అరసలీశ్వర ఆలయం
| అరసలీశ్వర ఆలయం | |
|---|---|
| మతం | |
| అనుబంధం | హిందూధర్మం |
| జిల్లా | విల్లుపురం జిల్లా |
| దైవం | అరసలీశ్వరుడు |
| ప్రదేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| దేశం | భారతదేశం |
![]() అరసలీశ్వర ఆలయం యొక్క ఇంటరాక్టివ్ మ్యాప్ | |
| నిర్దేశాంకాలు | 12°03′09″N 79°46′22″E / 12.05250°N 79.77278°E |
| వాస్తుశిల్పం | |
| రకం | ద్రావిడ శిల్పకళాశైలి |
అరసలీశ్వర ఆలయం తమిళనాడు రాష్ట్రం, విల్లుపురం జిల్లాలోని ఓలిండియంపట్టు అనే గ్రామంలో ఉన్న శివాలయం. దీన్నిఅరసిలి అని కూడా అంటారు. శివుడు ఇక్కడ అరసలీశ్వరుడిగా పూజిలందుకుంటాడు. పార్వతీ దేవిని పెరియనాయకిగా పూజిస్తారు. 7వ శతాబ్దపు తమిళ శైవ గ్రంథం, తేవారంలో, తమిళ సాధువులైన నాయనార్లు దీనిని పాడల్ పేట్ర స్థలంగా పేర్కొన్నారు.
ఈ ఆలయ సముదాయం దాదాపు ఒక ఎకరం విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రధాన ద్వారం వద్ద మూడు అంతస్తుల గోపురం ఉంది. ఈ ఆలయంలో అనేక మందిరాలు ఉన్నాయి, వాటిలో అరసలీశ్వరుడు, పెరియనాయకి అత్యంత ప్రముఖమైనవి. ఆలయంలోని అన్ని మందిరాల చుట్టూ దీర్ఘచతురస్రాకార గ్రానైట్ గోడల ప్రాకారాలు ఉన్నాయి.
ఈ ఆలయంలో ఉదయం 6:00 నుండి సాయంత్రం 7:00 వరకు వివిధ సమయాల్లో నాలుగు సార్లు దైనందిన పూజలు జరుగుతాయి. నాలుగు వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. వైకాసి నెలలో (మే - జూన్) జరుపుకునే బ్రహ్మోత్సవం అత్యంత ప్రముఖమైన ఉత్సవం.
తొలుత ఈ సముదాయాన్ని చోళులు నిర్మించారు. ప్రస్తుతమున్న రాతి నిర్మాణాన్ని 16వ శతాబ్దంలో స్థానిక పాలకులు నిర్మించారు. ఆధునిక కాలంలో, ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వ హిందూ మత, దాతృత్వ ధార్మిక శాఖ నిర్వహిస్తుంది.
పురాణ గాథ
[మార్చు]
హిందూ పురాణాల ప్రకారం, వామదేవ మహర్షి శివుడిని పూజించడానికి అనేక దేవాలయాలను సందర్శించాడు. అతను ఆ ప్రదేశానికి వచ్చి ఒక అరసు చెట్టు (పీప్లి చెట్టు) కింద నిలబడి, ఆ ప్రదేశంలో శివుడు కనిపిస్తే బాగుంటుందని భావించాడు. ఆ మహర్షి భక్తికి సంతోషించిన శివుడు అరసు చెట్టు స్థానంలో కనిపించి, అరసలేశ్వరుడు అని పేరుపడ్డాడు. ఆ ప్రదేశానికి అరసిలి అని పేరు వచ్చింది. మరొక పురాణం ప్రకారం, ఆ ప్రదేశాన్ని పరిపాలించిన సత్యవర్ధన్ అనే రాజు శివభక్తుడు. తన పూజ కోసం పూలు సేకరించడానికి అతను ఒక తోటను ఏర్పాటు చేశాడు. ప్రతి రోజు తోటలోని పువ్వులను ఎవరో దొంగిలించారని తోటమాలి ఫిర్యాదు చేసేవాడు. ఒక జింక తోటలోని పువ్వులను తింటున్నట్లు రాజు కనుగొన్నాడు. జింకపై కోపం వచ్చిన రాజు, దానిపై బాణం వేయగా, అది గురి తప్పి, వెనుక ఉన్న అరసు చెట్టును తాకింది. అరసు చెట్టు నుండి రక్తం కారడం చూసిన రాజు, అది శివుని అవతారమని గ్రహించాడు. ఆలయ లింగంలో కనిపించే మచ్చ, ఆ రాజు కొట్టిన బాణం దెబ్బే అని నమ్ముతారు.[1]
చరిత్ర
[మార్చు]
సా.శ. 866 - 1004 మధ్య కాలంలో నిర్మించిన చోళ దేవాలయాలలో ఎక్కువ భాగం కొన్ని సైనిక సంఘటనలు లేదా రాజకీయ ప్రచారాలకు సంబంధించినవి. 940 మొదటి పరాంతక చోళుడి కాలంలో రాష్ట్రకూటుల దండయాత్రల వల్ల తరచుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తమిళ ప్రాంతంలో జరిగిన గొప్ప యుద్ధంగా పిలువబడే తక్కోలం యుద్ధం చోళులకు, రాష్ట్రకూటులకూ మధ్య జరిగింది. పరాంతకుడి కుమారుడు రాజాదిత్యుడు ఈ యుద్ధంలో మరణించాడు. మూడవ కృష్ణుడు "తంజై, కాంచీ విజేత" అనే పేరును పొందాడు.[2] ఈ ఆలయంలో విక్రమచోళుడు, కులోత్తుంగ చోళుడి వంటి మధ్యయుగ చోళుల కాలం నాటి ఐదు శాసనాలు ఉన్నాయి. [3] ఆధునిక కాలంలో, ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వ హిందూ మత, ధార్మిక శాఖ నిర్వహిస్తోంది. ఆలయంలోని కాంస్య విగ్రహాలు దొంగిలించబడ్డాయి. తరువాత 2009లో తమిళనాడు పోలీసుల విగ్రహ విభాగం వాటిని పునరుద్ధరించింది.[4]
వాస్తు శైలి
[మార్చు]ఈ ఆలయంలో మూడు అంతస్తుల ప్రవేశ ద్వారం ఉంది. లోపలి ఆలయాల చుట్టూ కేంద్రీకృత దీర్ఘచతురస్రాకార గ్రానైట్ గోడలు చుట్టి ఉంటాయి. ఈ ఆలయం సుమారు 1 acre (0.40 ha) విస్తీర్ణంలో ఉంది. మధ్య మందిరంలో లింగం రూపంలో ఉన్న అరసలీశ్వర విగ్రహం ఉంది. లింగం ఇసుకతో తయారు చేయబడింది. పశ్చిమ ముఖంగా ఉన్న శివుని భార్య గిరిరాజ కన్యక విగ్రహం గర్భగుడికి దారితీసే మహామండపంలో ఉంది. మధ్య మందిరాన్ని ధ్వజస్తంభం, మహామండపం గుండా చేరుకోవచ్చు. మధ్య మందిరానికి దక్షిణం వైపు ప్రవేశ ద్వారం ఉంది. ఆలయ పుష్కరిణి, ప్రధాన ప్రవేశ గోపురం వెలుపల ఉంది. తమిళనాడులోని ఇతర శివాలయాల మాదిరిగానే, వినాయక, మురుగన్, నవగ్రహ, చండికేశ, దుర్గ విగ్రహాలు ప్రధాన మందిరం ఆవరణ చుట్టూ ఉన్నాయి. [5]
పండుగలు, మతపరమైన ప్రాముఖ్యత
[మార్చు]
తమిళ శైవులైన నయనారు సంబందర్ తేవారం పద్యాలలో కీర్తించిన 275 పాడల్ పేట్ర స్థలాలలో ఇది ఒకటి. [3]
ఆలయ పూజారులు పండుగల సమయంలోను, రోజువారీగానూ పూజలు, సేవలూ నిర్వహిస్తారు. ఆలయ ఆచారాలు రోజుకు నాలుగు సార్లు నిర్వహిస్తారు; కలశాంతి ఉదయం 8:00 గంటలకు, ఉచికలం 12:00 గంటలకు, సాయంత్రం. 6:00 గంటలకు సాయరక్షై , 8:00 గంటలకు అర్థజామం. నిర్వహిస్తారు. ప్రతి ఆచారంలోను నాలుగు దశలుంటాయి. అవి: అభిషేకం, అలంకారం, నైవేద్యం, అరసలీశ్వరుడు, గిరిరాజ కన్యకాంబకు దీపారాధన. సోమవారం, శుక్రవారాల్లో వారోత్సవాలు, ప్రదోషం వంటి పక్షోత్సవాలు, అమావాస్య, కిరుతిగై, పౌర్ణమి, చతుర్థి వంటి నెలవారీ ఉత్సవాలు ఉన్నాయి. తమిళ మాసం వైకాసి (మే - జూన్) లో జరిగే బ్రహ్మోత్సవం ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగలు. ఇది నెలలో చిత్ర పౌర్ణమి జరుగుతుంది.[1][5]
మూలాలు
[మార్చు]- 1 2 "Arasaleeswarar temple". Dinamalar. 2014. Retrieved 19 October 2018.
- ↑ Verma, Archana (2017). Temple Imagery from Early Mediaeval Peninsular India. Routledge. p. 257. ISBN 9781351547000.
- 1 2 "Arasili". Thevaaram.org. 2011. Retrieved 14 March 2016.
- ↑ "Stolen idols restored to temple". The Hindu. 16 April 2009. Retrieved 19 October 2018.
- 1 2 R., Dr. Vijayalakshmy (2001). An introduction to religion and Philosophy - Tévarám and Tivviyappirapantam (1st ed.). Chennai: International Institute of Tamil Studies. pp. 174–5.
