అయాచితం శ్రీధర్
| అయాచితం శ్రీధర్ | |||
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2017 - 2023 డిసెంబర్ 7[1] | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
|---|---|---|---|
| నివాసం | హైదరాబాద్ | ||
| వృత్తి | రచయిత, వక్త, విమర్శకుడు | ||
అయాచితం శ్రీధర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రచయిత, కవి, ఉద్యమకారుడు. ఆయన 2017 ఫిబ్రవరి - డిసెంబర్ 2023 వరకు తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా పని చేశాడు.[2]
అయాచితం శ్రీధర్ తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ టీజేఏసీ అధ్యక్షుడిగా ఉంటూ తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ కేంద్రంగా నడిచిన సకలజనభేరి, మిలియన్ మార్చ్, సాగరహారం, సకలజనుల సమ్మె, వంటావార్పు లాంటి కార్యక్రమాలను తెలంగాణ జేఏసీ అధ్యక్షుడిగా ముందుండి నడిపించాడు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2017 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం అయాచితం శ్రీధర్ ను తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా నియమించింది.
పురస్కారాలు
[మార్చు]అయాచితం శ్రీధర్ 2022లో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మహాకవి వానమామలై వరదాచార్యుల పురస్కారాన్ని అందుకున్నాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా అయాచితం శ్రీధర్". నమస్తే తెలంగాణ. Archived from the original on 2018-09-10. Retrieved 2017-02-16.
- ↑ "అయాచితం శ్రీధర్‌కు వానమామలై పురస్కారం". NT News. 24 August 2022. Archived from the original on 5 October 2025. Retrieved 5 October 2025.