అరిబండి లక్ష్మీనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరిబండి లక్ష్మీనారాయణ
అరిబండి లక్ష్మీనారాయణ


పదవీ కాలం
1985 - 1989
ముందు చకిలం శ్రీనివాసరావు
తరువాత తిప్పన విజయ సింహారెడ్డి
నియోజకవర్గం మిర్యాలగూడ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1956
పెంచికలదిన్నె , నేరేడుచర్ల మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ సి.పి.ఎం.

అరిబండి లక్ష్మీనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.ఆయన మిర్యాలగూడ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అరిబండి లక్ష్మీనారాయణ 1956లో తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండలం, పెంచికలదిన్నె గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అరిబండి లక్ష్మీనారాయణ కమ్యూనిస్ట్ ఉద్యమాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సి.పి.ఎం. అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.లింగయ్య పై 1965 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1983లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చకిలం శ్రీనివాసరావు చేతిలో 6889 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

లక్ష్మీనారాయణ 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సి.పి.ఎం. అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.చిలినమ్మ పై 30397 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1989లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పన విజయ సింహారెడ్డి చేతిలో 5453 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (14 March 2019). "ఆమె జీవిత కాలపు 'ఎమ్మెల్యే '". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  2. Andhrabhoomi (5 November 2018). "రెండు పార్టీల గూడు మిర్యాలగూడ!". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  3. ENTRANCEINDIA (2014). "Miryalaguda MLA List". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.