అరికెపూడి గాంధీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరికెపూడి గాంధీ
అరికెపూడి గాంధీ


శాసనసభ్యుడు
పదవీ కాలం
2014 – ప్రస్తుతం
ముందు ఎం.భిక్షపతి యాదవ్‌
నియోజకవర్గం శేరిలింగంపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం 12 జూన్ 1961
కూకట్‌పల్లి, హైదరాబాద్
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు ఏ. చిత్తరంజన్ దాస్, అనసూయ
జీవిత భాగస్వామి శ్యామల దేవి [1]
సంతానం నందిత , పృథ్వి & ప్రణీత
నివాసం సప్తగిరి కాలనీ, వివేకానంద నగర్, కూకట్‌పల్లి, హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

అరికెపూడి గాంధీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్ గా ఉన్నాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

అరికెపూడి గాంధీ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్, కూకట్‌పల్లిలో 1961, జూన్ 12న ఏ. చిత్తరంజన్ దాస్, అనసూయ దంపతులకు జన్మించాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, నందివాడ మండలం,పోలుకొండ గ్రామంలో పుట్టారు. రుద్రపాక లోని పీవీసీ జిల్లా పరిషత్ పాఠశాలలో 1976లో పదవ తరగతి వరకు చదువుకున్నాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

గాంధీకి శ్యామలదేవితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు (పృథ్వీ, నందిత, ప్రణీత) ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

అరికెపూడి గాంధీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టిడిపి పార్టీలో ఉన్నాడు. ఆయన శేరిలింగంపల్లి టీడీపీలో క్రియాశీలకంగా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన దక్కలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కొమరగోని శంకర్ గౌడ్ పై 76,257 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2016, మార్చి 11న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[5] అరికెపూడి గాంధీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్ పై 44,295 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[6] ఆయనను 2019, సెప్టెంబరు 7న ప్రభుత్వ విప్ గా ప్రభుత్వం నియమించింది.[7]

ఆస్తులు-కేసులు[మార్చు]

  • 2023 ఎన్నికల అఫిడివిట్ ప్రకారం ఆస్తులు 85,14,68,823 రూపాయలు.[8]
  • ఇతనిపై ఎలాంటి కేసులు లేవు.[8]

మూలాలు[మార్చు]

  1. The Hans India (10 November 2018). "Poll campaign conducted for TRS" (in ఇంగ్లీష్). Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
  2. "Arekapudi Gandhi | Govt. Whip | MLA | Serilingampally | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-20. Archived from the original on 2021-06-08. Retrieved 2021-09-23.
  3. admin (2019-01-10). "Serilingampally MLA Arekapudi Gandhi". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-23.
  4. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. Sakshi (9 March 2016). "11న టీఆర్‌ఎస్‌లోకి గాంధీ, గోపీనాథ్!!". Archived from the original on 13 July 2021. Retrieved 13 July 2021.
  6. "Arekapudi Gandhi(TRS):Constituency- SERILINGAMPALLY(RANGA REDDY) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-23.
  7. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  8. 8.0 8.1 "Arekapudi Gandhi(BRS):Constituency- SERILINGAMPALLY(RANGAREDDY) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2023-11-26.