అయోమయ నివృత్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉండవచ్చు లేక అనేక పదాలు ఉండవచ్చు. అలాగే ఒకే పదం రెండు లేక అంతకంటే ఎక్కువ పదాలకు వేరు వేరు అర్ధాల నివ్వవచ్చు. ఒకే పదానికి ఉన్న వేరు వేరు అర్ధాలను నివృత్తి చేసుకొనుటను అయోమయ నివృత్తి అంటారు.

వికీపీడియా లో ఈ పదాన్ని ఉపయోగించు విధానం[మార్చు]

వికిపీడియాలో అదే పేరుతో రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాసాలు ఉన్నప్పుడు వికీపీడియన్లు "అయోమయ నివృత్తి" పేజీలను ఏర్పాటు చేస్తారు. వికీపీడియాలో ఒకే అర్ధాన్నిచ్చే వ్యాసాలు ఉన్నప్పుడు అయోమయ నివృత్తి పేజీ తయారు చేసి (అనగా మొదట {{అయోమయ నివృత్తి}} మూస చేర్చి) ఆ పేజీ లో నుండి సంబంధించిన వ్యాసాలకు వికీలింకులిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి వ్యాసం గురించి తెలుసుకునేందుకు వికిపీడియాలో వెతికినప్పుడు వికిపీడియా సెర్చ్ ఇంజిన్ "వ్యాసం" అనే పేరుతో ఉన్న పేజీని చూపిస్తుంది. వ్యాసం అనే పేరుతో ఒకటి కంటే ఎక్కువ వ్యాసాలు ఉన్నందున ఆ పేజీ వ్యాసం (అయోమయ నివృత్తి)లో చూపించబడుతుంది. వ్యాసం గురించి వెతుకుతున్న వ్యక్తి ఆ పేజీలో వివరణాత్మకంగా వివరించబడిన (ఈ క్రింది విధంగా) వాటిలో తనకు కావలసిన పేజీకి తను ఎంచుకొని సులభంగా ఆ పేజీకి చేరుకుంటాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

నానార్థాలు - ఒకే పదానికి వేరు వేరు అర్థాలను ఇచ్చు పదాలు

మూలాలు[మార్చు]