అయ్యలరాజు రామభద్రుడు

వికీపీడియా నుండి
(అయ్యలరాజు రామభధ్రుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అయ్యలరాజు రామభద్రుడు 16 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. ఈయన ఆంధ్ర భోజుడు,సాహితీ సమరాంగణ సార్వభౌముడు, విజయనగర సామ్రాజ్య పాలకుడు అయిన శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని భువనవిజయం లోని అష్ట దిగ్గజాల లో ఒకడు. ఈ విషయం పరిశోధనలో ఉంది. కానీ నిస్సంశయముగా వారికి సమకాలీనుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన ఈనాటి కడప జిల్లాకు చెందినవాడు. సుమారు 1500-1565ల కాలానికి చెందినవాడు. ఈయన అయ్యలరాజు వంశానికి చెందిన అయ్యలరాజు తిప్పయ్య గారి మనుమడు అని ఆరుద్ర గారు చెప్పారు. ఈ అయ్యలరాజు తిప్పయ్య గారే ఒంటిమిట్ట రఘువీర శతకకర్త. రామభద్రుడు వ్రాసిన "రామాభ్యుదయాన్ని" శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియ రామరాయలు యొక్క మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. ఈతను ఇంకా "సకలకథాసారానుగ్రహము" అనే సంస్కృత గ్రంథము కూడా వ్రాసాడు. కానీ ఆ గ్రంథము అలభ్యం. ఈకవి యారువేల నియోగిబ్రాహ్మణుడు; తిప్పయార్యుని ప్రపౌత్రుడు; పర్వతన్నపౌత్రుడు; అక్కయార్యుని పుత్రుడు. ఈతడు కడపమండలములోని యొంటిమెట్ట గ్రామములో బుట్టి పెరిగినవాడు; పరవస్తు ముమ్మడి వరదాచార్యునకు శిష్యుడయి వైష్ణవమతాభిమానమును గలిగియుండినవాడు. ఇత డొంటిమెట్టలో నున్నకాలములో నచ్చటి వీరరాఘవస్వామిమీద నొకశతకమును జేసెను. ఇతడు మొట్టమొదట కృష్ణదేవరాయల యంతిమదశలో విజయనగరములో బ్రవేశించి కృష్ణదేవరాయనిచేత దద్విరచితమయిన సకలకథాసారసంగ్రమును తెనిగింప గోరబడెను. కాని గ్రంథపూర్తి కాకముందే కృష్ణదేవరాయలు పరమపదం నొందినందున రామభద్రకవి గ్రంథం నాతని కంకితం చేయక యవతారికయందు కృష్ణదేవరాయల ప్రార్థనచేత దానాగ్రంథమును రచించితినని మాత్రము వ్రాసెను. ఈసకల కథాసారసంగ్రహం శ్రీరామ పురూరవశ్చరిత్రాదులనుగల తొమ్మిది యాశ్వాసముల గ్రంథముగా నున్నది. ఈగ్రంథమునందును రామభద్ర కవి సూక్ష్మబుద్ధి గలవాడని యూహించుటకు దగినమార్గము లనేకములు గానబడుచున్నను, కవిత్వము ప్రౌడముగాక వ్యాకరణదుష్టమయి బాలవిరచిత మని సూచించుచున్నది. 1530 వ సంవత్సరమున కొకటి రెండేండ్లుముం దీకవి గ్రంథరచనకారంభించినట్లు తోచుచున్నది. ఈకవి సకల కథాసారసంగ్రహముయొక్క యవతారికయందు దాను గ్రంథరచన చేయబూనుటనుగూర్చి యీక్రిందిపద్యమును వ్రాసి యున్నాడు-

ఉ. నన్నయ తిక్కనాదికవినాథులు చెప్పినయట్లు చెప్పలే

'కున్న దదుత్తరాంధ్రకవు లూరకయుండిరె తోచినట్లు ని

త్యోన్నతబుద్ధి గబ్బములు యోజ రచింపక యందు జ్ఞానసం
పన్నులకావ్యముల్ హరిసమర్పణమై జెలువొందు నెందునన్.

రామాభ్యుదయము

[మార్చు]
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన గ్రంథ ముఖ చిత్రం

రామాభ్యుదయము ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధము. ఇందులో కొన్ని చమత్కారాలు ఉన్నాయి. దశరథుని పుత్రకామేష్ఠి సందర్భంలోని వ్యాకరణ ప్రస్తావన, శూర్ఫణఖ ముక్కు, చెవులు కోసింది లక్ష్మణుడు కాదని చెప్పడం ఇందులోని ప్రత్యేకతలు. ఈ కావ్యం వ్యాకరణ, అలంకార శాస్త్రానికి, చక్కని ఉదాహరణ. రామకథను ప్రబంధ కావ్యంగా వ్రాయటమనేది గొప్ప ప్రయోగం. దాన్ని విజయవంతంగా పూర్తి చేయటం రామభద్రుడికే చెల్లింది. కాని పాత్ర పోషణ పట్ల కొంత అశ్రద్ధ అనేదీతని బలహీనత. కాని ఇందులో ఆయన రామరాజభూషణుడు అనబడే భట్టుమూర్తి కన్న నయము, అనేది పండితుల అభిప్రాయము. అశోకవనంలో ఆంజనేయస్వామి సీతమ్మ వారికి శ్రీరాముని ముద్రిక ఇచ్చినపుడు సీతమ్మ అన్న మాటలను రామభద్రుడు 14 పద్యాలుగా వ్రాశాడు. ఆ పద్యాలే రామాభ్యుదయానికి సొబగులద్దాయి అని పండితుల అభిప్రాయము.

రామాభ్యుదయము లోని అలంకార ప్రత్యేకతలకు క్రింద ఉదహరించిన పద్యము చక్కని ఉదాహరణ.ఈ పద్యము 7వ ఆశ్వాసము లోని 75 వ కంద పద్యం. ఇందులో విభీషణుడు రావణునికి నీతి చెప్తున్నప్పటిది.

సకలకధాసారసంగ్రహం

[మార్చు]

ఈ కవి వ్రాయ తలపెట్టిన/అంకితమీయ సంకల్పించిన సకల కథాసార సంగ్రహము అను గ్రంథము ముగింపకమునుపే కృష్ణదేవరాయలు మృతినొందినందున, ఆదరించుప్రభువులు లేక బీదవాడయిన రామభద్రకవి యందందు దిరిగి గుత్తియప్పలరాజు మొదలైనవారి నాశ్రయించి వారిమీద జాటుపద్యములను జెప్పుచు, గొంతకాలము జీవనముచేసి, కడపట కృష్ణదేవరాయని యల్లు డయిన రామరాజుయొక్క మేనల్లు డగు గొబ్బూరి నరసరాజువద్ద జేరి తాను తరువాత రచియించిన రామాభ్యుదయము నారాజున కంకితము చేసెను. ఈకవి గుత్తి యప్పలరాజుపయిని జెప్పిన చాటుపద్య మొకటి యిందు క్రింద బొందుపఱుచుచున్నాను-

రాజమనోజా! విద్యా! భోజా! దీనార్థికల్పభూజా! రిపుసం
భాజా! వైభవవిజితబి డౌజా! రవితేజ! గుత్తి యప్పలరాజా!

కవి చివరిదశలో

[మార్చు]

ఈకవి చిరకాలము జీవించి బహుసంతానవంతు డయి దారిద్ర్యముచేత బాధపడినవాడు. ఈతని సంతానాధిక్యమునుబట్టి యితనిని జనులు పిల్లల రామభద్రయ్య యనియు పిలిచెడువాడుక గలదు. ఇతడు కృష్ణదేవరాయని యాస్థానకవి యన్నపేరే కాని యీతనికాల మంతయు నించుమించుగా నారాయనియనంతరముననే గడుపబడినది. ఇతడు కొంతకాలము పింగళి మారన్నకును, తరువాత రామరాజ భూషణునకును సమకాలికుడుగా నుండి కృష్ణదేవరాయల మరణానంతరమున నించుమించుగా నలుబది యేబది సంవత్సరములు బ్రదికి 1580 వ సంవత్సరప్రాంతమునందు మృతినొందెను. ఈతడు చేసినగ్రంథము రామాభ్యుదయము ముఖ్య మయినది. ఇది మిక్కిలి ప్రౌడమయిన కవితాధోరణికలదయి, పదగుంభనమునందు పాండురంగ మహాత్మ్యమును బోలి యమకానుప్రాసములను గలదిగానున్నది. ఈకవి ప్రారంభదశయందు గృష్ణదేవరాయల దర్శనార్థముగా విజయనగరము వచ్చినప్పుడూరిబయల రామరాజభూషణునిశిష్యు లొకపద్యమును గుర్వాజ్ఞానుసారముగా జెప్పబూని కుదురక యాలోచించుచున్నట్లును, వారు చలిచేత వడ్కుచు నచ్చటకు రా దటస్థించిన యీ కవికి చలిమంట వేసి కప్పుకొన బట్ట నిచ్చి యతనిచేత

సీ.మోహాపదేశ తమోముద్రితము లైన
కనుదమ్ముల హిమంబు లునుపరాదు
శ్రమబిందుతారకాగమఖిన్నకుచకోక
ముల జంద్రనామంబు దలపరాదు
శీర్యదాశావృంత శిథిలతాసులతాంత
మసియాడ వీవనల్విసరరాదు
పటుతాపపుటపాక పరిహీణతను హేమ
మింక బల్లవపుటా ర్చిడగరాదు
లలన కానంగకీలికీలాకలాప
సంతతాలీడ హృదయపాత్రాంతరాళ చ. ప్రమద మెలర్ప నుగ్రమృగబాధ హరింపగ వేటమై నర
ణ్యమునకు రా నఘం బొదవె నక్కట| ధర్మము చాలు గుక్క బ
ట్టు మనుట యెంచి విల్లబు తటుక్కున ధారుణి వైచి సారమే
యముల మరల్ప బంచె మృగయాక్రియ మాని విభుండు ఖిన్నుడై. [అ.2]
ఉ. అక్కట! కోసలక్షీతివరాత్మజ కానకకన్నముద్దులే
జక్కనిమంచిరాకొమరుజందురు డెక్కడ ? యధ్వరావనం
బెక్కడ ? దైత్యసంహరణ మెక్కడ ? ఘోరవనాంతరశ్రమం
బెక్కడ ? యెట్టు లంపుమనియె న్ముని ? నో రెటులాడె నింతకున్ ? [అ.4]
ఉ. వింధ్య మధిత్యకాకటకవిస్ఫుటపాదపపుష్ప గుచ్ఛసౌ
గంధ్యము హేమధాతుమయకల్పితసంధ్యము బద్ధమేరుసా
గంధ్యము చండకేసరనికాయనిరాకృతభద్రదంతిద
ర్పాంధ్యము గ్రుంగద్రొక్కితి మహాగుణభూషణ సత్యభాషణా. [అ.5
ఉ. చూచుటలే దశోకవని జొచ్చి యటుంజని చూచెదంగదా!
యాచపలాక్షి మజ్జినని యచ్చటనుండినయేని లెస్స లే
దా చతురాననుండు మొదలైన నుపర్వు లెఱుంగ జిచ్చులో
వై చెదగాక యీయొడలు వానరవీరులమ్రోల వైతునే ? [అ.6]

పరుషోక్తి బాధ చూడకు,
పరిణామ సుఖముచూడు, బ్రతికెద వసురే
శ్వర! మందు చేదుచూడకు,

పెరిగిన తెవులడగ జూడు పెద్దతనానన్!

సూచికలు

[మార్చు]


అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు