అరుంధతీ భట్టాచార్య
అరుంధతీ భట్టాచార్య | |
---|---|
24వ భారతీయ స్టేట్ బ్యాంకు చైర్మన్ | |
Assumed office 7 October 2013 | |
అంతకు ముందు వారు | Pratip Chaudhuri |
భారతీయ స్టేట్ బ్యాంకు | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కోల్‌కటా, పశ్చిమ బంగాల్, భారతదేశం | 1956 మార్చి 18
జాతీయత | భారతీయులు |
నివాసం | ముంబై, భారతదేశం[1] |
కళాశాల | జాదవ్పూర్ విశ్వవిద్యాలయం[1] |
అరుంధతీ భట్టాచార్య దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంకు తొలి మహిళా ఛైర్‌పర్సన్.[1] అరుంధతీ భట్టాచార్య మరోసారి అరుదైన గుర్తింపును సాధించారు. ఆర్థిక రంగంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన శక్తిమంతమైన మహిళల జాబితాలో అరుంధతీ భట్టాచార్య 5వ స్థానంలో నిలిచారు.[2] ఆమె నాయకత్వంలో ఎస్‌బీఐలో ఎన్నో కీలకమైన మార్పులు చేపట్టారు. టెక్నాలజీకి అనుగుణంగా.. డిజిటల్ బ్యాకింగ్ అవుట్‌లెట్, మొబైల్ వ్యాలెట్, ఇంటర్నెట్‌బ్యాకింగ్ యాప్, ఈ-పే తదితర అధునాతన సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని కోల్ కతా నగరంలో బెంగాలీ హీందూ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె బాల్యమంతా భిలాయ్ లో గడిచింది. ఆమె తండ్రి పొర్డ్యుత్ కుమార్ కుఖర్జీ భిలాయ్ ఉక్కు కర్మాగారంలో పనిచేసాడు. ఆమె తల్లి కళ్యాణి ముఖర్జీ కొకారోలో హోమియోపతి వైద్యులు. అరుంధతీ భట్టాచార్య బొకారో లోని సెయింట్ క్సావియర్ స్కూలులో విద్యను అభ్యసించారు.[4]
ఆమె కలకత్తా లోని జాదవ్ పూర్ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ బ్రాబోన్ కళాశాలలో ఆంగ్ల సాహిత్యం చదివారు. ఆమె భర్త ఐ.ఐ.తి ఖర్గపూర్ లో మాజీ ప్రొఫెసర్.[5]
జీవితం
[మార్చు]ఆమె భారతీయ స్టేట్ బ్యాంకులో 1977 లో చేరారు. ఆమె ప్రారంభమ్లో ప్రొబేషనరీ అధికారిగా తన 22వ యేట బ్యాంకు ఉద్యోగంలో చేరారు.[6] తాన్ 36 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో అనేక స్థానాలలో పనిచేసారు. వాటిలో విదేశీ ఎక్సేంజ్, ట్రెజరీ, రిటైల్ ఆపరేషన్స్, మానవ వనరులు, ఇన్వెస్ట్‌మెంటు బ్యాంకిగ్ వంటి శాఖలు ఉన్నాయి. ఆమె బ్యాంకు యొక్క న్యూయార్క్ శాఖలో కూడా పనిచేసారు. ఆమె అనేక కొత్త వ్యాపార విధానాలను ప్రారంభించారు. వాటిలో ఎస్.బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్.బి.ఐ కస్టోడియల్ సర్వీసు, ఎస్.బి.ఐ మాక్వరీ ఇన్‌ప్రాస్ట్రక్చర్ ఫండు ఉన్నాయి.[6] ఆమె సెప్టెంబరు 30 న బ్యాంకు చైర్‌పర్సన్ గా పదవీ విరమణ పొందిన ప్రతీప్ చౌదరి స్థానంలో చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు.[7] ఆమె గృహంలో పిల్లలు, పెద్దవారికి సంరక్షించుటకు మహిళా ఉద్యోగులకు రెండు సంవత్సరాల సబ్‌బాటికల్ పాలసీని ప్రారంభించారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహిళా ఉద్యోగులందరికీ కాన్సర్ వాక్సినేషన్ ఉచితంగా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు.
2015 లో ఆమె 30 మంది అత్యంత శక్తివంతమైన మహిళలుగా "ఫోర్బ్స్" జాబితాలో స్థానం సంపాదించారు.[2] అదే సంవత్సరం ఆమె పారెన్ పాలసీ మాగజైన ద్వారా టాప్ 100 గ్లొబల్ థింకర్స్ లో ర్యాంకు సాధించింది.[8] ఆమె ఆసియా పసిఫిక్ లో అత్యంత శక్తివంతమైన మహిళలలో 4వ స్థానాన్ని పొందారు.[9]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 #25 Arundhati Bhattacharya. Forbes
- ↑ 2.0 2.1 "The World's 100 Most Powerful Women". Forbes. Forbes. Retrieved 7 June 2016.
- ↑ "అరుంధతీ భట్టాచార్య.. శక్తిమంతమైన మహిళ ఫోర్బ్స్ ఆర్థికరంగం జాబితాలో 5వ స్థానం". Archived from the original on 2016-06-10. Retrieved 2016-06-08.
- ↑ All you need to know about Arundhati Bhattacharya, SBIs first woman chief
- ↑ http://www.telegraphindia.com/1131009/jsp/business/story_17440117.jsp#.VuG-0jZqp7Y
- ↑ 6.0 6.1 Mayur Shetty (8 October 2013). "SBI gets its first woman chair in 206 years". The Times of India. Retrieved 14 October 2013.
- ↑ Arundhati Bhattacharya is new chief of SBI
- ↑ http://www.financialexpress.com/article/industry/narendra-modi-amit-shah-among-top-decision-makers-in-global-thinkers-list/10003/
- ↑ http://www.ndtv.com/photos/news/fortunes-list-of-most-powerful-women-in-asia-pacific-has-8-indians-18511#photo-238478
ఇతర లింకులు
[మార్చు]- 7 Lesser Known Facts About Arundhati Bhattacharya That You Probably Didn’t Know. storypick.com
- Know how SBI chief Arundhati Bhattacharya changed India's largest bank for the better. Business Insider India
- అరుంధతీ భట్టాచార్య నాయకత్వంలో ఎస్బీఐ
- అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో నీతా అంబానీ, అరుంధతీ భట్టాచార్య[permanent dead link]