Jump to content

అరవింద్ బెల్లాడ్

వికీపీడియా నుండి
అరవింద్ బెల్లాడ్
అరవింద్ బెల్లాడ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2013 మే 8
ముందు చంద్రకాంత్ బెల్లాడ్
నియోజకవర్గం హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్

వ్యక్తిగత వివరాలు

జననం 1969 ఆగష్టు 3
బెల్లాడ్ బాగేవాడి , మైసూర్ రాష్ట్రం (ప్రస్తుత కర్ణాటక ), భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు చంద్రకాంత్ బెల్లాడ్, లీలావతి
జీవిత భాగస్వామి స్మృతి బెల్లాడ్
సంతానం అగస్త్య
ప్రాచ్చి[1]
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు [1]

అరవింద్ చంద్రకాంత్ బెల్లాడ్ (జననం 3 ఆగస్టు 1969) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అరవింద్ బెల్లాడ్ తన తండ్రి చంద్రకాంత్ బెల్లాడ్ అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.ఆర్. మోరేపై 11182 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ ఇస్మాయిల్ తమత్గర్‌పై 40,487 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

అరవింద్ బెల్లాడ్ 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దీపక్ చించోర్‌పై 38,693 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2023 డిసెంబర్ 25న శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Arvind Bellad: Official website". Archived from the original on 28 August 2017. Retrieved 27 August 2017.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. "Karnataka Assembly Elections 2023: Hubli-Dharwad West". Election Commission of India. 13 May 2023. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.
  5. "BJP appoints Srinivas Poojary as Leader of Opposition in Karnataka Council" (in ఇంగ్లీష్). India Today. 25 December 2023. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.