అరియాలూర్
Ariyalur district அரியலூர் மாவட்டம் | |
---|---|
District | |
![]() 10th Century Chola monument at Gangaikondacholapuram | |
![]() Location in Tamil Nadu, India | |
Country | ![]() |
State | తమిళనాడు |
District | Ariyalur |
Municipalities | Ariyalur, Jayankondam |
Blocks | Andimadam, Ariyalur, Jayankondam, Sendurai, T.Palur, Thirumanur |
Town Panchayats | Udayarpalayam, Varadharajanpettai |
Headquarters | Ariyalur |
Talukas | Ariyalur, Sendurai, Udayarpalayam |
ప్రభుత్వం | |
• Collector | Mr.E.Saravanavelraj I.A.S.. |
• Superintendent Of Police | Mr. Ziaul Haque, IPS |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,949.31 కి.మీ2 (752.63 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 7,52,481 |
• సాంద్రత | 390/కి.మీ2 (1,000/చ. మై.) |
Languages | |
• Official | Tamil, English |
కాలమానం | UTC+5:30 (IST) |
వాహనాల నమోదు కోడ్ | TN-61 |
Nearest city | Tiruchirappalli |
Vidhan Sabha constituency | Ariyalur, Jayankondam |
World Heritage Site | Gangaikondacholapuram |
జాలస్థలి | www |
అరియలూరు తమిళనాడు జిల్లాలలో ఒకటి. అరియలూరులో జిల్లా ప్రధానకార్యాలయాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1,949.31 చదరపు కిలోమీటర్లు. అలాగే 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 7,52,481. 2001 జనవరి 1 ద్రావిడ మున్నేట్ర కళగం ప్రభుత్వం పెరంబలూరు జిల్లా నుండి అరియాలూరును వేరుచేసి జిల్లాగా రూపొందించబడింది. అయినప్పటికీ 2002లో మార్చి 31 లో తిరిగి ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం ప్రభుత్వకాలంలో ఆర్థికపరిస్థితితులను కారణం చూపుతూ దానిని తిరిగి పెరంబలూరుతో మిళితం చేయబడింది. 2007 నవంబరు 23న తిరిగి జిల్లాగా అవతరించింది. అప్పటి తమిళనాడు " రూరల్ డెవలప్మెంట్ & లోకల్ అడ్మినిస్ట్రేషన్ " మంత్రి అయిన " ఎం.కె స్టాలిన్ ఆధ్వర్యంలో అరియలూరు " ఐ.టి.ఐ ప్లేగ్రౌండ్ " లో ప్రారంభోత్సవ ఉత్సవం జరిగింది.
అరియకూరు జిల్లాకు జిల్లా ఉత్తర , ఈశాన్య సరిహద్దులలో కడలూరుజిల్లా ఉంది. తూర్పు సరి హద్దులలో నాగపట్నంజిల్లా ఉంది. అలాగే దక్షిణ , ఆగ్నేయ సరిహద్దులలో తంజావూరు జిల్లా ఉంది. వాయవ్య సరిహద్దులలో తిరుచిరాపల్లిజిల్లా ఉంది. పడమర సరిహద్దులలో పెరంబలూరుజిల్లా ఉంది. జిల్లామొత్తంలో 16 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అరియలూరు సిమెంటు పరిశ్రమలకు ప్రసిద్ధి. బిర్లా సిమెంట్, డాల్మియా సిమెంట్, సఖి సిమెంట్, ది తమిళనాడు సిమెంట్, చెట్టినాడు సిమెంట్ మొదలైన ప్రముఖ సిమెంటు తయారీ పరిశ్రమలు జిల్లా ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడకు సమీపంలో ప్రఖ్యాత " గంగై కొండ చోళపురం " ఉంది. ఈ ఊరిలో రాజేంద్రచోళుడు చేత నిర్మించబడిన ఆలయం ఉంది.అరియలూరుకు 5కిలోమీటర్ల దూరంలో కలియపెతుమాళ్ ఆలయం ఉంది. రాజరాజ చోళుని కుమారుడైన రాజేద్రచోళుడు తంజావూరులో నిర్మించిన ప్రసిద్ధి చెందిన బృహదీశ్వరాలయం నిర్మించాడు.
గణాంకాలు[మార్చు]
2011 అరియలూరు జిల్లా జనసంఖ్య 752,481. ఇది గయజిల్లా లేక అమెరికాలోని అలాస్కా రాష్ట్ర జసంఖ్యకు దాదాపు సమంగా ఉంది. భారతదేశ జిల్లాలలో (640) జనసంఖ్యా పరంగా అరియలూరు 491 స్థానంలో ఉంది. జిల్లా జనసాంధ్రత చదరపు కిలోమీటరుకు 387 నివాసితులు ఉన్నారు. 2001-2011 జిల్లాలో జనసఖ్య 8.19% వృద్ధి చెందినది. జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తి 1016:1000. అక్షరాస్యత శాతం 71.99%.
వెలుపలి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "2011 Census of India" (Excel). Indian government. 16 April 2011.
![]() |
Wikimedia Commons has media related to Ariyalur district. |