అరుణ్ గావ్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణ్ గావ్లి

వ్యక్తిగత వివరాలు

జీవిత భాగస్వామి ఆశా గావ్లి

అరుణ్ గులాబ్ గావ్లి ముంబైలో కరడు కట్టిన నేరస్థుడు. అతడి అనుచరులు అతణ్ణి "డాడీ" అని పిలుస్తారు. బైకుల్లా లోని దగ్డి చావ్ల్, సాత్ రాస్తా, ముంబై కేంద్రంగా ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ముంబై చించ్ పోక్లి నియోజకవర్గం నుంచి అఖిల్ భారత సేన అభ్యర్థిగా 2004లో MLAగా ఎన్నిక అయ్యారు.

గావ్లి ఎదుగుదల తొందరగా జరిగింది, అతను స్థానికుడు అవ్వడం ఇందుకు కారణం అవ్వచ్చు, మరాఠీ వారు కాని మిగతా డాన్ ల నుండి ఆయనను ప్రత్యేకంగా చూపింది. గావ్లి ఇంకో విషయంలో కూడా ప్రత్యేకత కలిగి ఉన్నారు, ఆయన హిందూ (ఆయన భార్య, ఆశతాయి (మహమ్మద్ షేక్ లాల్ ముజావర్ "నంహు భాయ్" పుత్రిక, వాడగావున్-పాంచిపూర్, జిల్లాకు చెందిన వారు. మమ్మీ అని పిలుస్తారు) కాగా, మిగతా డాన్లు ముస్లింలు. చాలా సందర్భాలలో గావ్లికి శివసేన అధ్యక్షుడు అయిన బాల్ థాకరే మద్దతు ఇచ్చారు, కానీ గావ్లి మనుషులు శివసేనకు చెందిన శాసన సభ సభ్యులను మరియు పార్టీ సభ్యులను విచక్షణా రహితంగా చంపడంతో, వారిద్దరి మధ్య అగాధం ఏర్పడింది. అప్పటి దాకా భయం అంటే ఎరుగని శివ సేన సభ్యులు వారి సొంత భయ తంత్రాలకు బలి అయ్యారు. దావూద్ ఇబ్రహీం ముంబై నుంచి తరలిపోయినప్పుడు ఏర్పడ్డ ఖాళీలో గావ్లి యథేచ్ఛగా అపహరణాలు, భయ పెట్టి డబ్బులు వసూలు చేయడాలు కొనసాగించాడు. అతనికి పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల మరియు ప్రభుత్వ ఉద్యోగుల సహాయం ఉందని నమ్ముతారు. ఆయన తాను పట్టు కోల్పోతున్నానని అని గ్రహించి రాజకీయాలలోకి అడుగు పెట్టారు, ఫలితంగా ఆయన మార్గదర్శకులకు ఆయనకూ మధ్య విరోధం ఏర్పడింది.

ప్రాబల్యం కలిగిన నేరస్థులు లేదా "గూండాలు" -అరుణ్ గావ్లి, రమ భాయ్ నాయక్, బాబు భాయ్ రేశిం, గురు సతం అలియాస్ మామ, అశోక్ చౌదరి అలియాస్ చోటా బాబు, అనిల్ భాయ్ పరబ్, తాన్య కోలి- వీరంతా 1970వ దశకంలో ముంబై కాటన్ మిల్లుల సమ్మెలోంచి పుట్టిన వారు. ఆ సమ్మె వల్ల లక్షల మంది మిల్లు కార్మికులు ఉపాధి కోల్పోయారు. పైన పేర్కొన్న అందరిలో గావ్లి మినహా మిగతా అందరినీ మాఫియా ప్రత్యర్థులు దారుణంగా చంపారు. సమ్మె కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలి దరిద్రాలను అనుభవిస్తున్న మిల్లు కార్మికుల పిల్లలు మెల్లగా చిన్న చిన్న నేరాలు చేయడం మొదలు పెట్టారు. దగ్ది చావల్ సిండికేట్ మొదట్లో డి-కంపనీతో కలిసి పని చేసేది కానీ తరువాతి కాలంలో వసూళ్ళ పంపకాల్లో వచ్చిన అంతర్గత గొడవల వల్ల విడిపోయింది. బైకుల్ల-మహాలక్ష్మి-అగ్రిపడ-పరేల్/నయగావ్-చించ్ పోకిలి ప్రాంతాల్లో ఒక చిన్న చార్జ్ షీట్ కలిగిన గావ్లి, ప్రస్తుతం దగ్ది చావల్ ప్రాంతానికి తిరుగులేని నాయకుడు. అతని మాట దగ్ది చావల్ మరియు ముంబైలో చాలా ప్రాంతాల్లో ఒక శాసనంగా పరిగణిస్తారు.[1]

గావ్లి, రమభాయ్ నాయక్ యొక్క అనుచరుడు. అతన్ని 1986లో సుపారి కింగ్ కరీం లాలా మేనల్లుడు సమద్ ఖాన్ను కాల్చి చంపాడు. దాని వల్ల దావూద్ ఇబ్రహీం ముంబై నేర ప్రపంచాన్ని ఏలడానికి మార్గం సుగమం అయ్యింది. రామనాయక్ కూడా 1988లో నాగ్పడ ప్రాంత పోలీసు అధికారి రాజన్ కట్ధారే చేత ఎదురు కాల్పుల్లో చనిపోయాడు, ఈ పని దావూద్ ఇబ్రహీం చేయించాడని ఆరోపణలు ఉన్నాయి. రామనాయక్ ని గావ్లి మరియు అతని అనుచరులు ఇప్పటికి బైకుల్లా, దగ్ది చావల్ ప్రాంతానికి అసలైన పితామహుడిగా కొలుస్తారు.

ప్రారంభ జీవితం[మార్చు]

మిల్లు కార్మికుని కొడుకైన గావ్లి కర్మాగారంలో పని చేయడానికి ప్రయత్నించాడు కానీ అతనిలో అంతటి ఓపిక, సహనం లేవు. అతను దగ్ది చావల్ ప్రాంతంలోని తన నివాసాన్ని ఒక చిన్న కోట లాగా మార్చి దావూద్ ఇబ్రహీం మరియు ఛోటా రాజన్తో మెల్లగా సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఒకప్పుడు గావ్లి తండ్రి అతని భాగాస్వాములచే చంపబడిన తరువాత గావ్లి జట్టును తయారు చేసాడు, ఈ జట్టు మూతపడుతున్న మిల్లుల ఆస్తి తగాదాలు మరియు కార్మిక సంఘాల పైన బతికేది. 1990 దశకంలో గావ్లి తన కారాగార కాలాన్ని పూర్తి చేసినప్పటికీ అతన్ని 1993 ముంబై పేలుళ్ళ సంఘటనలో ఉగ్రవాద మరియు శాంతి భంగాల చట్టం (నివారణ) పరిధిలోకి తీసుకొని అతనికి నాలుగు సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. అతను మధ్య ముంబైను తన ఉక్కు పిడికిలిలో ఉంచాడు. ముంబై పేలుళ్ళ తరువాత అకస్మాత్తుగా శివ సేనకు గావ్లి ఒక్కడినే హిందూ నాయకునిగా స్వీకరించవలసిన అవసరం వచ్చింది. ఒక సందర్భంలో థాకరే ఇలా అన్నారు "వారికీ దావూద్ ఉంటే, మాకు గావ్లి ఉన్నాడు". 1997లో గావ్లిని విడుదల చేసారు. అతను శివ సేన నుంచి విడిపోయి అఖిల్ భారతీయ సేన పార్టీని నెలకొల్పాడు. 1997 నుంచి 2004 మధ్య కాలంలో గావ్లిని 15 పైగా నేరాలకు అదుపులోకి తీసుకున్నారు కానీ నిరూపించలేకపోయారు. మెల్లగా అతను నేర ప్రేవృత్తిని మానుకున్నాడు, కానీ ముంబైలో నివసించే ఏకైక నేర సామ్రాజ్య నాయకునిగా మిగిలాడు.[2]

రాజకీయాలు మరియు కారాగార వాసం[మార్చు]

"డాడీ" తరచుగా అరెస్టయేవాడు. అతను పది సంవత్సరాలు పైనే చట్టం అదుపులో ఉన్నారు కానీ ఎప్పుడూ అతని నేరాలను నిరూపించలేకపోయారు. మొబైల్ ఫోన్, కారాగార అధికారులు మరియు పోలీసు అధికారుల సహకారంతో, అతని నేర సామ్రాజ్యంలో భాగమైన అపహరణలు, భయపెట్టి డబ్బు వసూళ్ళు, హత్యలు, నాశిక్ పూణే మరియు ఎరవాడ ప్రాంతాలలో మధ్యం కేంద్రాలను నిరంకుశంగా మరియు సమర్ధంగా నిర్వహించాడు. ఇక్కడే అతని అఖిల్ భారతీయ సేన పక్షం పుట్టింది, ఈ రాజకీయ పక్షంలో నేరస్థులు మరియు ఇతర పక్షాల అసమ్మతి సభ్యులు చేరారు. దావూద్ ఇబ్రహీం/ఛోటా షకీల్ మరియు ఛోటా రాజన్ వంటి విరోధుల నుంచి రక్షణ పొందడానికి కారాగారం గావ్లికి స్వర్గసీమగా మారింది. రాజకీయాలలో చేరి మహారాష్ట్ర శాసన సభకు ఎన్నిక కావాలనే అతని నిర్ణయం, పోలీసు ఎదురు కాల్పుల నుంచి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో తీసుకున్నదే.

గావ్లి, "మమ్మీ" అని పిలువబడే ఆశ గావ్లిని వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు పిల్లలు. గావ్లి రాజకీయ ఆశలకు అతని మేనల్లుడు సచిన్ బావు అహిర్ రూపంలో ఎదురు దెబ్బ తగిలింది, సచిన్ బాహాటంగానే గావ్లిని విమర్శించాడు మరియు శరద్ పవార్ యొక్క NCPలో చేరాడు, అంతే కుండా గావ్లి ప్రత్యర్థిగా NCP అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో పోటి చేసాడు, ఇందువల్ల అక్కడి ప్రస్తుత సేన పార్లమెంట్ సభ్యుడు మోహన్ రావ్లె గెలుపు సులభం అయ్యింది. అతని కూతురు ఈ మధ్యనే బ్రిహన్ ముంబై పురపాలక సంఘంలో కార్పొరేటర్ గా ఎన్నిక అయ్యింది.

ప్రస్తుతం గావ్లి స్వేచ్ఛ కలిగిన వ్యక్తి. కానీ కమలాకర్ జాంసండేకర్ (శివ సేన) హత్య కేసులో గావ్లి నేరం నిరూపితమైంది.

సూచనలు[మార్చు]

  1. Najm, Quaied (2003-03-16). "Reporters' Diary: In the don's lair". The Week. Malayala Manorama Group. మూలం నుండి February 11, 2005 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-10-19.
  2. http://cities.expressindia.com/fullstory.php?newsid=91939