Jump to content

అరాఫత్ పర్వతం

Coordinates: మూస:Map scale 21°21′17″N 39°59′02″E / 21.35472°N 39.98389°E
వికీపీడియా నుండి
మౌంట్ అరాఫత్
Хадж на гору Арафат (1965)
Highest point
Elevation454 m (1,490 ft)
Listingసౌదీ అరేబియా పర్వతాలు
Coordinatesమూస:Map scale 21°21′17″N 39°59′02″E / 21.35472°N 39.98389°E / 21.35472; 39.98389
Geography
మౌంట్ అరాఫత్ is located in Saudi Arabia
మౌంట్ అరాఫత్
మౌంట్ అరాఫత్
సౌదీ అరేబియాలో పర్వత స్థానం
మౌంట్ అరాఫత్ is located in Middle East
మౌంట్ అరాఫత్
మౌంట్ అరాఫత్
మౌంట్ అరాఫత్ (Middle East)
మౌంట్ అరాఫత్ is located in Asia
మౌంట్ అరాఫత్
మౌంట్ అరాఫత్
మౌంట్ అరాఫత్ (Asia)
Locationమక్కా సమీపంలో, సౌదీ అరేబియా
Parent rangeహిజాజ్ పర్వతాలు
Geology
Rock age91.3 ± 10.5 లక్షల సంవత్సరాల క్రితం
గ్రాండియోరైట్ కొండ[1]

మౌంట్ అరాఫత్[2] అనేది గ్రానోడియోరైట్ కొండ. సౌదీ అరేబియాలోని అదే పేరు గల రాష్ట్రంలో, మక్కాకు ఆగ్నేయంగా సుమారు 20 km (12 mi) దూరంలో ఉంది.[3] ఇది సుమారుగా 70 m (230 ft) ఎత్తుతో ఉంది. దీని అత్యంత ఎత్తైన ప్రదేశం సముద్ర మట్టానికి 454 మీటర్ల (1,490 అడుగులు) ఎత్తున ఉంది.

ఇస్లాం ప్రవక్త ముహమ్మద్, ప్రవక్త కాకముందు, తన తెగ అయిన ఖురైష్ సంప్రదాయాన్ని ఉల్లంఘించి, ఇతర అరబ్బులతో కలిసి అరఫాలో నిలబడ్డాడు. ఇది అతని తోటి ఖురైషీ తెగకు చెందిన జుబైర్ ఇబ్న్ ముతీమ్‌కు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అతను ముహమ్మద్ హుమ్ తెగకు చెందినవాడని, అతనికి అక్కడ ఏం పని అని ప్రశ్నించారు.[4][5]

ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం, ముహమ్మద్ తన జీవిత చరమాంకంలో హజ్ యాత్రకు తనతో పాటు వచ్చిన సహచరులకు వీడ్కోలు ఉపన్యాసం[6] ఇవ్వడానికి నిలబడిన ప్రదేశం ఈ కొండ. కొంతమంది ముస్లింలు, ఆదాము, హవ్వ స్వర్గం నుండి పడిపోయిన తర్వాత భూమిపై తిరిగి కలుసుకున్న ప్రదేశం అరఫా పర్వతమని నమ్ముతారు. వారు క్షమించబడిన ప్రదేశం ఇదేనని విశ్వసిస్తూ, దీనికి 'కరుణ పర్వతం' అని అర్థం వచ్చే 'జబల్ అర్ రహమాన్' అనే పేరు పెట్టారు. ఈ సంఘటన జరిగినట్లు విశ్వసించే ప్రదేశాన్ని చూపించడానికి పర్వతం పైన ఒక స్తంభాన్ని నిర్మించారు.


హజ్ సమయంలో ఈ పర్వతం చాలా ముఖ్యమైనది. ఇస్లామిక్ నెల అయిన జుల్-హిజ్జాలోని 9వ రోజున, పర్వతం పేరు మీదుగా 'అరఫా దినం' అని కూడా పిలువబడే రోజున, హజ్ యాత్రికులు మినా నుండి అరఫాకు బయలుదేరుతారు; ఈ రోజును హజ్‌లో అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. లోయలో ఖుత్‌బా (ఉపన్యాసం) ఇవ్వబడుతుంది. జుహుర్, అసర్ ప్రార్థనలు చేస్తారు. యాత్రికులు తమ పాపాలను క్షమించమని అల్లాను వేడుకుంటూ రోజంతా పర్వతంపై గడుపుతారు.[7]

భూగర్భ శాస్త్రం, రేడియాలజీ

[మార్చు]

2012లో జరిగిన ఒక అధ్యయనం భూగర్భ శాస్త్రం, ఉష్ణ చరిత్ర, ఆదిమ రేడియోన్యూక్లైడ్‌ల ఉనికి కారణంగా రేడియోలాజికల్ ప్రమాదాలను అధ్యయనం చేయడానికి పెట్రోగ్రాఫిక్, ఫిషన్ ట్రాక్ డేటింగ్, γ-స్పెక్ట్రోమెట్రిక్ (HPGe) పద్ధతులను ఉపయోగించి, మౌంట్ అరాఫత్‌ను ప్రధానంగా ఫెల్డ్‌స్పార్, క్వార్ట్జ్, మస్కోవైట్‌లతో పాటు ఇతర ఖనిజాలు ఉన్న గ్రానోడియోరైట్ శిలగా వర్గీకరించింది.

ఈ అధ్యయనంలో మౌంట్ అరాఫత్ గ్రానోడియోరైట్ ఫిషన్ ట్రాక్ వయస్సును 9.13 ± 1.05 Ma గా నిర్ధారించింది. అదనంగా, ఎర్ర సముద్రం ఏర్పడటానికి దారితీసిన రిఫ్టింగ్, మాగ్మాటిజం, అగ్నిపర్వత కార్యకలాపాలు, సముద్రగర్భ వ్యాప్తి వంటివి, అధ్యయనంలో ఉన్న అరాఫత్ గ్రానోడియోరైట్ యొక్క అసలు వయస్సును 9.13 ± 1.05 Ma కు మార్చినట్లు ఈ అధ్యయనం నివేదించింది. 226Ra, 232Th and 40K ల వల్ల ఏర్పడిన రేడియోధార్మికత సాంద్రతలు సాధారణ ప్రజలకు ఎటువంటి రేడియోలాజికల్ ఆరోగ్య ప్రమాదాన్ని కలిగించవని కనుగొన్నారు.[1]

సూర్యాస్తమయంతో అరఫా ఆచారాలు ముగుస్తాయి. ఆ తర్వాత యాత్రికులు ముజ్దలిఫాకు వెళ్ళి, మగ్రిబ్ ప్రార్థన, సంక్షిప్తమైన ఇషా ప్రార్థన చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు.[8]

కొండ చుట్టూ ఉన్న సమతల ప్రాంతాన్ని అరఫా మైదానం అంటారు. ఈ మొత్తం ప్రాంతానికి కొన్నిసార్లు అరఫా పర్వతం అనే పదాన్ని వర్తింపజేస్తారు. ఇది ఇస్లాంలో ఒక ముఖ్యమైన ప్రదేశం. హజ్ సమయంలో, యాత్రికులు జుల్-హిజ్జా మాసంలోని తొమ్మిదవ రోజున మధ్యాహ్నం అక్కడ గడుపుతారు. ఆ రోజున అరఫా మైదానంలో హాజరు కాకపోతే యాత్ర ఫలం సిద్ధించదు.[9]

2010 చివరి నుండి, ఈ ప్రదేశానికి మక్కా మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ హజ్ యాత్రలో, నడవడానికి దీనికి సుమారు 13 mi (21 km) పడుతుంది.

సాహిత్యంలో

[మార్చు]

ఈ కొండను జేమ్స్ జాయిస్ తన నవల ఫిన్నెగాన్స్ వేక్ లోను,[10] ఎలియాస్ కానెట్టి, క్రౌడ్స్ అండ్ పవర్ లోనూ ప్రస్తావించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1 2 Qureshi, A. A.; Sultan, A.; Rashid, A.; Ali, M.; Waheed, A.; Manzoor, S.; Baloch, M. A.; Matiullah; Batool, S.; Khan, H. A. (September 2012). "Geological and radiological studies of the Mount Arafat, Mekkah, Saudi Arabia". Journal of Radioanalytical and Nuclear Chemistry (in ఇంగ్లీష్). 293 (3): 955–963. Bibcode:2012JRNC..293..955Q. doi:10.1007/s10967-012-1776-0. ISSN 0236-5731. S2CID 95942060.
  2. "Saudi Arabia Hajj: Millions at Mount Arafat for ceremonies". BBC News. 11 September 2016. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-04-14.
  3. "خرائط Google".
  4. "Sahih al-Bukhari 1664 - Hajj (Pilgrimage) - كتاب الحج - Sunnah.com - Sayings and Teachings of Prophet Muhammad (صلى الله عليه و سلم)". sunnah.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-01.
  5. "Sahih Muslim 1220 - The Book of Pilgrimage - كتاب الحج - Sunnah.com - Sayings and Teachings of Prophet Muhammad (صلى الله عليه و سلم)". sunnah.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-08-01.
  6. Burns, William E. (25 June 2010). Speeches in World History (in ఇంగ్లీష్). Infobase Publishing. p. 79. ISBN 978-1-4381-2680-7. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 March 2024.
  7. "More than 2 million pilgrims complete journey to Mount Arafat for second day of Hajj". Arab News (in ఇంగ్లీష్). 2018-08-20. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-04-14.
  8. Peters, F.E., 1996. The Hajj: The Muslim pilgrimage to Mecca and the holy places. Princeton University Press.
  9. Omar, W. (1952), "The Mecca Pilgrimage: Its Epidemiological Significance and Control", Postgraduate Medical Journal, vol. 28, no. 319, pp. 269–74, doi:10.1136/pgmj.28.319.269, PMC 2530829, PMID 14929743
  10. "Finnegans Wake". www.finwake.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-07-18.