అయితాబత్తుల ఆనందరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అయితాబత్తుల ఆనందరావు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2019
ముందు పినిపె విశ్వరూప్
తరువాత పినిపె విశ్వరూప్
నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1969
అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి అరుణ

అయితాబత్తుల ఆనందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఐ ఆనందరావు 1969లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురంలో జన్మించాడు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎం.ఏ., బి.ఎల్ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

ఐ ఆనందరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో అమలాపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పినిపె విశ్వరూప్ చేతిలో 34737 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2014లో అమలాపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పినిపె విశ్వరూప్ పై 12413 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఐ ఆనందరావు 2019లో అమలాపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పినిపె విశ్వరూప్ చేతిలో 25654 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  3. Sakshi (2019). "Amalapuram Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 24 December 2021. Retrieved 24 December 2021.