అరిహంత్ తరగతి జలాంతర్గామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
colspan="2" style="text-align:center;line-height:1.5em;" దస్త్రం:INS Arihant during sea trials.jpg
INS Arihant during sea trials in 2014
Class overview
Name: అరిహంత్
Builders: నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నం[1]
Operators: మూస:Country data భారత్
In commission: 2016
Building: 3[2]
Completed: 1 (కమిషన్ కు సిద్ధంగా ఉంది)
General characteristics
Type: అణు చోదిత, అణ్వాయుధ సహిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి
Displacement: 6,000 టన్నులు (5,900 long tons; 6,600 short tons) surfaced[3]
Length: 112 మీ. (367 అ.)[3]
Beam: 11 మీ. (36 అ.)
Draft: 10 మీ. (33 అ.)
Installed power: 1 × pressurised water reactor[4] *83 MW (111,000 hp)
Propulsion: 1 × propeller shaft *Nuclear
Speed: నీటిపైన: 12–15 knots (22–28 km/h) *నీటి అడుగున: 24 knots (44 km/h)
Range: unlimited except by food supplies
Test depth: 300 మీ. (980 అ.)
Complement: 95
Sensors and
processing systems:
USHUS sonar
Armament: క్షిపణులు: 12 × సాగరిక/K15 SLBM (750–1900 కిమీ పరిధి) లేదా 4 × K-4 SLBM (3500 కిమీ పరిధి)[4] టార్పెడోలు: 6 × 21" (533 mm) torpedo tubes – est 30 charges (torpedoes, cruise missiles or mines)[5]

అరిహంత్ ఒక అణు చోదిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల తరగతి. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికిల్ ప్రాజెక్టు కింద భారత్ ఈ జలాంతర్గాములను  తయారుచేస్తోంది. ఈ తరగతి లోని ముఖ్య జలాంతర్గామి INS అరిహంత్ ప్రారంభం 2009 లో జరిగింది. విస్తృత సముద్ర పరీక్షల తరువాత, 2016 ఫిబ్రవరి 23 న ఇది ఆపరేషన్‌లకు సిద్ధంగా ఉందని నిర్ధారించారు .[6][7] ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యులు ఐదుగురు కాకుండా, ఇతర దేశాలు తయారుచేసిన మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి అరిహంత్.[8]

చరిత్ర[మార్చు]

1971 డిసెంబరులో, భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా అమెరికా, టాస్క్ ఫోర్స్ 74 అనే తన బలగాలను USS ఎంటర్‌ప్రైస్ నాయకత్వంలో బంగాళాఖాతంలో మోహరించింది. భారత్‌ను హెచ్చరించేందుకు అమెరికా ఈ పనిచేసింది.[9][10] దీనికి ప్రతిగా సోవియట్ యూనియన్ అణ్వాయుధాలతో కూడిన తన జలాంతర్గామిని అమెరికా టాస్క్ ఫోర్స్ వెనుకనే పంపించింది.[11] అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ప్రాముఖ్యత ఎంతటిదో ఈ సంఘటనతో నాటి ప్రధాని ఇందిరా గాంధీకి తెలియవచ్చింది.[12] 1974 నాటి స్మైలింగ్ బుద్ధ అణు పరీక్ష తరువాత, డైరెక్టర్ ఆఫ్ మెరీన్ ఇంజనీరింగ్ (DME) దేశీయ అణు చోదిత వ్యవస్థను నిర్మించడమై, సాధ్యాసాధ్యాల పరిశీలనను చేపట్టారు. (Project 932).[13] అణు జలాంతర్గామికి రూపకల్పన చేసి నిర్మించే, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెస్సెల్ ప్రాజెక్టు 1990 ల్లో రూపుదిద్దుకుంది.[14] 1998 లో నాటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఈ ప్రాజెక్టు ఉనికిని ధ్రువీకరించాడు.[15] ప్రాజెక్టు యొక్క తొలి ఉద్దేశం, వేగంగా దాడి చేసే అణు చోదిత జలాంతర్గామిని నిర్మించడం. అయితే 1998 అణు పరీక్షల తరువాత, భారత్ మొదటి-దాడి-చెయ్యను  విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రాజెక్టు లక్ష్యాలను మార్చి, బాలిస్టిక్  క్షిపణి జలాంతర్గామిని నిర్మించాలని నిశ్చయించారు. ఇది భారత్ యొక్క అణుత్రయంలో ఒక భాగం.[16][17][18]

వివరణ[మార్చు]

అరిహంత్ తరగతి జలాంతర్గాములు అణు చోదిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు. దీని నిర్మాణాన్ని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెస్సెల్ (ATV) ప్రాజెక్టులో భాగంగా చేపట్టారు.[19][20][21][22][23][24] ఇవి భారత్ నిర్మించిన మొదటి అణు చోదిత జలాంతర్గాములౌతాయి[25] ఈ జలాంతర్గాములు 112 మీ పొడవు, 11 మీ బీమ్‌తో, 10 మీ డ్రాట్‌తో, 6000 టన్నుల బరువు కలిగి ఉంటాయి.  ఇవి  సముద్రంలో 300 మీ లోతు వరకు వెళ్తాయి. 95 మంది సిబ్బంది ఉంటారు.[26] ఈ జలాంతర్గాములు 83 మెగావాట్ల ప్రెజర్ వాటర్ రియాక్టరుతో నడుస్తాయి. ఇది నీటిపైన 12-15 నాట్ల వేగంతోను, నీటి లోపల 24 నాట్ల వేగంతోనూ ప్రయాణిస్తుంది.[26]

ఈ జలాంతర్గాములకు నాలుగు క్షిపణి ప్రయోగ ట్యూబులు ఉన్నాయి. దీనిలో 12 సాగరిక క్షిపణులను గానీ (750 కిమీ పరిధి) లేదా 4 K-4 క్షిపణులను గానీ (3,500 కిమీ పరిధి) మోహరించవచ్చు.[27][28] ఈ జలాంతర్గాములు రష్యా యొక్క అకులా తరగతి  జలాంతర్గాముల కోవకు చెందినవి.[26] భారత నావికా దళం తన సైనికులకు అకులా తరగతికి చెందిన INS  చక్రలో శిక్షణ ఇస్తుంది..[29][30]

అభివృద్ధి[మార్చు]

ఈ జలాంతర్గాములకు శక్తి, ప్రెషరైస్‌డ్ వాటర్ రియాక్టరు నుండి లభిస్తుంది. ఈ రియాక్టరు హైలీ ఎన్‌రిచ్‌డ్ యురేనియాన్ని ఇంధనంగా వాడుతుంది.[31][32]  ఈ రియాక్టరును  భాభా  అటామిక్ రీసెర్చి సెంటర్ (BARC) రూపకల్పన చేసి, నిర్మించింది. దీన్ని ఇందిరాగాంధి అణు పరిశోధన కేంద్రం, కల్పాక్కం లో నిర్మించారు.[33] ఇందులో రియాక్టరు, నీటి ట్యాంకు,  కంట్రోల్ రూము, ఆక్జిలరీ కంట్రోల్ రూము ఉన్నాయి.[34] ప్రోటోటైప్ రియాక్టరు 2003 నవంబరు 11 న క్రిటికల్ స్థితికి చేరింది. 2006 సెప్టెంబరు 22 న అది ఆపరేషన్‌కు సిద్ధమైందని  ప్రకటించారు.[12] మూడేళ్ళ పాటు ఈ ప్రోటోటైప్‌ను విజయవంతంగా పని చేయించాక, అరిహంత్ కోసం రియాక్టరును తయారు చేసారు.[35][36] రియాక్టరు ఉప వ్యవస్థలను విశాఖపట్నం లోని యంత్ర పరీక్షా కేంద్రంలో పరీక్షించారు.[37] జలాంతర్గాములలో ఇంధనాన్ని ఎక్కించడానికి, పాత ఇంధనాన్ని తీసేసేందుకు అవసరమైన  సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసారు.[12]

జలాంతర్గామి డిజైను యొక్క సవివరమైన ఇంజనీరింగ్ ను ఎల్ & టి వారి హజీరా నౌకా నిర్మాణ కేంద్రంలో చేసారు.[38] జలాంతర్గామి నియంత్రణ వ్యవస్థలను  టాటా పవర్ నిర్మించింది.[39]  స్టీమ్ టర్బైన్లు, దానికి సంబంధించిన వ్యవస్థలను వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్ సరఫరా చేసింది.[40] 2009 జూలైలో ప్రారంభించాక,  మొదటి నౌక, అరిహంత్ అనేకానేక పరీక్షలకు లోనైంది.[41] ప్రొపల్షన్, పవర్ వ్యవస్థలను హై ప్రెషర్ స్టీమ్‌తో పరీక్షించారు. అనేక హార్బరు పరీక్షలు కూడా జరిపారు.[42] INS అరిహంత్ యొక్క రియాక్టరు 2013 ఆగస్టు 10 న క్రిటికల్ స్థితికి చేరింది.[43][44][45]

ఈ తరగతి లోని నౌకలు[మార్చు]

INS అరిహంత్ యొక్క భావన

ఈ తరగతిలో ఎన్ని జలాంతర్గాములను నిర్మిస్తారనేది ఇదమిత్థంగా తెలీదు. మీడియా రిపోర్టుల ప్రకారం 3 నుండి 6 వరకూ నిర్మిస్తారని తెలుస్తోంది.[46][47][48][49][50][51][52] ఈ తరగతిలోని మొదటి జలాంతర్గామి INS అరిహంత్ 2016 లో కమిషన్ అయ్యే అవకాశాలున్నాయి.[53] 2023 నాటికి మొదటి నాలుగు జలాంతర్గాములు కమిషన్ అవుతాయి.[4] 2014 డిసెంబరు నాటికి రెండవ అణు రియాక్టరు పని మొదలైంది. రెండవ జలాంతర్గామి, INS అరిదమన్ సముద్ర పరీక్షలకు సిద్ధం అవుతోంది.[54] అరిహంత్ తరువాత తయారయ్యే మూడు నౌకలు అరిహంత్  కంటే పెద్దవి, 8 కె-4 క్షిపణులను మోసుకుపోగలిగే  సామర్థ్యంతో, మరింత శక్తివంతమైన అణు రియాక్టరును కలిగి ఉంటాయి.

అరిహంత్ తరగతి తరువాత మరింత పెద్ద తరగతి నౌకలను తయారు చెయ్యాలనే ప్రణాళిక కూడ ఉంది. ఈ తరగతి జలాంతర్గాములు 12 నుండి 16 బాలిస్టిక్ క్షిపణులను మోహరించగలవు.[55][56]

పేరు పతాక ప్రారంభం సముద్ర పరీక్షలు కమిషన్ స్థితి
INS అరిహంత్ S 73 / S2[56][57] 2009 జూలై 26 2014 డిసెంబరు 13 [58] 2016 (అనుకోలు)[59] సముద్ర పరీక్షలు[6]
INS అరిదమన్ S 74 / S3[56] tbd tbd tbd నిర్మాణంలో ఉంది[4][60]
tbd నిర్మాణంలో ఉంది[61]
tbd నిర్మాణంలో ఉంది

టైమ్‌లైన్[మార్చు]

తేది ఘటన
1998 మే 19 ATV ప్రాజెక్టును అప్పటి రక్షణ మంత్రి ధ్రువీకరించాడు
2003 నవంబరు 11 ప్రోటోటైప్ అణు రియాక్టరు క్రిటికల్ అయింది
2006 సెప్టెంబరు 22 అణు రియాక్టరు ఆపరేషనుకు సిద్ధమైందని ప్రకటన
2009 జూలై 26 INS అరిహంత్ ప్రారంభం
2013 ఆగస్టు 10 అరిహంత్ అణు రియాక్టరు క్రిటికల్ అయింది
2014 డిసెంబరు 13 INS అరిహంత్ సముద్ర, ఆయుధ పరీక్షలు ప్రారంభం 
2015 నవంబరు 25 INS అరిహంత్ డమ్మీ B5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.
2016 మార్చి 31 క్షిపణిని కె 4 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు వనరులు[మార్చు]

 1. "Contract worker killed in accident at navy ship building centre". The Hindu. 8 March 2014. Retrieved 17 March 2016.
 2. "Why India needs submarines". The Diplomat. May 2016. Retrieved 17 May 2016.
 3. 3.0 3.1 "India reaches milestone with launch of n-powered submarine". DNA. 26 July 2007. Retrieved 24 January 2011.
 4. 4.0 4.1 4.2 4.3 "India to achieve N-arm triad in February". Times of India. 2 January 2012. Archived from the original on 26 మార్చి 2013. Retrieved 17 March 2016. ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "toi-ntriad" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 5. Pike, John (27 July 2009). "Advanced Technology Vessel (ATV)". globalsecurity.org. Retrieved 24 January 2011.
 6. 6.0 6.1 "INS Arihant not to feature at International Fleet Review". The Economic Times. 5 February 2016. Retrieved 5 February 2016.
 7. "India's first nuclear submarine INS Arihant ready or operations, passes deep sea tests". The Economic Times. 23 February 2016. Retrieved 23 February 2016.
 8. Marcus, Jonathan (10 August 2013). "Indian-built Arihant nuclear submarine activated". BBC. Retrieved 12 October 2013.
 9. 1971 War: How Russia sank Nixon’s gunboat diplomacy.
 10. US Fleet in Bay of Bengal: A game of deception. (2013-12-15).
 11. Krishnan Simha, Rakesh (20 December 2011). "US-Soviet Actions in 1971 Indo-Pakistani War". indrus.in. Indrus.in. Retrieved 22 April 2013.
 12. 12.0 12.1 12.2 "Arihant: the annihilator". Indian Defence Review. 25 October 2010. Retrieved 8 January 2012.
 13. Das, Premvir (30 July 2009). "Project 932". Business Standard. Retrieved 24 April 2013.
 14. India's SNS Project Report. Fas.org.
 15. "George defends position on China". Indian Express. 19 May 1998. Retrieved 24 February 2011.
 16. Pike, John. Advanced Technology Vessel (ATV). Globalsecurity.org.
 17. "First indigenous nuclear sub is inducted into the navy". DNA. 26 July 2009. Retrieved 24 January 2011.
 18. "India's nuclear sub still a distant dream". Rediff. 16 February 2001. Retrieved 24 January 2011.
 19. Indian indigenous nuclear sub to be unveiled on 26 July: report. domain-b.com: (16 July 2009).
 20. "India nuclear sub project near completion". Reuters. 12 February 2009. Retrieved 24 January 2011.
 21. "PM to launch indigenous nuke submarine by month-end". MSN. 16 July 2009. Retrieved 19 July 2009.[permanent dead link]
 22. "Indigenous nuclear submarine goes on trial". The Hindu. Chennai, India. 19 July 2009. Retrieved 19 July 2009.
 23. Sud, Hari (14 August 2009). "India's nuclear submarine and the Indian Ocean". upiasia.com. Retrieved 24 January 2011.
 24. "India's nuclear submarine dream, still miles to go". Reuters. 31 July 2009. Archived from the original on 25 మే 2011. Retrieved 24 January 2011.
 25. "Final test of K-15 ballistic missile on Tuesday". 25 February 2008. Retrieved 24 January 2012.
 26. 26.0 26.1 26.2 SSBN Arihant Class Submarine, India. naval-technology.com.
 27. "The secret undersea weapon". India Today. 17 January 2008. Retrieved 8 January 2012.
 28. "The secret 'K' missile family". India Today. 20 November 2010. Retrieved 8 January 2012.
 29. Arihant – Advanced Technology Vessel (ATV). Global Security.
 30. "Leased Russian n-submarine to set sail for India this month end". 15 December 2011. Retrieved 8 January 2012.
 31. Pandit, Rajat (17 July 2009). "India set to launch nuclear-powered submarine". Times Of India. Archived from the original on 24 అక్టోబర్ 2012. Retrieved 17 March 2016. Check date values in: |archive-date= (help)
 32. "High fissile fuel in nuclear submarine lasts long". The Hindu. Chennai, India. 5 November 2009. Retrieved 17 March 2016.
 33. "INS Arihant is an Indian design: Anil Kakodkar". The Hindu. Chennai, India. 16 August 2009. Archived from the original on 19 ఆగస్టు 2009. Retrieved 17 March 2016.
 34. Shekhar, G.C. (3 August 2009). "Unveiled: Arihant's elder brother". Telegraph India. Calcutta, India. Retrieved 17 March 2016.
 35. Subramanian, T.S. (2 August 2009). "PWR building shows indigenous capability". The Hindu. Chennai, India. Retrieved 17 March 2016.
 36. Venkatesh, M.R. (2 August 2009). "Arihant propulsion reactor unveiled". Hindustan Times. Retrieved 17 March 2016.[permanent dead link]
 37. Naval Research Board. DRDO.
 38. "Larsen and Toubro's Contribution to Arihant-class submarine"[permanent dead link] (PDF) (Press release). 26 July 2009.
 39. India's first Indigenous nuclear submarine. Jeywin.
 40. "Private sector played a major role in Arihant". DNA. 27 April 2009. Retrieved 17 March 2016.
 41. "Nuclear submarine Arihant to be fitted with K-15 ballistic missiles". The Hindu. Chennai, India. 27 July 2009. Retrieved 17 March 2016.
 42. "Home-made nuke sub INS Arihant to be inducted in 2 years". Times of India. 3 December 2009. Archived from the original on 13 జూన్ 2016. Retrieved 17 March 2016.
 43. "K-15 all set to join Arihant". The Hindu. 27 December 2012. Retrieved 17 March 2016.
 44. "India's nuclear submarine Arihant flagged off for sea trials". The Economic Times. 13 December 2014. Retrieved 15 December 2014.
 45. "INS Arihant sails out of harbour". The Hindu. 13 December 2014. Retrieved 15 December 2014.
 46. "Sea trials of Indian Navy's deadliest sub going 'Very Well'". The Diplomat. 31 May 2015. Retrieved 17 March 2016.
 47. Brewster, David. Asia's coming nuclear nightmare. CFTNI.
 48. "Was 2015 a good year for India's defence sector?". Business Standard. 31 December 2015. Retrieved 17 March 2016.
 49. "After Arihant, Indian Navy considering n-propulsion for Aircraft Carriers". indiastrategic.in. 31 December 2015. Retrieved 17 March 2016.
 50. SSBN Arihant Class Submarine. naval-technology.com.
 51. "N-capable Arihant submarine successfully test-fires unarmed missile". Big News. Retrieved 17 March 2016.
 52. "Indian Navy soon to be the most formidable submarine force On The Planet". indiatimes.com. Retrieved 17 March 2016.
 53. "Satisfied with nuclear sub Arihant trials: Navy Chief". Tribune India. Retrieved 17 March 2016.
 54. "Work on second nuclear sub reactor begins". 2 December 2014. Retrieved 17 March 2016.
 55. EXPRESS EXCLUSIVE: Maiden Test of Undersea K-4 Missile From Arihant Submarine.
 56. 56.0 56.1 56.2 Diplomat, Saurav Jha, The. India’s Undersea Deterrent.
 57. "INS Arihant may be of limited utility". The Hindu (in ఇంగ్లీష్). 2014-12-20. ISSN 0971-751X. Retrieved 2016-04-09.
 58. "INS Arihant sails out of harbor". The Hindu. 13 December 2014. Retrieved 22 December 2014.
 59. Anandan, S (23 February 2016). "Second nuclear submarine headed for year-end launch". The Economic Times. Retrieved 17 March 2016.
 60. "Second nuclear submarine under construction". IBN (in Hindi). 23 May 2011. Archived from the original on 15 ఏప్రిల్ 2015. Retrieved 17 March 2016.CS1 maint: unrecognized language (link)
 61. "Maiden Test of Undersea K-4 Missile From Arihant Submarine". The New Indian Express. 9 April 2016. Retrieved 1 June 2016.