Jump to content

అరటికాయ చిప్స్

వికీపీడియా నుండి
అరటికాయ చిప్స్
రకంచిప్స్, కరకరలాడేవి
Courseనూనె లో వేయించినవి, చిరుతిండి, భోజనంలో పక్కన తినేవి
వడ్డించే ఉష్టోగ్రతగది ఉష్ణోగ్రత
ప్రధాన అనుఘటకాలుఅరటి కాయ

అరటికాయ చిప్ అంటే అరటికాయను పలుచని ముక్కలుగా కోసి, నూనెలో వేయించి కానీ ఎండబెట్టి చేసిన కరకరలాడే ఆహార పదార్థం. వీటిని అరటికాయ క్రిస్ప్ అని కూడా పిలుస్తారు. దీనిని సాధారణంగా గట్టిగా ఉండే, పిండి పదార్థం అధికంగా ఉండే అరటి రకాలైన అరటి కాయలు లేదా సబా, నెంద్రన్ కల్టివార్ల రకాలతో తయారు చేస్తారు. ఇవి తీపిగా లేదా కారంగా ఉండవచ్చు. వీటిపై చక్కెర, తేనె, ఉప్పు లేదా వివిధ రకాల మసాలాలను జల్లుతారు.[1][2]

అంతర్జాతీయ స్థాయిలో అరటి ఉత్పత్తులలో గణనీయమైన వాణిజ్యం జరిగేది అరటికాయ చిప్స్ కు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా అరటికాయ చిప్స్‌ను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం ఫిలిప్పీన్స్. భారతదేశం, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా దేశాలు కూడా అరటికాయ చిప్స్‌కు ముఖ్యమైన ఎగుమతి మార్కెట్ ఉన్న దేశాలు.[3][4][5]

వేయించిన అరటికాయ చిప్స్

[మార్చు]

వేయించిన అరటికాయ చిప్స్‌ను సాధారణంగా పచ్చి (పూర్తిగా పండని) అరటికాయలను పలుచగా కోసి, పొద్దుతిరుగుడు నూనె లేదా కొబ్బరి నూనెలో వేయించి తయారు చేస్తారు. ఈ చిప్స్ బంగాళాదుంప చిప్స్‌లా పొడిగా ఉంటాయి. దీంట్లో సుమారు 4% నీరు ఉంటుంది. వీటికి ఉప్పు, మసాలా, చక్కెర లేదా బెల్లం పూత వేసి చేస్తారు. కొన్నిసార్లు అరటి సువాసన ఇచ్చే ఐసోఅమైల్ ఎసిటేట్ (Isoamyl acetate) అనే రసాయనాన్ని కూడా కలుపుతారు. పూర్తిగా పండిన అరటిపండ్లతో చిప్స్ తయారు చేస్తే ఇవి మెత్తగా తయారవుతాయి. అందుకని అలాంటి వాటిని పొడి చిప్స్‌గా కాకుండా మిఠాయిల తయారీలో ఉపయోగిస్తారు.

అరటికాయ చిప్స్
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి2,170 kJ (520 kcal)
58.40g
33.60g
2.30g
విటమిన్లు Quantity
%DV
రైబోఫ్లావిన్ (B2)
7%
0.085 mg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
1%
6 mg
మెగ్నీషియం
151%
536 mg
పొటాషియం
0%
0.017 mg
సోడియం
0%
0.75 mg

Percentages are roughly approximated using US recommendations for adults.

ఎండబెట్టిన అరటికాయ చిప్స్

[మార్చు]

కొన్ని రకాల అరటికాయ చిప్స్‌ను కేవలం ఆహార నిర్జలీకరణ (డీహైడ్రేషన్) ప్రక్రియ ద్వారా మాత్రమే తయారు చేస్తారు. ఈ విధంగా ఎండబెట్టిన అరటికాయ ముక్కలు ముదురు పసుపు రంగులో కరకరలాడేలా కాకుండా, గోధుమరంగులో ఉండి తోలులా నమిలే స్వభావంతో ఉంటాయి. ఇవి చాలా తీపిగా ఉండి, ఘాటైన అరటి రుచిని కలిగి ఉంటాయి. వీటిని పూర్తిగా పండిన అరటిపండ్లతో తయారు చేయడం ఉత్తమం. మరో రకాన్ని ఓవెన్‌లో కాల్చి తయారు చేస్తారు. అయితే ఈ విధానంలో అదే స్థాయి అరటి రుచి రాకపోవచ్చు.

పోషక విలువలు

[మార్చు]

ఎండబెట్టిన అరటికాయ చిప్స్‌లో 4% నీరు, 58% కార్బోహైడ్రేట్లు, 34% కొవ్వు, 2% ప్రోటీన్ ఉంటాయి. 100 గ్రాముల పరిమాణంలో ఇవి 520 కేలరీలను అందిస్తాయి. అలాగే మెగ్నీషియం (రోజువారీ అవసరంలో 21%), విటమిన్ B6 (20%) సమృద్ధిగా లభిస్తాయి. అదనంగా ఇనుము, రాగి, పొటాషియంలు మోస్తరు స్థాయిలో (10%–11% రోజువారీ అవసరం మేరకు) లభిస్తాయి. ఇతర సూక్ష్మ పోషకాలు చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఉంటాయి.

వివిధ దేశాలలో ఉపయోగాలు

[మార్చు]

ఫిలిప్పీన్స్

[మార్చు]
ఫిలిప్పీన్స్ లో చేసే అరటికాయ చిప్స్

ప్రపంచవ్యాప్తంగా అరటికాయ చిప్స్‌ను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం ఫిలిప్పీన్స్. ఈ దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, చైనా, రష్యాతో సహా 30 పైగా దేశాలకు పెద్ద మొత్తంలో అరటికాయ చిప్స్‌ను ఎగుమతి చేస్తుంది. 2009లో ఫిలిప్పీన్స్ అరటికాయ చిప్స్ ఎగుమతుల ద్వారా సుమారు 35 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.[4][3][2]

ఫిలిప్పీన్స్‌లో సంప్రదాయ పినాసుగ్బో (pinasugbo) నుంచి చీజ్ తురుము పూతతో తయారుచేసే ఆధునిక రకాల వరకు అనేక రకాల అరటికాయ చిప్స్ లభిస్తాయి. అక్కడ అరటికాయ చిప్స్‌ను ప్రధానంగా సబా లేదా కార్డవా అరటి రకాలతో తయారు చేస్తారు. వాణిజ్యపరంగా తయారుచేసే అరటికాయ చిప్స్‌కు పెద్ద పరిమాణంలో ఉండే కార్డవా అరటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

గృహావసరాల కోసం తయారుచేసే అరటికాయ చిప్స్‌లో తాజా అరటికాయ ముక్కలను నేరుగా నూనెలో వేయిస్తారు. అయితే ఎగుమతి మార్కెట్ కోసం వాణిజ్యపరంగా తయారుచేసే అరటికాయ చిప్స్‌లో ప్రధానంగా ఆస్మోటిక్ నిర్జలీకరణ (osmotic dehydration) ప్రక్రియను అనుసరించిన తరువాత, కొబ్బరి నూనెలో 375 °F (191 °C) ఉష్ణోగ్రత వద్ద ఒక నిమిషం పాటు నూనెలో వేయిస్తారు. ఈ విధంగా తయారైన అరటికాయ చిప్స్ ప్రత్యేకంగా లేత రంగులో ఉంటాయి.[2][6][7]

భారతదేశం

[మార్చు]

వేయించిన అరటికాయ చిప్స్‌ను కేరళలో నెంథ్రా-కయా ఊప్పెరి లేదా వజాయక్కా అప్పేరి లేదా అప్పేరి అని పిలుస్తారు. వీటిని కొబ్బరి నూనెలో వేయిస్తారు.[8] ఈ రకమైన చిప్స్ తయారీలో పండినవి, పచ్చి అరటికాయలను రెండింటినీ ఉపయోగిస్తారు. వీటిపై మసాలా లేదా బెల్లం పూత వేసి కారం, తీపి రుచులలో తయారు చేస్తారు. సాధారణ అరటికాయ చిప్స్, ప్లాంటైన్ చిప్స్‌లను వరుసగా పచ్చకాయ వరుతతు, కయా అప్పేరి అని పిలుస్తారు. బెల్లంతో తయారుచేసిన తీపి అరటికాయ చిప్స్‌ను షర్కరా అప్పేరి లేదా షర్కరా వరట్టి అని అంటారు. షర్కరా వరట్టి ధర ఊప్పెరి కంటే ఎక్కువగా ఉంటుంది. దీనిని ఓణం వంటి పండుగలు, వివాహాల సందర్భంగా ఉండే సాంప్రదాయ కేరళ విందు సద్యలో వడ్డిస్తారు.

ఇండోనేషియా

[మార్చు]
ఇండోనేషియాకు చెందిన కృపిక్ పిశాంగ్ (అరటికాయ చిప్స్)

అరటి మొక్కలు అగ్నేయాసియా సముద్ర (Maritime Southeast Asia) ప్రాంతానికి చెందిన మొక్కలు. ఈ ద్వీపసమూహంలోని ప్రజలు అనాదికాలం నుంచి అరటిని అనేక విధాలుగా వినియోగిస్తున్నారు. వాటిలో చిరుతిండిగా కరకరలాడే అరటికాయ చిప్స్ తయారీ కూడా ఒకటి. ఇండోనేషియాలో అరటికాయ చిప్స్‌ను కృపిక్ పిశాంగ్ (kripik pisang) అని పిలుస్తారు. ఇది దేశవ్యాప్తంగా లభించినప్పటికీ, ముఖ్యంగా జావా, సుమత్రా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తర మలుకులో బాతు నోటి ఆకారంలో ఉండే (pisang mulu bebek) అనే అరటికాయ చిప్స్ తయారు చేస్తారు. వీటిని సాంబల్, వేయించిన వేరుశెనగలు, వేయించిన ఆంచోవీ చేపలతో వడ్డిస్తారు.[9] లాంపుంగ్ ప్రాంతంలో అరటికాయ చిప్స్‌పై చాక్లెట్ పొడిని పూసి కృపిక్ పిశాంగ్ కోకిలేట్ (kripik pisang coklat) పేరుతో తయారు చేస్తారు.[10] సాధారణంగా పచ్చి అరటికాయలను పలుచగా తరిగి, సున్నం, ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టి, ఆ తరువాత లోతైన నూనెలో వేయించి చిప్స్‌గా తయారు చేస్తారు.[11] పచ్చి అరటికాయల్లో నీరు, చక్కెర తక్కువగా ఉండి, పిండి పదార్థం అధికంగా ఉండడం వల్ల అవి నూనెలో వేయించడానికి అనుకూలంగా ఉంటాయి. పిశాంగ్ గోరెన్గ్ (Pisang goreng) కూడా వేయించిన అరటితో తయారుచేసే మరో ముఖ్యమైన చిరుతిండి. అయితే ఇది వేడిగా వడ్డించే తీపి చిరుతిండి.

అమెరికా ఖండాలు

[మార్చు]

అరటికాయ చిప్స్‌ను తరచుగా మ్యూస్లీ, గింజల మిశ్రమాల్లో కలుపుతారు. పటాకోన్స్ వంటి ఇతర చిప్స్ ఉప్పగా ఉంటాయి. ఇలాంటి చిప్స్‌ను చిఫ్లే (chifle) అని పిలుస్తారు. వీటిని ప్లాంటైన్ రకానికి చెందిన అరటికాయలతో తయారు చేస్తారు. ఉష్ణమండల అమెరికా సంస్కృతుల్లో అన్ని అరటి రకాలనూ ప్లాంటైన్‌లుగా పరిగణించినప్పటికీ, అన్ని ప్లాంటైన్‌లు తినే అరటిపండ్లు కావు. నూనెలో వేయించిన ఈ ప్లాంటైన్ చిప్స్ మెక్సికో ఆగ్నేయ ప్రాంతంలో, ముఖ్యంగా టబాస్కో రాష్ట్రంలో కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. mis.dost.gov.ph. "How to Make Sweet and Salted Banana Chips". EntrePinoys Atbp. Archived from the original on 28 December 2011. Retrieved 16 May 2012.
  2. 1 2 3 Pillay, Michael; Tenkouano, Abdou, eds. (2011). Banana Breeding: Progress and Challenges. CRC Press. p. 273. ISBN 978-1-4398-0018-8.
  3. 1 2 Robinson, John Charles; Galán Saúco, Víctor (2010). Bananas and Plantains. CABI. p. 16. ISBN 978-1-84593-738-6.
  4. 1 2 Molina, A.; Valmayor, R. V. (1999). "Banana Production Systems in Southeast Asia". In Picq, C.; Fouré, E.; Frison, E. A. (eds.). Bananas and Food Security / Les productions bananières: un enjeu économique majeur pour la sécurité alimentaire. Bioversity International. p. 434.
  5. "Indian banana prices fall as exports to Middle East slow". www.freshplaza.com (in ఇంగ్లీష్). 2026-03-09. Retrieved 2026-07-09.
  6. Po, Lillian G. (2007). "Major Tropical Fruits and Products: Banana, Mango, and Pineapple". In Hui, Y. H. (ed.). Handbook of Food Products Manufacturing: Health, Meat, Milk, Poultry, Seafood, and Vegetables. John Wiley and Sons. p. 825. ISBN 978-0-470-04964-8.
  7. Dela Cruz, F. S. Jr.; Gueco, L. S.; Damasco, O. P.; Huelgas, V. C.; Dela Cueva, F. M.; Dizon, T. O.; Sison, M. L. J.; Banasihan, I. G.; Sinohin, V. O. & Molina, A. B. Jr. (2008). Farmers' Handbook on Introduced and Local Banana Cultivars in the Philippines (PDF). Bioversity International. ISBN 978-971-91751-8-6.
  8. Ignatius Pereira (April 13, 2013). "Banana Chips from Kerala, India". The Hindu. Retrieved 2013-04-13.
  9. "Kenikmatan Dalam Kesederhanaan Pisang Goreng Mulut Bebek". indonesiakaya.com (in Indonesian). Retrieved 21 April 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  10. Mandasari, Rizky (25 October 2018). "Cara Membuat Keripik Pisang Coklat Khas Lampung". liputan6.com (in Indonesian). Retrieved 21 April 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  11. "Banana Chips (Keripik Pisang)". Indonesian Original Recipe.