అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌
అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌

అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌


కేరళ గవర్నర్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
6 సెప్టెంబర్ 2019
నియమించిన వారు రామ్ నాథ్ కోవింద్

వ్యక్తిగత వివరాలు

జననం 1951 (age 69–70)
బులంద్షార్, ఉత్తర్ ప్రదేశ్, భారత దేశం

అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ కేరళ రాష్ట్ర గవర్నర్‌. అయన 1986లో కేంద్ర మంత్రి గా పని చేశాడు.[1][2]

జననం[మార్చు]

అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ 1951 లో ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్షార్ లో జన్మించాడు.అయన జామియా మిల్లియా పాఠశాల,ఢిల్లీ ,అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, షియా కాలేజీ, లక్నో యూనివర్సిటీ లో పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1972-73 సంవత్సరంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తొలిసారిగా సియానా నియోజకవర్గం నుండి భారతీయ క్రాంతి దళ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందాడు. 1977 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్ఏ గా పోటీ చేసి తన 26వ ఏట యూపీ శాసనసభకు ఎన్నికయ్యాడు.

ఆరిఫ్ ఖాన్ 1980 లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1980 లో కాన్పూర్ , 1984 లో బరైచ్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు. 1986 షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును నాటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర క్యాబినెట్ నుంచి వైదొలగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత జనతాదళ్ లో చేరి 1989 లో లోక్ సభకు ఎన్నికయ్యాడు. జనతా దళ్ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన, విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశాడు. 1998 లో బీఎస్పీలో చేరి బరైచ్ లోక్ సభ స్థానం నుంచి తిరిగి ఎన్నికయ్యాడు.2004లో భారతీయ జనతా పార్టీలో చేరాడు.

ఇస్లాం సంస్కర్త[మార్చు]

అరిఫ్‌ఖాన్‌ మొదటి నుంచి ముస్లిం చట్టాలలో మార్పుల కోసం పోరాటం చేశాడు. 1986లో కేంద్ర మంత్రిగా ఉన్నపుడు షన్ భానో కేసులో భార్యకు తలాక్ చెప్పిన తరువాత భరణం ఇవ్వాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ముస్లిం పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి ప్రధాని రాజీవ్‌గాంధీ ముస్లిం పెద్దలకు మద్దతు తెలపడంతో దాన్ని విభేదిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా అరిఫ్ రాజీనామా చేశాడు.

సమర్పణ్[మార్చు]

ఆరిఫ్ ఖాన్ అతని భార్య రేష్మ ఆరిఫ్ వికలాంగులు కోసం 'సమర్పణ్' అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు.

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, Latest news (6 September 2019). "కేరళ గవర్నర్‌గా అరిఫ్‌ ప్రమాణం". ntnews.com. నమస్తే తెలంగాణ. Archived from the original on 6 సెప్టెంబర్ 2019. Retrieved 6 September 2019. Check date values in: |archivedate= (help)
  2. The Indian Express (6 September 2019). "Arif Mohammad Khan takes oath as Kerala Governor in Malayalam". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 6 సెప్టెంబర్ 2019. Retrieved 6 September 2019. Check date values in: |archivedate= (help)