెట్ మరింత అభివృద్ధి చెందింది. [11] జార్జ్ వాషింగ్టన్ క్రికెట్‌కు బలమైన మద్దతుదారుడని, అమెరికన్ విప్లవం సమయంలో వ్యాలీ ఫోర్జ్‌లో తన దళాలతో కనీసం ఒక్కసారైనా వికెట్ గేమ్‌లో పాల్గొన్నాడని మౌఖిక ఆధారాల నుండి అర్థమవుతోంది.[12] క్రికెట్ క్లబ్‌ల నాయకులనే "అధ్యక్షులు" అని పేరుపెట్టగా లేనిది కొత్త దేశం నాయకుడిని అదే విధంగా పిలవకపోవడానికి కారణం ఉండదని జాన్ ఆడమ్స్ కాంగ్రెస్‌లో చెప్పినట్లుగ చరిత్రలో నమోదైంది.

1844లో, యునైటెడ్ స్టేట్స్ మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొంది. ఇది కెనడాతో న్యూయార్క్‌లోని బ్లూమింగ్‌డేల్ పార్క్‌లోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌లో జరిగింది. [13] ఈ మొదటి అంతర్జాతీయ క్రీడా కార్యక్రమానికి 20,000 మంది హాజరయ్యారు. దాంతో, ఆధునిక యుగంలో అతి సుదీర్ఘమైన అంతర్జాతీయ క్రీడా స్పర్థకు బీజం పడింది.[14] మ్యాచ్ ఫలితంపై దాదాపు $1,20,000 పందేలు వేశారు. 2007 లెక్కలలో ఇది దాదాపు $1.5 మిలియన్లకి సమానం.[15] [16]

1859, 1868, 1872 సంవత్సరాల ఇంగ్లీష్ క్రికెట్ సీజన్ల తర్వాత ఇంగ్లాండ్ జట్లు ఉత్తర అమెరికాలో పర్యటించాయి (అవి అమెరికా, కెనడా రెండింటిలోనూ ఆడాయి). ఇవి పూర్తిగా వాణిజ్యపరమైన పర్యటనలు. ఈ ప్రారంభ పర్యాటక జట్ల మ్యాచ్‌లు చాలా వరకు బకహీనమైన జట్టు పట్ల సానుకూల పక్షపాతంతో ఆడారు. అంటే జట్ల మధ్య పోటీలో కొంత సమానత సాధించేందుకు, స్వదేశీ జట్టులో పదకొండు మంది కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు (సాధారణంగా ఇరవై రెండు) ఉండేవారు.

క్షీణత

[మార్చు]

18వ శతాబ్దంలో, 19వ శతాబ్ది ప్రారంభంలో క్రికెట్ ప్రజాదరణ పొందినప్పటికీ, 1850లు, 1860లలో ఈ ఆట స్థానంలో బేస్ బాల్ వచ్చింది. బేస్ బాల్ పై ప్రజలకు ఆసక్తి పెరిగే క్రమంలో, దాని ప్రజాదరణను పెంచడానికి ఆ ఆట నియమాలను కొద్దిగా మార్చారు. ఉదాహరణకు, క్రికెట్లో వాడే చదునైన బ్యాట్‌లు కాకుండా, సులభంగా తయారు చేయగలిగే గుండ్రని బ్యాట్‌లను ప్రవేశపెట్టడం ఒకటి.[17]

క్రికెట్ ప్రజాదరణ తగ్గడానికి మరొక కారణం ఏమిటంటే, 19వ శతాబ్దం చివరలో అమెరికన్ క్రికెట్‌ సంపన్నుల కోసం మాత్రమే పరిమితమైన అమెచ్యూర్ క్రీడగా మిగిలిపోయింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో ప్రొఫెషనల్ ఆటను అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో క్రికెట్ ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అనేక ఉత్తర అమెరికా క్రికెట్ క్లబ్‌లు మాత్రం, మొండిగా ఉన్నత వర్గాలకే ప్రాధాన్యతనిచ్చాయి. ఫిలడెల్ఫియా CC, మెరియన్ వంటి క్లబ్‌లు క్రికెట్‌ను విడిచిపెట్టి, ఇతర క్రీడలకు మళ్ళాయి.

1900 నాటికి, బేస్ బాల్ యునైటెడ్ స్టేట్స్‌లో సంఖ్యాపరంగా, సాంస్కృతికంగా ఆధిపత్యం చెలాయించింది. [18] పైగా, 1909లో క్రికెట్‌కు మొదటి అంతర్జాతీయ సంస్థ అయిన ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ (ICC) ఏర్పడినప్పుడు, దానిలో సభ్యత్వాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలోని దేశాలకు మాత్రమే పరిమితం చేసారు. దాంతో సామ్రాజ్యం వెలుపల క్రికెట్‌కు ప్రజాదరణ తగ్గింది. యునైటెడ్ స్టేట్స్‌లో క్రికెట్‌ను వృత్తిపరంగా మారే క్రమం మందగించింది. అయితే, ఐసిసి మరింత ఉదాత్తంగా, విశాలంగా ఉండి ఉంటే, ఈ వేగం తగ్గకుండా కొనసాగేదా లేదా పెరిగేదా అనేది ఒక బహిరంగ ప్రశ్నగా మిగిలిపోయింది.[13] కారణాలు ఏమైనప్పటికీ, బ్రిటిష్ సామ్రాజ్యంలో వలె ఈ ఆట యునైటెడ్ స్టేట్స్‌లో అభివృద్ధి చెందలేదు. 1880ల నుండి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు, అమెరికాలో క్రికెట్ అంటే జాతీయ జట్టు కాదు; క్రికెట్‌కు బలమైన కోట లాంటి ఫిలడెల్ఫియా మెట్రోపాలిటన్ ప్రాంతంలోని అమెచ్యూర్ ఫిలడెల్ఫియా క్రికెట్ జట్టుదే అమెరికా క్రికెట్‌పై ఆధిపత్యం.

1913లో ఆస్ట్రేలియన్లు ఉత్తర అమెరికాలో చేసిన పర్యటనలో కెనడా-యుఎస్ జట్లతో రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. ఆ రెండింటినీ పర్యాటకులే గెలుచుకున్నారు.[19] [20]

21వ శతాబ్దం

[మార్చు]

2001 ICC ట్రోఫీలో అమెరికా ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఇదే వారి అత్యుత్తమ ప్రదర్శన. వారు ICC అమెరికాస్ ఛాంపియన్‌షిప్ ప్రతి ఎడిషన్‌లోనూ ఆడారు. 2002లో గెలిచారు. [21]

2004లో, యునైటెడ్ స్టేట్స్ క్రికెట్ జట్టు మొదటి ICC ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడింది. కెనడా, బెర్ముడాలతో జరిగిన మ్యాచ్‌లు చాలా సంవత్సరాల తర్వాత జట్టు ఆడిన మొదటివి.[21] ఆ జట్టు ICC 6 నేషన్స్ ఛాలెంజ్‌ను స్కాట్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, UAEలను 0.028 నికర రన్ రేట్‌ తేడాతో ఓడించింది.

ICC సిక్స్ నేషన్స్ టైటిల్ గెలవడంతో వారు ఇంగ్లాండ్‌లో జరిగే ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2004 కి అర్హత సాధించారు. 2004 సెప్టెంబరు 10 న అమెరికా, ది ఓవల్‌లో న్యూజిలాండ్‌తో తమ మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది.[22]

ఆ టోర్నమెంట్లో అమెరికా జట్టు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది.

2005 ICC ట్రోఫీ అమెరికా జట్టు ప్రపంచ వేదికపై తిరిగి స్థానం సంపాదించుకోవడానికీ, 2007 ప్రపంచ కప్‌కు అర్హత సాధించడానికీ ఒక అవకాశాన్ని అందించింది. కానీ, పేలవమైన ప్రదర్శన కారణంగా వారు గ్రూప్‌లో అట్టడుగున నిలిచారు. వారి ఐదు గ్రూప్ మ్యాచ్‌లలో నాలుగింట ఓడిపోగా, వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దైంది. ఈ వైఫల్యంతో అమేరికా, ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌కు లభించే పూర్తి వన్డే అంతర్జాతీయ హోదా పొందలేకపోయింది.[21] 2005 ఆగస్టు 9 న చట్టపరమైన వివాదాల వలన జట్టును ప్రకటించకపోవడంతో ఐసిసి, 2005 ICC ఇంటర్‌కాంటినెంటల్ కప్ నుండి అమెరికాను తొలగించింది. దాంతో ఈ వైఫల్యం మరింత తీవ్రమైంది.[23]

2006 ఆగస్టులో కెనడాలో జరిగిన ICC అమెరికాస్ ఛాంపియన్‌షిప్‌లో డివిజన్ వన్‌లో పాల్గొన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్, అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చింది. [24] ఐదు జట్లు పాల్గొన్న ఆ టోర్నమెంట్లో వారు రెండవ స్థానంలో నిలిచారు.

2007లో, యునైటెడ్ స్టేట్స్ ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ త్రీలో పాల్గొనడానికి ఆస్ట్రేలియాలోని డార్విన్‌ వెళ్ళాల్సి ఉంది. [25] ఈ టోర్నమెంట్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు ఆ సంవత్సరం చివర్లో అదే టోర్నమెంట్లో డివిజన్ టూకు అర్హత సాధించేవారు. [25] అయితే, USACA రాజ్యాంగంపై అంతర్గత వివాదాల మధ్య, 2007 మార్చిలో ఐసిసి, USACAను సస్పెండ్ చేసింది. దాంతో జట్టు ఆ టోర్నమెంటు నుండి వైదొలగవలసి వచ్చింది.[26] 2008 ప్రారంభంలో ఈ వివాదం పరిష్కారమై, ఆ సంవత్సరం ఏప్రిల్ 1న సస్పెన్షన్ ఎత్తివేయబడింది.[27]

జట్టును పునస్థాపించడంతో వారు 2008లో జెర్సీలో జరిగిన డివిజన్ ఫైవ్‌లో ప్రపంచ క్రికెట్ లీగ్‌లోకి ప్రవేశించగలిగారు. 4–0–0 రికార్డుతో (ఒక మ్యాచ్ రద్దు చేయబడింది) జట్టు, గ్రూప్ దశను దాటింది.[28] కానీ జెర్సీతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్, నేపాల్‌తో మూడవ స్థానం కోసం జరిగిన ప్లే-ఆఫ్ మ్యాచ్ రెండింటిలోనూ ఓడిపోయింది.[29]

2015 సస్పెన్షన్

[మార్చు]

205 జూన్ 26 న ఐసిసి మళ్ళీ USACA ని సస్పెండ్ చేసింది. ఈసారి ICC సమీక్ష "USACA యొక్క పాలన, ఆర్థికం, ఖ్యాతి, క్రికెట్ కార్యకలాపాల గురించి గణనీయమైన ఆందోళనలను వ్యక్తం చేసింది". ఈ సస్పెన్షన్ వలన జాతీయ జట్టు ఆడే మ్యాచ్‌లు ప్రభావితం కావు. కానీ ఐసిసి నిధులను నిలిపివేస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో జరిగే ఏవైనా ఈవెంట్‌లను USACA ఆమోదించకుండా ఆపుతుంది (ఐసిసి మాత్రం ఇప్పటికీ యునైటెడ్ స్టేట్స్‌లో జరిగే ఈవెంట్‌లను ఆమోదించగలదు). USACA "పరిపాలన, ఆర్థికం, దాని క్రికెట్ కార్యకలాపాలకు సంబంధించిన పరిస్థితులు" మెరుగుపడ్డాయని ఐసిసికి చూపించే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది. [30]

2016 వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ ఫోర్‌లో, యునైటెడ్ స్టేట్స్ 3–2 రికార్డుతో రెండవ స్థానంలో నిలిచింది. 2017కి డివిజన్ త్రీకి పదోన్నతి పొందింది. 2017 డివిజన్ త్రీ పోటీలో, 2–3 రికార్డుతో నాల్గవ స్థానంలో నిలిచింది. మూడవ స్థానం కోసం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి ఫలితం లేకుండా ముగిసింది. యునైటెడ్ స్టేట్స్ డివిజన్ త్రీలోనే కొనసాగింది.

2018 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ త్రీ చివరి మ్యాచ్‌లో సింగపూర్‌ను ఓడించిన తర్వాత, యునైటెడ్ స్టేట్స్ మొదటిసారి డివిజన్ టూకు పదోన్నతి పొందింది. [31] 2019 ఏప్రిల్ లో, 2019 డివిజన్ టూ టోర్నమెంటు‌లో టాప్ 4లో నిలిచిన తర్వాత, యునైటెడ్ స్టేట్స్ 2019–22 ICC క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 కి అర్హత సాధించింది — ఇది 2022 క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్‌కు చేరుకునే అవకాశాన్ని అందిస్తుంది. క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లోని అన్ని మ్యాచ్‌లు వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ఆడతారు.[32] [33]

2019 నాటికి, అన్ని ICC సభ్య దేశాలకు ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టీ20ఐ) హోదా లభించింది. [34] యునైటెడ్ స్టేట్స్ 2019 మార్చి 15 న దుబాయ్‌లోని ICC అకాడమీ గ్రౌండ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన టీ20ఐ మ్యాచ్‌లో రంగప్రవేశం చేసింది.  

2021 డిసెంబరులో అమెరికాతో ఐదు మ్యాచ్‌ల పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్నట్లు ఐర్లాండ్ 2021 నవంబరులో ప్రకటించింది. దీనితో 2022 జనవరిలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభమైంది.[35][36] యునైటెడ్ స్టేట్స్ ఒక టెస్ట్ దేశంతో ద్వైపాక్షిక సిరీస్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. [35][36] ఈ సిరీస్ రెండు టీ20ఐలతో ప్రారంభమైంది; నెమ్మదిగా ప్రారంభమైన తర్వాత, సుశాంత్ మోదానీ, గజానంద్ సింగ్‌ల హై-స్కోరింగ్ భాగస్వామ్యంతో జట్టు ఇన్నింగ్స్ బలోపేతమైంది. మొత్తం 188 పరుగులకు చేరింది. ఐర్లాండ్ 26 పరుగుల తేడాతో ఓడిపోవడంతో, యునైటెడ్ స్టేట్స్ ఒక టెస్ట్ దేశంతో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలి విజయం సాధించింది.[37] [38]

December 22, 2021
2:00 p.m.
Scorecard
v
 Ireland
162/6 (20 overs)
Gajanand Singh 65 (42)
Barry McCarthy 4/30 (4 overs)
Lorcan Tucker 57* (49)
Saurabh Netravalkar 2/26 (4 overs)
United States won by 26 runs
Central Broward Park, Lauderhill
అంపైర్లు: Sameer Bandekar (USA) and Vijaya Mallela (USA)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: Gajanand Singh (USA)
  • United States won the toss and elected to bat.
  • Ritwik Behera, Marty Kain, Sushant Modani, Yasir Mohammad and Ryan Scott (U.S.) all made their T20I debuts.
  • This was U.S.' first win in an International cricket match in any format against a Full Member.

రెండవ మ్యాచ్‌లో ఐర్లాండ్ టీ20ఐ సిరీస్‌ను సమం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయింది, కానీ యునైటెడ్ స్టేట్స్ వారి ఇన్నింగ్స్‌లో తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. [39] ఈ సిరీస్ వన్‌డే మ్యాచ్‌లతో కొనసాగుతుందని భావించారు. అయితే, 2021 డిసెంబరు 28 న COVID-19 సమస్యల కారణంగా అనేకసార్లు వాయిదా పడిన తర్వాత మొత్తం వన్‌డే సిరీస్ రద్దైంది.[40]

డిసెంబరు 2022లో, నమీబియా పర్యటన తర్వాత, USA క్రికెట్ పురుషుల జాతీయ జట్టు ప్రధాన కోచ్‌గా జగదీష్ అరుణ్‌కుమార్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. [41]

2025 ఫిబ్రవరి 18 న, 2025 ఒమన్ ట్రై-నేషన్ సిరీస్‌లో ఒమన్‌తో జరిగిన 2024–2026 క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో యునైటెడ్ స్టేట్స్ మొదట బ్యాటింగు చేస్తూ, 122 పరుగులు చేసి, ఆ మ్యాచ్ గెలుచుకుంది. పురుషుల వన్‌డేలో విజయవంతంగా డిఫెండ్ చేసిన అత్యల్ప స్కోరు అది. [42]

టోర్నమెంటు చరిత్ర

[మార్చు]

ఎరుపు అంచుతో ఉన్న సంవత్సరం పెట్టె USA లో జరిగిన టోర్నమెంటులను సూచిస్తుంది.

ICC T20 World Cup record Qualification record
సంవత్సరం రౌండ్ స్థానం గె టై నెట్ రన్ రేటు స్క్వాడ్ Ref గె టై నెట్ రన్ రేటు
South Africa 2007 పాల్గొనలేదు పాల్గొనలేదు
ఇంగ్లాండ్ 2009
వెస్ట్ ఇండీస్ 2010 అర్హత పొందలేదు 3 1 2 - -
శ్రీలంక 2012 14 7 7 - -
బంగ్లాదేశ్ 2014 16 10 5 - 1
భారతదేశం 2016 12 7 5 - -
United Arab Emirates ఒమన్ 2021 12 7 5 - -
Australia 2022 11 8 3 - -
అమెరికా సంయుక్త రాష్ట్రాలు వెస్ట్ ఇండీస్ 2024 Super 8 8/20 7 1 4 1 1 Squad [43] DNP (Automatic qualification as co-hosts)
భారతదేశం శ్రీలంక 2026 అర్హత సాధించింది DNP (Automatic Qualification)
Australia New Zealand 2028 TBD TBD
ఇంగ్లాండ్ Wales Scotland Republic of Ireland 2030 TBD TBD
Total 0 Title 1/9 7 1 4 1 1 68 40 27 0 1

ఐసిసి ప్రపంచ క్రికెట్ కప్ అర్హత పోటీలు

[మార్చు]
ICC ప్రపంచ క్రికెట్ క్వాలిఫైయర్స్ రికార్డులు
సంవత్సరం రౌండ్ స్థానం గె టై నెట్ రన్ రేటు
శ్రీలంక 1979 గ్రూప్ దశ 15-8 4 2 1. 1. 0 1. 1.
ఇంగ్లాండ్ 1982 గ్రూప్ దశ 16-8 7 1. 1. 2 0 4
ఇంగ్లాండ్ 1986 గ్రూప్ దశ 12/5 8 7 1. 1. 0 0
Netherlands 1990 రెండవ రౌండ్ 17-8 6 4 2 0 0
కెన్యా 1994 రెండవ రౌండ్ 11/20 7 5 2 0 0
మలేషియా 1997 ప్లేట్ రౌండ్ 12/22 7 3 4 0 0
Canada 2001 సూపర్ లీగ్ 24/6 9 3 6 0 0
Republic of Ireland 2005 ప్లే-ఆఫ్‌లు 10/12 7 1. 1. 5 0 1. 1.
South Africa 2009 అర్హత పొందలేదు.
New Zealand 2014
జింబాబ్వే 2018
జింబాబ్వే 2023 ప్లే-ఆఫ్‌లు 10/10 6 0 6 0 0
2027 శుక్రవారము
మొత్తం 13-9 0 శీర్షిక 61 తెలుగు 26 29 0 6
సంవత్సరం రౌండ్ స్థానం గె టై నెట్ రన్ రేటు స్క్వాడ్ మూలాలు
బంగ్లాదేశ్ 1998 పాల్గొనలేదు.
కెన్యా 2000 సంవత్సరం
శ్రీలంక 2002
ఇంగ్లాండ్ 2004 మొదటి రౌండ్ 12/12 2 0 2 0 0 స్క్వాడ్ [44]
India 2006 అర్హత పొందలేదు.
South Africa 2009
ఇంగ్లాండ్Wales2013
ఇంగ్లాండ్Wales2017
PakistanUnited Arab Emirates2025
భారతదేశం 2029 శుక్రవారము
మొత్తం 0 శీర్షికలు 1/9 2 0 2 0 0

ఒలింపిక్ క్రీడలు

[మార్చు]
సంవత్సరం రౌండ్ స్థానం గె టై నెట్ రన్ రేటు రెఫ్
ఫ్రాన్స్ 1900 పాల్గొనలేదు.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 2028 అర్హత సాధించలేదు
Australia 2032 ఇంకా నిర్ణయించలేదు
మొత్తం

నార్త్ అమెరికన్ కప్

[మార్చు]
సంవత్సరం రౌండ్ స్థానం గె టై నెట్ రన్ రేటు రెఫ్
కేమన్ ఐలాండ్స్ 2025 ఛాంపియన్స్ 1/5 6 5 1. 1. 0 0 [45]
మొత్తం 1 శీర్షిక 1/1 6 5 1. 1. 0 0
CWC లీగ్ 2 (వన్‌డే) CWC క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్ (వన్‌డే) T20WC అమెరికాస్ సబ్-రీజినల్ క్వాలిఫైయర్స్ వరల్డ్ క్రికెట్ లీగ్ (వన్-డే)
  • 2023 : విజేతలు
  • 2018 : విజేతలు (ప్రాంతీయ ఫైనల్‌కు చేరారు)
  • 2007: మొదట డివిజన్ త్రీలో పాల్గొనాలని అనుకున్నారు కానీ సస్పెన్షన్ కారణంగా బహిష్కరించబడ్డారు [26]
  • 2008 డివిజన్ ఐదు : 4వ స్థానం [29]
  • 2010 డివిజన్ ఐదు : 2వ స్థానం
  • 2010 డివిజన్ ఫోర్ : ఛాంపియన్స్
  • 2011 డివిజన్ త్రీ : 6వ స్థానం
  • 2012 డివిజన్ ఫోర్ : 2వ స్థానం
  • 2013 డివిజన్ త్రీ : 3వ స్థానం
  • 2014 డివిజన్ త్రీ : 5వ స్థానం
  • 2016 డివిజన్ 4 : మొదటి స్థానం
  • 2017 డివిజన్ త్రీ : 4వ స్థానం
  • 2018 డివిజన్ త్రీ : 2వ స్థానం
  • 2019 డివిజన్ టూ : 4వ స్థానం
ఐసిసి అమెరికాస్ ట్వంటీ 20 ఛాంపియన్‌షిప్ ఇంటర్ కాంటినెంటల్ కప్ (FC) ఐసిసి అమెరికాస్ ఛాంపియన్‌షిప్
  • 2010 డివిజన్ వన్: గెలిచింది
  • 2011 డివిజన్ వన్: 2వ స్థానం
  • 2013 డివిజన్ వన్: గెలిచింది
  • 2015 డివిజన్ వన్: 2వ స్థానం
  • 2004 : మొదటి రౌండ్ [21]
  • 2005 : మొదట పాల్గొనాల్సి ఉంది కానీ సస్పెన్షన్ కారణంగా ఆడలేదు [23]
  • 2006/07 : పాల్గొనలేదు [21]
  • 2007/08 : పాల్గొనలేదు [21]
  • 2000: 3వ స్థానం [21]
  • 2002 : గెలిచింది [21]
  • 2004 : రన్నరప్ [21]
  • 2006 : డివిజన్ వన్ రన్నరప్ [24]
  • 2008 : గెలిచింది [21]
  • 2010: రన్నరప్
  • 2011: రన్నరప్

స్టేడియంలు

[మార్చు]

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న, వన్డే హోదా కలిగిన అమెరికా క్రికెట్ స్టేడియాలు ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్, టెక్సాస్‌లోని పెర్లాండ్‌లోని మూసా స్టేడియం లు రెండే. [46] [47] ఇతర సౌకర్యాలలో నార్త్ కరోలినా మోరిస్‌విల్లేలోని చర్చి స్ట్రీట్ పార్క్ ; టెక్సాస్‌, హ్యూస్టన్‌లోని ప్రైరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ; కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్‌లోని లియో మాగ్నస్ క్రికెట్ కాంప్లెక్స్ ; [48] [49] టెక్సాస్‌ గ్రాండ్ ప్రైరీలోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం లు ఉన్నాయి. [50] [51]

స్టేడియం నగరం ప్రారంభం
సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ ‡ లాడర్‌హిల్ (మయామి) 2008
గ్రాండ్ ప్రైరీ స్టేడియం గ్రాండ్ ప్రైరీ (డల్లాస్) 2022
మూసా స్టేడియం ‡ పెర్లాండ్ (హూస్టన్) 2022
ప్రైరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ప్రైరీ వ్యూ (హ్యూస్టన్) 2022
ఓక్లాండ్ కొలిసియం ఓక్లాండ్, కాలిఫోర్నియా 2025

‡ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

స్థానం పేరు
జట్టు మేనేజర్ ఆస్కార్ అలవారెజ్
ప్రధాన కోచ్ పుబుడు దాసనాయకే
అసిస్టెంట్ కోచ్ విన్సెంట్ వినయ్ కుమార్
ఫిజియోథెరపిస్ట్ జతిన్ మహేశ్వరి [52]
బ్యాటింగ్ కోచ్ రిషి భరద్వాజ్
ఫాస్ట్ బౌలింగ్ కోచ్ ధమ్మిక ప్రసాద్
సిఇఒ జోనాథన్ అట్కీసన్
స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ మాథ్యూ స్కైన్నర్
విశ్లేషకుడు సంపత్ శేషాద్రి

కోచింగ్ చరిత్ర

[మార్చు]

ప్రస్తుత జట్టు

[మార్చు]

ఇది గత 12 నెలల్లో USA తరపున ఆడిన లేదా జట్టు యొక్క ఇటీవలి జట్టులో ఎంపికైన అన్ని క్రియాశీల ఆటగాళ్ల జాబితాను కలిగి ఉంది.

కీ

  • S/N = చొక్కా సంఖ్య
పేరు. వయసు. బ్యాటింగ్ శైలి బౌలింగ్ శైలి జోన్ ఎంఎల్సి జట్టు రూపాలు ఎస్/ఎన్ చివరి వన్డే చివరి టీ20 కెప్టెన్సీ
బ్యాటర్లు
ఆరోన్ జోన్స్ 31 కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ దక్షిణం. సీటెల్ ఓర్కాస్ వన్డే, టీ20 85 2024 2024 వైస్ కెప్టెన్
షయాన్ జహంగీర్ 31 కుడిచేతి వాటం -- నైరుతి ఎంఐ న్యూయార్క్ వన్డే, టీ20 30 2024 2024
సాయితేజ ముక్కామల 22 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ మధ్య-అట్లాంటిక్ టెక్సాస్ సూపర్ కింగ్స్ వన్డే, టీ20 12 2024 2024
హీత్ రిచర్డ్స్ 25 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ నైరుతి లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ వన్డే 6 -- --
మాథ్యూ ట్రోంప్ 25 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ నైరుతి టెక్సాస్ సూపర్ కింగ్స్ టీ20ఐ 21 -- --
ఉత్కర్ష్ శ్రీవాస్తవ 19 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ దక్షిణం. ఎంఐ న్యూయార్క్ వన్డే, టీ20 18 -- 2024
ఆల్ రౌండర్లు
స్టీవెన్ టేలర్ 32 ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ దక్షిణం. ఎంఐ న్యూయార్క్ వన్డే 8 2024 2024
షెహాన్ జయసూర్యా 34 ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ నైరుతి సీటెల్ ఓర్కాస్ వన్డే, టీ20 31 2025 2025
వికెట్ కీపర్లు
మోనంక్ పటేల్ 32 కుడిచేతి వాటం -- మధ్య-అట్లాంటిక్ ఎంఐ న్యూయార్క్ వన్డే, టీ20 1 2024 2024 కెప్టెన్
ఆండ్రిస్ గౌస్ 32 కుడిచేతి వాటం -- నైరుతి వాషింగ్టన్ ఫ్రీడమ్ వన్డే, టీ20 68 2024 2024
జాషువా ట్రోంప్ 22 కుడిచేతి వాటం -- నైరుతి టెక్సాస్ సూపర్ కింగ్స్ వన్డే, టీ20 34 -- --
స్పిన్ బౌలర్లు
నోస్తుష్ కెంజిగే 35 కుడిచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ నైరుతి ఎంఐ న్యూయార్క్ వన్డే, టీ20 64 2024 2024
హర్మీత్ సింగ్ బధన్ 33 ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ నైరుతి సీటెల్ ఓర్కాస్ వన్డే, టీ20 27 2024 2024
యాసిర్ మహ్మద్ 23 ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ మధ్య-అట్లాంటిక్ వాషింగ్టన్ ఫ్రీడమ్ వన్డే, టీ20 88 2024 2024
పేస్ బౌలర్లు
జెస్సీ సింగ్ 33 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం మధ్య-అట్లాంటిక్ వాషింగ్టన్ ఫ్రీడమ్ వన్డే, టీ20 29 2024 2024
స్టీఫెన్ విగ్ 33 కుడిచేతి వాటం ఎడమ చేతి మీడియం పశ్చిమం. టెక్సాస్ సూపర్ కింగ్స్ -- టీ20ఐ 20 --
అలీ షేక్ 24 ఎడమచేతి వాటం కుడి చేతి ఫాస్ట్ మీడియం పశ్చిమం. సీటెల్ ఓర్కాస్ వన్డే, టీ20 89 -- --
జువానోయ్ డ్రిస్డేల్ 34 కుడిచేతి వాటం కుడి చేతి ఫాస్ట్ మీడియం తూర్పు శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ వన్డే, టీ20 5 2024 2024
అభిషేక్ పరాడ్కర్ 25 ఎడమచేతి వాటం ఎడమ చేతి మీడియం పశ్చిమం. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ టీ20ఐ 44 2024 2024
అయాన్ దేశాయ్ 22 ఎడమచేతి వాటం ఎడమ చేతి మీడియం పశ్చిమం. సీటెల్ ఓర్కాస్ టీ20ఐ 13 -- 2024

కెప్టెన్లు

[మార్చు]

ఎనిమిది మంది ఆటగాళ్ళు అమెరికాకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించారు. మొదటి అమెరికన్ కెప్టెన్ అనిల్ కష్కరి, అతను 1979లో తన పాత్రను తిరిగి పొందాడు.

2004లో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే)లో జట్టుకు నాయకత్వం వహించిన మొదటి అమెరికన్ కెప్టెన్ రిచర్డ్ స్టేపుల్. 2005లో స్టేపుల్ పదవీ విరమణ చేసిన తర్వాత, స్టీవ్ మస్సియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే, 2012 ICC వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్ సమయంలో సుశీల్ నాద్కర్ణి అమెరికన్ జట్టుకు నాయకత్వం వహించాడు.

2013 అక్టోబరులో, UAE లో జరిగిన 2013 ICC వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్ కోసం 15 మంది సభ్యుల జట్టులో నీల్ మెక్‌గారెల్ అమెరికా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 1998 - 2001 మధ్యకాలంలో మెక్‌గారెల్ వెస్టిండీస్ తరపున నాలుగు టెస్టులు, 17 వన్‌డేలు ఆడాడు. 2012 లో అతను కెనడాపై అమెరికా తరపున రంగప్రవేశం చేశాడు. ఏడు సంవత్సరాలు కెప్టెన్‌గా ఉన్న స్టీవ్ మాస్సియా స్థానంలో బాధ్యతలు స్వీకరించాడు.

2016లో, స్టీవెన్ టేలర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతను లాస్ ఏంజిల్స్‌లో WCL డివిజన్ ఫోర్ టైటిల్‌ గెలుచుకున్నాడు. తరువాత అమెరికా డివిజన్ మూడు నుండి పురోగతి సాధించడంలో విఫలమవడంతో, అతను కెప్టెన్ పదవి నుంచి వైదొలగి, జమైకా స్కార్పియన్స్‌తో ప్రొఫెషనల్ కాంట్రాక్టును అంగీకరించాడు. అతను గతంలో కెనడాతో జరిగిన 2013 ఆటీ కప్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అందుబాటులో లేని స్టీవ్ మస్సియా స్థానంలో అతను స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[53]

2018 అక్టోబరులో, ఇబ్రహీం ఖలీల్‌ను తొలగించిన తర్వాత, సౌరభ్ నేత్రావల్కర్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.[54] ఖలీల్ 2017లో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అతని కెప్టెన్సీలో అమెరికా, చాలా కాలం తర్వాత ఆటీ కప్‌ను గెలుచుకుంది.

2021 అక్టోబరులో మోనాంక్ పటేల్, టీ20ఐ, వన్‌డే కెప్టెన్‌గా సౌరభ్ నేత్రావల్కర్ నుండి బాధ్యతలు స్వీకరించాడు.[55]

2024 మేలో, 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంటు కోసం మోనాంక్ పటేల్, USA జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గ్రూప్ దశ మ్యాచ్‌లో పటేల్ గాయపడడంతో ఆరోన్ జోన్స్ మిగిలిన టోర్నమెంటు‌కు కెప్టెన్సీ పదవి చేపట్టాడు.[56]

రికార్డులు

[మార్చు]

అంతర్జాతీయ మ్యాచ్ సారాంశం – యునైటెడ్ స్టేట్స్ [57] [58]

చివరిగా నవీకరించబడింది 2026 ఫిబ్రవరి 10

ఆట రికార్డు
ఫార్మాట్ గె టై నెరరే తొలి మ్యాచ్
వన్డే ఇంటర్నేషనల్స్ 75 40 32 3 0 2004 సెప్టెంబరు 10
ట్వంటీ20 అంతర్జాతీయాలు 56 29 22 3 2 2019 మార్చి 15

వన్డే ఇంటర్నేషనల్స్

[మార్చు]
  • అత్యధిక జట్టు మొత్తం: 361/3 v. కెనడా vs 2024 సెప్టెంబరు 24న యునైటెడ్ గ్రౌండ్, విండ్‌హోక్‌లో . [59]
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 173 *, జస్కరన్ మల్హోత్రా v. పాపువా న్యూ గినియా, 2021 సెప్టెంబరు 9న మస్కట్‌లోని అల్ అమెరాట్ క్రికెట్ స్టేడియంలో . [60]
  • ఉత్తమ ఇన్నింగ్స్ బౌలింగ్: 7/32, అలీ ఖాన్ v. జెర్సీ 2023 ఏప్రిల్ 4న యునైటెడ్ గ్రౌండ్, విండ్‌హోక్‌లో . [61] 

వివిధ దేశాలతో వన్డే రికార్డు [57]

వన్డే #4923 వరకు రికార్డులు పూర్తయ్యాయి. చివరిగా నవీకరించబడింది 2025 నవంబరు 3.

ప్రత్యర్థి గె టై నెట్ రన్ రేటు తొలి మ్యాచ్ తొలి గెలుపు
v. Full Members
 Australia 1 0 1 0 0 2004 సెప్టెంబరు 13
 Ireland 1 0 1 0 0 2023 జూన్ 30
 New Zealand 1 0 1 0 0 2004 సెప్టెంబరు 10
 వెస్ట్ ఇండీస్ 1 0 1 0 0 2023 జూన్ 18
 జింబాబ్వే 1 0 1 0 0 2023 జూన్ 26
v. Associate Members
 Canada 5 4 1 0 0 2023 మార్చి 29 2024 ఆగస్టు 13
 జెర్సీ 1 1 0 0 0 2023 ఏప్రిల్ 4 2023 ఏప్రిల్ 4
 నమీబియా 11 7 4 0 0 2019 సెప్టెంబరు 17 2019 సెప్టెంబరు 17
 నేపాల్ 11 6 4 1 0 2020 ఫిబ్రవరి 8 2021 సెప్టెంబరు 17
 Netherlands 3 0 3 0 0 2023 జూన్ 22
 ఒమన్ 10 3 6 1 0 2020 ఫిబ్రవరి 6 2022 జూన్ 8
 పపువా న్యూగినియా 10 7 2 1 0 2019 ఏప్రిల్ 27 2019 సెప్టెంబరు 13
 Scotland 8 3 5 0 0 2019 డిసెంబరు 9 2019 డిసెంబరు 9
 United Arab Emirates 11 9 2 0 0 2019 డిసెంబరు 8 2019 డిసెంబరు 8

ట్వంటీ20 అంతర్జాతీయాలు

[మార్చు]
  • అత్యధిక జట్టు మొత్తం: 230/3 v. కెనడా vs 2024 ఏప్రిల్ 9న హూస్టన్‌లోని ప్రైరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్‌లో . [64]
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 101 *, స్టీవెన్ టేలర్ v. జెర్సీ 2022 జూలై 11న బులవాయో అథ్లెటిక్ క్లబ్, బులవాయోలో . [65]
  • ఉత్తమ ఇన్నింగ్స్ బౌలింగ్: 5/12, సౌరభ్ నేత్రావల్కర్ vs. సింగపూర్ 2022 జూలై 12న బులవాయో అథ్లెటిక్ క్లబ్, బులవాయోలో . [66] 

ఇతర దేశాలతో పోలిస్తే టీ20ఐ రికార్డు [58]

టీ20ఐ #3696 వరకు రికార్డులు పూర్తయ్యాయి. చివరిగా 2026 ఫిబ్రవరి 10న నవీకరించబడింది.

ప్రత్యర్థి గె టై నెట్ రన్ రేటు తొలి మ్యాచ్ తొలి గెలుపు
v. Full members
 బంగ్లాదేశ్ 3 2 1 0 0 2024 మే 21 2024 మే 21
 ఇంగ్లాండు 1 0 1 0 0 2024 జూన్ 23 -
 భారతదేశం 2 0 2 0 0 2024 జూన్ 12 -
 Ireland 2 1 1 0 0 2021 డిసెంబరు 22 2021 డిసెంబరు 22
 Pakistan 2 0 1 1 0 2024 జూన్ 6 2024 జూన్ 6
 South Africa 1 0 1 0 0 2024 జూన్ 19 -
 వెస్ట్ ఇండీస్ 1 0 1 0 0 2024 జూన్ 21 -
 జింబాబ్వే 1 0 1 0 0 2022 జూలై 14 -
v. Associate Members
 అర్జెంటీనా 1 1 0 0 0 2021 నవంబరు 11 2021 నవంబరు 11
 బహామాస్ 2 2 0 0 0 2021 నవంబరు 13 2021 నవంబరు 13
 బెలిజ్ 1 1 0 0 0 2021 నవంబరు 7 2021 నవంబరు 7
 బెర్ముడా 5 3 2 0 0 2019 ఆగస్టు 18 2021 నవంబరు 8
 Canada 12 7 3 1 1 2019 ఆగస్టు 21 2024 ఏప్రిల్ 7
 కేమన్ ఐలాండ్స్ 3 3 0 0 0 2019 ఆగస్టు 19 2019 ఆగస్టు 19
 జెర్సీ 1 1 0 0 0 2022 జూలై 11 2022 జూలై 11
 నమీబియా 2 2 0 0 0 2024 అక్టోబరు 1 2024 అక్టోబరు 1
 నేపాల్ 3 0 2 1 0 2024 అక్టోబరు 17 -
 Netherlands 3 0 3 0 0 2022 జూలై 15 -
 ఒమన్ 3 3 0 0 0 2025 ఫిబ్రవరి 20 2025 ఫిబ్రవరి 20
 పనామా 1 1 0 0 0 2021 నవంబరు 7 2021 నవంబరు 7
 పపువా న్యూగినియా 1 0 1 0 0 2022 జూలై 17 -
 సింగపూర్ 1 1 0 0 0 2022 జూలై 12 2022 జూలై 12
 United Arab Emirates 4 1 2 0 1 2019 మార్చి 15 2024 సెప్టెంబరు 30

మూలాలు

[మార్చు]
  1. "ICC Rankings". International Cricket Council.
  2. "ODI matches - Team records". ESPNcricinfo.
  3. "ODI matches - 2023 Team records". ESPNcricinfo.
  4. "T20I matches - Team records". ESPNcricinfo.
  5. "T20I matches - 2023 Team records". ESPNcricinfo.
  6. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  7. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  8. "USA formally approved to rejoin ICC as Associate Member under USA Cricket". ESPN Cricinfo. Retrieved January 8, 2019.
  9. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  10. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  11. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  12. "USACA expelled by the ICC". ESPNcricinfo. Retrieved September 25, 2017.
  13. 13.0 13.1 Das, Deb (n.d.). "Cricinfo – Cricket in the USA". Cricinfo. Retrieved 2007-03-09.
  14. "Canada Versus United States of America Cricket 1844 St George Cricket Club Ground, Manhattan, New York". Cricket Club. n.d. Archived from the original on October 6, 2006. Retrieved 2007-03-09.
  15. "Canada Cricket Online". Canada Cricket. n.d. Archived from the original on October 27, 2006. Retrieved 2007-03-09.
  16. Harris, Jon; et al. (2002). "Some stories, some history, some facts, some observations: Canadian Cricket History". Retrieved 2009-07-23.
  17. "Early Baseball and Cricket in America". Seattle Cricket Club. n.d. Retrieved 2007-03-09.
  18. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  19. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  20. "USACA expelled by the ICC". ESPNcricinfo. Retrieved September 25, 2017.
  21. 21.00 21.01 21.02 21.03 21.04 21.05 21.06 21.07 21.08 21.09 Timeline of USA cricket Archived డిసెంబరు 2, 2008 at the Wayback Machine at CricketEurope
  22. List of ODIs played by the USA Archived సెప్టెంబరు 29, 2007 at the Wayback Machine
  23. 23.0 23.1 "ICC expels USA from Intercontinental Cup". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-11-17.
  24. 24.0 24.1 "Americas Division One at Cricket Archive". Archived from the original on March 18, 2009. Retrieved March 14, 2007.
  25. 25.0 25.1 World Cricket League Structure Archived సెప్టెంబరు 29, 2007 at the Wayback Machine
  26. 26.0 26.1 "ICC suspends USA Cricket Association". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-11-17.
  27. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  28. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  29. 29.0 29.1 Results Archived జూలై 6, 2008 at the Wayback Machine at WCL5 Official site
  30. "ICC suspends USACA over 'significant concerns'". Cricinfo. June 26, 2015.
  31. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  32. "USACA expelled by the ICC". ESPNcricinfo. Retrieved September 25, 2017.
  33. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  34. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  35. 35.0 35.1 "USA to host Ireland in first home series against Full Member". ESPN Cricinfo. Retrieved 9 November 2021.
  36. 36.0 36.1 "USA v Ireland: Irish to make historic American tour in festive series". BBC Sport. Retrieved 9 November 2021.
  37. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  38. "USACA expelled by the ICC". ESPNcricinfo. Retrieved September 25, 2017.
  39. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  40. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  41. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  42. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  43. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  44. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  45. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  46. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  47. "USACA expelled by the ICC". ESPNcricinfo. Retrieved September 25, 2017.
  48. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  49. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  50. "USACA expelled by the ICC". ESPNcricinfo. Retrieved September 25, 2017.
  51. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  52. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  53. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  54. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  55. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  56. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  57. 57.0 57.1 "Records / United States / One-Day Internationals / Result summary". ESPNcricinfo. Retrieved 17 September 2022.
  58. 58.0 58.1 "Records / United States / Twenty20 Internationals / Result summary". ESPNcricinfo. Retrieved 17 September 2022.
  59. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  60. "USACA expelled by the ICC". ESPNcricinfo. Retrieved September 25, 2017.
  61. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  62. "Records / United States / One-Day Internationals / Most runs". ESPNcricinfo. Retrieved 15 March 2019.
  63. "Records / United States / One-Day Internationals / Most wickets". ESPNcricinfo. Retrieved 15 March 2019.
  64. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  65. "USACA expelled by the ICC". ESPNcricinfo. Retrieved September 25, 2017.
  66. "A brief history ..." ESPNcricinfo. 18 May 2005.
  67. "Records / United States / Twenty20 Internationals / Most runs". ESPNcricinfo. Retrieved 15 March 2019.
  68. "Records / United States / Twenty20 Internationals / Most wickets". ESPNcricinfo. Retrieved 15 March 2019.