అరుణ్ కార్తిక్
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | కొండా భాస్కర్ అరుణ్ కార్తీక్ |
| పుట్టిన తేదీ | 1986 February 15 వాలాజపేట, తమిళనాడు |
| బ్యాటింగు | కుడిచేతి వాటం |
| బౌలింగు | లెగ్ బ్రేక్ గూగ్లీ |
| పాత్ర | వికెట్-కీపర్-బ్యాట్స్‌మన్ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2007-2008 | Badureliya Sports Club |
| 2007–2014 | Tamil Nadu |
| 2011–2013 | Royal Challengers Bangalore |
| 2014–2017 | Assam |
| 2017 | Victoria SC |
| 2017-2019 | Kerala |
| 2019-2020 | Puducherry |
| 2020–2021 | Tamil Nadu |
| 2022-present | Puducherry |
మూలం: ESPNcricinfo | |
కొండా భాస్కర్ అరుణ్ కార్తీక్ (జననం 1986, ఫిబ్రవరి 15) భారత క్రికెటర్. ప్రస్తుతం అతను పుదుచ్చేరి తరపున ఆడుతున్నాడు,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సభ్యుడు. కార్తీక్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, లెగ్-స్పిన్ బౌలర్. అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా పనిచేశాడు.
జననం
[మార్చు]కొండా భాస్కర్ అరుణ్ కార్తీక్ 1986, ఫిబ్రవరి 15న తమిళనాడులోని వాలాజాపేటలో జన్మించాడు.
క్రికెట్ రంగం
[మార్చు]కార్తీక్ 2007, నవంబరులో శ్రీలంక జట్టు బదురేలియా స్పోర్ట్స్ క్లబ్ తరపున లిస్ట్ Aలో అరంగేట్రం చేసి, 38 పరుగులు చేశాడు. 2007-08 సీజన్‌లో అతను బదురేలియా వన్డే జట్టులో ఎప్పుడూ ఉండేవాడు. వారి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
2008, నవంబరులో కార్తీక్ తమిళనాడు తరపున కర్ణాటకపై తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు, అతను ఇన్నింగ్స్‌ను ప్రారంభించి 149 పరుగులు చేశాడు, విద్యుత్ శివరామకృష్ణన్‌తో కలిసి 246 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.
2019–20 రంజీ ట్రోఫీ టోర్నమెంట్ కోసం, అతను కేరళ నుండి పుదుచ్చేరి క్రికెట్ జట్టుకు మారాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Arun Karthik signs up with Puducherry for 2019-20 Ranji season". Sport Star. Retrieved 4 September 2019.