అక్షాంశ రేఖాంశాలు: 16°22′35″N 78°50′00″E / 16.3763093°N 78.8333631°E / 16.3763093; 78.8333631

అమ్రాబాద్ మండలం (నాగర్‌కర్నూల్ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమ్రాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

అమ్రాబాద్
—  మండలం  —
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°22′35″N 78°50′00″E / 16.3763093°N 78.8333631°E / 16.3763093; 78.8333631
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం అమ్రాబాద్ (నాగర్‌కర్నూల్ జిల్లా)
గ్రామాలు 8
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 1,219 km² (470.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 50,133
 - పురుషులు 24,868
 - స్త్రీలు 25,265
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.39%
 - పురుషులు 63.62%
 - స్త్రీలు 34.66%
పిన్‌కోడ్ 5092011

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 75 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం అచ్చంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నాగర్‌కర్నూల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  8  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం అమ్రాబాద్.

మండల భౌగోళిక సరిహద్దులు

[మార్చు]

అమ్రాబాదు మండలం కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యన ఉంది. ఈ రెండు నదులతో పాటు ఈ మండలం కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్గొండ జిల్లాల సరిహద్దులను కలిగి ఉంది. ఉత్తరమున, పశ్చిమమున కొల్లాపూర్, లింగాల, బల్మూర్, అచ్చంపేట మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

అమ్రాబాదు వైశాల్యం రీత్యా నాగర్‌కర్నూల్ జిల్లాలో అతి పెద్ద మండలం. కానీ జనసాంద్రత తక్కువ. మండలంలో అధికభాగం నల్లమల అడవులతో విస్తరించి ఉంది. మండలాలేర్పడక మునుపు అమ్రాబాద్ తాలూకా కేంద్రంగా ఉంది. మండల కేంద్రమైన అమ్రాబాదు 150 మీటర్ల ఎత్తున్న పీఠభూమిపై ఉంది. మన్ననూరు, అమ్రాబాదు దరిదాపుల్లో కొన్ని కిలోమీటర్ల మేరకు తప్ప మిగిలిన మండలమంతా ఎత్తైన కొండలతో నిండి ఉంది.[3] అమ్రాబాద్ మండలంలో చెంచుల తెగకు చెందిన జనాభా ఎక్కువగా ఉన్నారు.[4]

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 50,133 - పురుషులు 24,868 - స్త్రీలు 25,265. అక్షరాస్యుల సంఖ్య 25131.[5]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 1219 చ.కి.మీ. కాగా, జనాభా 32,230. జనాభాలో పురుషులు 15,730 కాగా, స్త్రీల సంఖ్య 16,500. మండలంలో 7,661 గృహాలున్నాయి.[6]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అమ్రాబాద్
  2. మాచారం
  3. తుర్కపల్లి
  4. మన్ననూర్
  5. తిరుమలాపూర్ (బి.కె)
  6. లక్ష్మాపూర్ (బి.కె)
  7. ఉప్పునూతల (బి.కె)
  8. వట్వర్లపల్లి

ఇతర వివరాలు

[మార్చు]

మండలంలోని బౌరాపూర్‌ గ్రామంలో భ్రమరాంబ దేవాలయం ఉంది.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
  3. Indian minerals, Volume 23 By India. Mineral Information Bureau, Geological Survey of India
  4. Development of primitive tribal groups in India By P. K. Mohanty
  5. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  6. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]