Jump to content

అరుణాచల్ ప్రదేశ్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
అరుణాచల్ ప్రదేశ్ క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్సూరజ్ తాయం
కోచ్సంజీవ్ శర్మ
యజమానిఅరుణాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితం2018
చరిత్ర
రంజీ ట్రోఫీ విజయాలు0
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు0
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు0
అధికార వెబ్ సైట్arunachalcricket.in

అరుణాచల్ ప్రదేశ్ క్రికెట్ జట్టు భారత దేశవాళీ పోటీలలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే క్రికెట్ జట్టు. 2018 జూలైలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీతో సహా 2018–19 సీజన్ కోసం దేశీయ టోర్నమెంట్‌లలో పాల్గొనే తొమ్మిది కొత్త జట్లలో ఒకటిగా ఈ జట్టును ప్రకటించింది. [1] [2] [3] అయితే, టోర్నీ ప్రారంభానికి ముందు, జట్టుకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు మైదానం లేదు. [4] 2018-19 సీజన్‌కు ముందు, గురుశరణ్ సింగ్ జట్టు కోచ్‌గా నియమితులయ్యాడు. [5]

2018 సెప్టెంబరులో, వారు 2018–19 విజయ్ హజారే ట్రోఫీలో తమ ప్రారంభ మ్యాచ్‌లో మిజోరామ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించారు. [6] [7] విజయ్ హజారే ట్రోఫీలో వారి మొదటి సీజన్‌లో, ఎనిమిది మ్యాచ్‌లలో రెండు విజయాలు, ఐదు ఓటములతో ప్లేట్ గ్రూప్‌లో ఏడవ స్థానంలో నిలిచారు. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. [8] సమర్త్ సేథ్ 345 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. సందీప్ కుమార్ ఠాకూర్ ఎనిమిది మందిని ఔట్‌ చేసి, జట్టులో ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచాడు. [9]


2018 నవంబరులో, 2018-19 రంజీ ట్రోఫీలో తమ ప్రారంభ మ్యాచ్‌లో, అరుణాచల్ జట్టు ఏడు వికెట్ల తేడాతో మేఘాలయ చేతిలో ఓడిపోయింది. [10] [11] వారు 2018–19 టోర్నమెంట్‌ను తమ ఎనిమిది మ్యాచ్‌లలో గెలుపొందకుండా పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. [12]

2019 మార్చిలో అరుణాచల్ ప్రదేశ్, తమ ఏడు మ్యాచ్‌లలో ఒక విజయంతో 2018–19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గ్రూప్ D లో ఏడవ స్థానంలో నిలిచింది. [13] టోర్నమెంట్‌లో సమర్థ్ సేథ్ 221 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగుల స్కోరర్‌గా, అఖిలేష్ సహానీ పదకొండు ఔట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. [14]

స్క్వాడ్

[మార్చు]
పేరు పుట్టినరోజు బ్యాఅటింగు శైలి బౌలింగు శైలి గమనికలు
బ్యాటర్లు
సూరజ్ తాయం (1984-02-04) 1984 ఫిబ్రవరి 4 (వయసు 40) కుడిచేతి వాటం కెప్టెన్
టెక్కీ డోరియా (1994-03-02) 1994 మార్చి 2 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
రోహన్ శర్మ (1995-10-14) 1995 అక్టోబరు 14 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
నీలం ఓబీ (1993-01-16) 1993 జనవరి 16 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
అనూప్ అహ్లావత్ (2000-11-13) 2000 నవంబరు 13 (వయసు 24) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
అమ్రేష్ రోహిత్ (1997-08-16) 1997 ఆగస్టు 16 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
కుమార్ న్యోంపు (1992-09-07) 1992 సెప్టెంబరు 7 (వయసు 32) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
మోహిత్ పన్వార్
ఆల్ రౌండర్లు
టెక్కీ నేరి (1994-05-10) 1994 మే 10 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్
అఖిలేష్ సహాని (1994-03-16) 1994 మార్చి 16 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
చందన్ కుమార్ సింగ్ (1997-01-07) 1997 జనవరి 7 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
నబమ్ టెంపోల్ (1994-09-25) 1994 సెప్టెంబరు 25 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
మాపు యిగం (1999-05-01) 1999 మే 1 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
దేశాయ్‌ మీత్ (1997-05-16) 1997 మే 16 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
వికెట్ కీపర్లు
కమ్షా యాంగ్ఫో (1992-11-16) 1992 నవంబరు 16 (వయసు 32) కుడిచేతి వాటం వైస్ కెప్టెన్
రాహుల్ దలాల్ (1992-02-02) 1992 ఫిబ్రవరి 2 (వయసు 32) కుడిచేతి వాటం
స్పిన్ బౌలర్లు
చేతన్ ఆనంద్ (1996-09-01) 1996 సెప్టెంబరు 1 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
లిమర్ దాబీ (1991-11-07) 1991 నవంబరు 7 (వయసు 33) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్
మైండంగ్ సింగ్ఫో (1996-10-23) 1996 అక్టోబరు 23 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్
ఫాస్ట్ బౌలర్లు
నబమ్ అబో (1988-10-05) 1988 అక్టోబరు 5 (వయసు 36) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం
యాబ్ నియా (1994-10-18) 1994 అక్టోబరు 18 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్
తన్మయ్ గుప్తా (2003-09-19) 2003 సెప్టెంబరు 19 (వయసు 21) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్

2023 జనవరి 17 నాటికి నవీకరించబడింది

మూలాలు

[మార్చు]
  1. "Nine new teams in Ranji Trophy 2018–19". ESPN Cricinfo. Retrieved 18 July 2018.
  2. "Logistical nightmare on cards as BCCI announces 37-team Ranji Trophy for 2018-19 season". Indian Express. Retrieved 18 July 2018.
  3. "BCCI to host over 2000 matches in the upcoming 2018-19 domestic season". BCCI. Archived from the original on 19 జూలై 2018. Retrieved 19 June 2018.
  4. "Ground reality hits Northeast states before first-class debut". Sport Star Live. Retrieved 10 August 2018.
  5. "BCCI eases entry for new domestic teams as logistical challenges emerge". ESPN Cricinfo. Retrieved 31 August 2018.
  6. "Vijay Hazare Trophy: Bihar make winning return to domestic cricket". Times of India. Retrieved 19 September 2018.
  7. "Plate, Vijay Hazare Trophy at Nadiad, Sep 19 2018". ESPN Cricinfo. Retrieved 19 September 2018.
  8. "2018–19 Vijay Hazare Trophy Table". ESPN Cricinfo. Retrieved 8 October 2018.
  9. "Vijay Hazare Trophy, 2018/19 - Arunachal Pradesh: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 8 October 2018.
  10. "Ranji Trophy Takeaways: Unadkat Picks Seven; Mumbai in Command Against Railways". Network18 Media and Investments Ltd. Retrieved 3 November 2018.
  11. "Ranji Trophy: Sikkim record innings victory over Manipur". The Indian Express. Retrieved 3 November 2018.
  12. "Ranji Trophy Table - 2018–19". ESPN Cricinfo. Retrieved 10 January 2019.
  13. "Syed Mushtaq Ali Trophy 2019: Points Table". ESPN Cricinfo. Retrieved 2 March 2019.
  14. "Syed Mushtaq Ali Trophy, 2018/19 - Arunachal Pradesh: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2 March 2019.