అరుణ్ శౌరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణ్ శౌరీ
అరుణ్ శౌరీ


వ్యక్తిగత వివరాలు

జననం (1941-11-02) 1941 నవంబరు 2 (వయస్సు: 78  సంవత్సరాలు)
జలంధర్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అనిత
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి విలేఖరి & ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త

అరుణ్ శౌరీ (अरूण शौरी) (జననం 1941 నవంబరు 2) ఒక భారతీయ విలేఖరి, రచయిత, మేధావి మరియు రాజకీయవేత్త. ఆయన ప్రపంచ బ్యాంకులో (1968-72 మరియు 1975-77) ఆర్థికవేత్తగా, భారత ప్రణాళికా సంఘానికి సలహాదారుగా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా సంపాదకుడిగా, భారత ప్రభుత్వంలో (1998-2004) మంత్రిగా పనిచేశారు.[1]

ప్రారంభ జీవితం[మార్చు]

అరుణ్ శౌరీ భారతదేశంలోని జలంధర్ నగరంలో జన్మించారు, ఆయన తండ్రి హరిదేవ్ శౌరీ ఒక పౌరఅధికారి (IAS) గా పనిచేశారు, తరువాత వినియోగదారు హక్కుల కార్యకర్తగా మారారు. భారతదేశ విభజన సమయంలో ఆయన తండ్రి లాహోర్‌లో ఒక మేజిస్ట్రేట్‌గా పనిచేశారు, దేశ విభజన తరువాత వారి కుటుంబం భారతదేశానికి తరలివచ్చింది. ఢిల్లీలోని మోడరన్ స్కూల్, బారాఖాంబా మరియు సెయింట్ స్టీఫెన్స్‌ కళాశాలలో అరుణ్ చదువుకున్నారు. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని సైరాక్యూస్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పొందారు.[2] ఆయన సోదరి నళినీ సింగ్ కూడా ఒక విలేకరి.

వృత్తి[మార్చు]

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెలువరించిన వరుస సంచలనాత్మక కథనాల్లో అనేక కథనాల వెనుక శౌరీ సొంత కృషి ఉంది, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ఆయన జనవరి 1979న ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా నియమించబడ్డారు, ప్రభుత్వ అగ్ర నాయకత్వ శ్రేణిలో అవినీతిని బయటపెట్టడంతోపాటు, అనేక ప్రధాన కుంభకోణాలను బట్టబయలు చేశారు, "భారతదేశపు వాటర్‌గేట్" కుంభకోణంగా పిలవబడే కళంకాన్ని కూడా ఆయన బహిర్గతం చేశారు.[3] మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అబ్దుల్ రెహమాన్ అంతులేపై శౌరీ 1981లో ఒంటరిపోరాటం ప్రారంభించారు, రాష్ట్ర వనరులపై ఆధారపడిన వ్యాపారాల నుంచి మిలియన్లకొద్ది డాలర్ల ముడుపులు స్వీకరించినట్లు, ఈ డబ్బును ఇందిరా గాంధీ పేరుమీద నెలకొల్పిన ప్రైవేట్ ట్రస్టులో పెట్టినట్లు అంతులే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన కథనం కారణంగా అంతులే చివరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు, ఒక వార్తాపత్రిక కథనం ద్వారా భారతదేశంలో ఉన్నత-పదవిలో ఉన్న ఒక వ్యక్తి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి, అంతేకాకుండా గాంధీకి మరియు ఆమె నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ కథనం తీవ్ర ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించింది.[4]

శౌరీ బయటపెట్టిన సంచలనాత్మక కథనాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ముంబయి కార్యాలయాల్లో సుదీర్ఘ కార్మిక వివాదానికి దారితీసింది, ఇక్కడ ఒక కార్మిక సంఘం నిర్వాహకుడికి అంతులేతో సంబంధాలు ఉన్నాయి, భారతదేశంలో మరే ఇతర వార్తాపత్రికలో చెల్లించిన వేతనాన్ని అంటే, కనీస వేతనాన్ని రెట్టింపు చేయాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగాలని ఈ కార్మిక సంఘం నిర్వాహకుడు కార్మికులను ప్రోత్సహించాడు. అంతేకాకుండా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై వివిధ సంస్థల చేత కేసులు పెట్టించడం ద్వారా ప్రభుత్వం కూడా ఈ పత్రికను అణిచివేసేందుకు ప్రయత్నించింది. 1982లో, ప్రభుత్వవైపు నుంచి అణిచివేత చర్యలు కొనసాగుతుండటంతో పత్రిక యజమాని రామనాథ్ గోయెంకా చివరకు అరుణ్ శౌరీని విధుల నుంచి తొలగించారు.[5]

1982 మరియు 1986 మధ్యకాలంలో, శౌరీ వివిధ వార్తాపత్రికలు మరియు మేగజైన్‌లకు కథనాలు రాశారు, ఇదే సమయంలో ఆయన పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 1986లో ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా నియమితులయ్యారు, అనంతరం 1987లో గోయెంకా తిరిగి ఆయనను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోకి ఆహ్వానించారు. బోఫోర్స్ హోవిట్జెర్ గన్ కొనుగోళ్ల కుంభకోణంపై అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీపై శౌరీ సంచలనాత్మక ఆరోపణలు చేయడం ప్రారంభించారు. తరువాత జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ పరాజయం పాలవడానికి ఈ ఆరోపణలు కూడా ఒక కారణమయ్యాయి.

శౌరీ పోరాటం జరిపిన అనేక అంశాల్లో పత్రికా స్వాతంత్ర్యం కూడా ఒకటి, ఇందులో ప్రముఖమైనది ఏమిటంటే 1988లో ఒక పరువు నష్టం బిల్లును ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయన పోరాటం జరిపారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక నోరుకట్టిపడేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అసాధారణ రీతిలో చాలా వేగంగా ఈ బిల్లును పార్లమెంట్‌కు తీసుకొచ్చింది, అయితే ఈ చర్యను ఖండిస్తూ దీనిపై జరిపిన పోరాటంలో శౌరీకి మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు మొత్తం మీడియా వర్గం అండగా నిలిచింది.

ఒక దశలో, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికపై ప్రభుత్వం 300 కేసులు పెట్టింది, అంతేకాకుండా ఈ పత్రికకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం లేకుండా చేశారు. అయితే శౌరీ, 1990 వరకు ప్రభుత్వ అవినీతిపై యుద్ధాన్ని కొనసాగించారు, సంపాదక విధానంలో విభేదాలు తలెత్తడంతో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు శౌరీ రాజీనామా చేశారు. ఇతర వెనుకబడిన తరగతులు (OBC) లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడాన్ని శౌరీ వ్యతిరేకించడం పత్రిక సంపాదక వర్గంలో విభేదాలకు దారితీసింది, ఈ కమిషన్‌ను వి.పి.సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ తరువాత, శౌరీ పుస్తకాలు రాయడం మరియు పత్రికలకు రోజువారీ వ్యాసాలు రాయడంపై దృష్టిసారించారు, శౌరీ రాసే వ్యాసాలు భారతదేశవ్యాప్తంగా వివిధ భాషల్లో 30 వార్తాపత్రికల్లో ప్రచురించబడేవి.

శౌరీ భారతీయ జనతా పార్టీ (BJP) లో ఒక సభ్యుడు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు, మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని మంత్రివర్గంలో పెట్టుబడుల ఉపసంహరణ, సమాచార మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మారుతీ, VSNL, హిందూస్థాన్ జింక్ కంపెనీలను ఇతరులకు విక్రయించడానికి ఆయన నేతృత్వం వహించారు. మంత్రిగా ఆయన స్థానం వివాదాస్పదంగా ఉండేది, అయితే శౌరీ మరియు ఆయన కార్యదర్శి ప్రదీప్ బైజాల్‌ను ఉత్తమమైన ప్రక్రియను అమలు చేసినవారిగా ప్రజలు గౌరవించారు. ఫిబ్రవరి 2004లో భారతదేశపు టాప్ 100 CEOల జాబితా తయారీ కోసం నిర్వహించిన సర్వేలో ఆయన వాజ్‌పేయి ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతమైన మంత్రిగా గుర్తింపు పొందారు.[6]

2000 సంవత్సరంలో, శౌరీ తన వినియోగం అందుబాటులో ఉన్న మొత్తం నగదు (Rs. 11.90 కోట్లు) ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్‌లో బయో-సైన్సెస్ & బయో-ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఇచ్చారు, ఈ డబ్బును మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవెలప్‌మెంట్ స్కీమ్ (MPLADS) (ఎంపీల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం) కింద శౌరీకి కేటాయించారు. 2005లో, ఇదే విద్యా సంస్థలో ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ మరియు ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ విభాగాలకు ప్రత్యేక మరియు మెరుగైన-పరికర వసతితో కూడిన భవనాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన మళ్లీ Rs. 11 కోట్ల నిధులు అందజేశారు.

2007లో భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ నామినేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుల్లో శౌరీ కూడా ఒకరు. 'డజ్ దిస్ టెయింటెడ్ పర్సన్ డిజర్వ్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా?' అనే శీర్షికతో ఒక బుక్‌లెట్ రూపంలో ప్రచురించబడిన రెండు కథనాలను అరుణ్ శౌరీ రాశారు. ఈ కథనంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి యొక్క ఆక్షేపణీయ కోణాన్ని చర్చించారు. కరణ్ థాపర్‌తో ఒక ఇంటర్వ్యూలో ప్రతిభా పాటిల్ మరియు ఆమె బంధువు ప్రతిభా మహిళా సహకార బ్యాంకు నిధులను అపహించారనే ఆరోపణలను నిరూపించే సాక్ష్యాలను శౌరీ బయటపెట్టారు, ఈ బ్యాంకును ప్రతిభా పాటిల్ స్థాపించారు, దీనికి ఇన్‌ఛార్జిగా ఆమె వ్యవహరించడం గమనార్హం. ప్రతిభా పాటిల్ కుటుంబ సభ్యులకు ఇచ్చిన అనేక రుణాలపై వడ్డీని బ్యాంకు అక్రమంగా మాఫీ చేసిందని బయటపడటంతో, భారతీయ రిజర్వు బ్యాంకు (రబీ) 2003లో ఈ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేసింది.[7] ఆమె సోదరుడు G.N.పాటిల్‌పై ఉన్న హత్య కేసులో న్యాయ జరగకుండా ప్రతిభా పాటిల్ అడ్డుపడ్డారని కూడా శౌరీ ఆరోపించారు.

2009 సాధారణ ఎన్నికల్లో భాజపా పరాజయం తరువాత, యశ్వంత్ సిన్హా మరియు జస్వంత్ సింగ్‌లతో కలిసి, అరుణ్ శౌరీ పార్టీలో ఆత్మపరిశోధన మరియు జవాబుదారీతనం కోసం డిమాండ్ చేశారు. మహమ్మద్ అలీ జిన్నాను ప్రశంసిస్తూ తన పుస్తకంలో రాసిన భాజపా సీనియర్ నేత జస్వంత్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన తరువాత ఈ అంశాలు ప్రధాన చర్చనీయాంశాలుగా తెరపైకి వచ్చాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైన తన కథనాల్లో జస్వంత్ సింగ్‌ను శౌరీ సమర్థించారు, భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అధిక చేతివాటాన్ని ఆరోపించేందుకు హంప్టీ డంప్టీ మరియు ఎలిస్ ఇన్ బ్లండర్‌ల్యాండ్ వంటి పదప్రయోగాలు చేశారు.[8]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన అనితా శౌరీని వివాహం చేసుకున్నారు, ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.

ప్రచురణలు[మార్చు]

ఆయన రచనల ద్వారా దేశవ్యాప్తంగా గణనీయమైన మద్దతు సంపాదించగలిగారు, అంతేకాకుండా రచనలతో పలు జాతీయ మరియు అంతర్జాతీయ గౌరవాలు కూడా పొందారు. ఆయన అందుకున్న గౌరవాల్లో పద్మ భూషణ్, మెగసెసే అవార్డు, దాదాభాయ్ నౌరోజీ అవార్డు, ఎస్టోర్ అవార్డు, K.S. హెడ్జ్ అవార్డు మరియు ఇంటర్నేషనల్ ఎడిటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మరియు ది ఫ్రీడమ్ టు పబ్లిష్ అవార్డులు ఉన్నాయి.

 • వర్‌షిపింగ్ ఫాల్స్ గాడ్స్ పుస్తకంలో, శౌరీ దళిత నేత B.R. అంబేడ్కర్‌ను విమర్శించారు, బ్రిటీష్‌వారితో భాగస్వామ్యం మరియు అధికారం మరియు సంపద కోసం ఆరాటపడ్డారనే ఆరోపణలతో ఆయనను శౌరీ విమర్శించారు.
 • ఎ సెక్యులర్ అజెండా (1997, ISBN 81-900199-3-7) పుస్తకంలో, శౌరీ మైనారిటీలను బుజ్జగించే చర్యలు మరియు భారతీయ రాజకీయ నాయకులు ఆచరించే బూటకపు-లౌకికవాదం కారణంగా భారతదేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను చర్చించారు.[9] దేశం నిర్వచనంపై చర్చతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది. వివిధ భాషలు మరియు మతాల కారణంగా భారత్‌ను ఒక దేశంగా పరిగణించని వ్యక్తుల వాదనలను తిరస్కరించేందుకు ఐరోపాలోని ఇతర దేశాలను ఆయన ఉదాహరణలుగా చూపించారు. ఈ పుస్తకంలో ఆయన సమాన పౌర నియమావళి కోసం[9] మరియు భారత రాజ్యాంగంలో 370వ అధికరణను రద్దు చేయాలని వాదించారు.[9] బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న చొరబాట్లకు సంబంధించిన సమస్యను మరియు దీనిని పరిష్కరించడంలో భారత ప్రభుత్వ అసమర్థతను కూడా ఆయన ఈ పుస్తకంలో చర్చించారు.
 • ఎమినెంట్ హిస్టారియన్స్: దెయిర్ టెక్నాలజీ, దెయిర్ లైన్, దెయిర్ ఫ్రాడ్ (1998, ISBN 81-900199-8-8) పుస్తకంలో భారతీయ రాజకీయాల్లో NCERT వివాదంపై చర్చించారు మరియు మార్క్సిస్ట్ చారిత్రక సాహిత్యాన్ని ఎండగట్టారు. మార్క్సిస్ట్ చరిత్రకారులు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ICHR), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ (NCERT) మరియు విద్యా ప్రపంచం మరియు మీడియా వంటి ముఖ్యమైన సంస్థలను నియంత్రించారని మరియు దుర్వినియోగపరిచారని అరుణ్ శౌరీ పేర్కొన్నారు. రోమీలా థాపర్ మరియు ఇర్ఫాన్ హబీబ్ వంటి ప్రముఖ చరిత్రకారులను ఆయన విమర్శించారు. ఘజ్నీ మహమ్మద్ మరియు ఔరంగజేబు వంటి పాలకుల చరిత్రలను మార్క్సిస్ట్ చరిత్రకారులు కప్పిపుచ్చారని శౌరీ వాదించారు. కార్ల్ మార్క్స్ లేదా స్టాలిన్ వంటి ప్రముఖ విదేశీ వ్యక్తుల గురించి సమగ్రంగా వర్ణిస్తూ, భారత్‌కు లేదా భారతీయ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యక్తుల గురించి అంతంతమాత్రంగా తెలియజేసే పాఠ్య పుస్తకాలు ఎన్నో ఉన్నాయని ఉదాహరణలతో సహా శౌరీ తన వాదన వినిపించారు. రష్యాకు చెందిన మార్క్సిస్ట్ పాఠ్య పుస్తకాలతో ఇది విరుద్ధంగా ఉందని శౌరీ రాశారు. భారతీయ మార్క్సిస్ట్‌లు రాసిన చరిత్ర పుస్తకాల కంటే ప్రామాణిక సోవియట్ రచన "ఎ హిస్టరీ ఆఫ్ ఇండియా" (1973) మరింత ప్రయోజనాత్మకంగా మరియు వాస్తవికత్వంతో ఉందని శౌరీ పేర్కొన్నారు.
 • ఫాలింగ్ ఓవర్ బాక్‌వార్డ్స్: ఎన్ ఎస్సే ఎగైనెస్ట్ రిజర్వేషన్స్ అండ్ ఎగైనెస్ట్ జ్యుడీషియల్ పాపులిజం: లో శౌరీ రిజర్వేషన్ల చరిత్ర, వాటిని ఎందుకు ప్రవేశపెట్టారు, భారత రాజ్యాంగంలో వాటికి సంబంధించిన సెక్షన్లు, నిర్దిష్టమైన పదాలు ఉపయోగించడం వెనుక కారణంపై చర్చించారు. అసలు విలువల సంరక్షణకర్తగా ఉన్న స్థితి నుంచి ఆ విలువలను బహిరంగంగా ధిక్కరించడం ద్వారా న్యాయవ్యవస్థ పతనమైందని ఉద్ఘాటించేందుకు ఆయన కోర్టు తీర్పులను ఉదాహరణగా చూపించారు. క్రమానుగత కోర్టు తీర్పుల పర్యవసానాల వలన అసలు ఉద్దేశాలకు పూర్తిగా వ్యతిరేకంగా రాజ్యాంగం ఏవిధంగా తప్పుగా అర్థం చేసుకోబడుతుందో ఆయన ఉదహరించారు. తన వాదనను బలపరిచే సరైన ఆదేశాలు మరియు తీర్పులను చూపించారు. ఆయన తరువాత పదోన్నతల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం, రూస్టెర్ వ్యవస్థ, 50% పరిమితితో ప్రవేశం మరియు ఆపై దీనివలన వచ్చిన అప్రతిష్ఠపై చర్చించారు. తరువాత, మండల్ సిఫార్సులు మరియు వాటి ప్రాతిపదిక వెనుక ఉన్న అర్థాన్ని వివరించే ప్రయత్నం చేశారు. కమిషన్ యొక్క నిర్ణయాలకు ఆధారాన్ని ఆయన పరిశీలించారు, అంటే 1931 జనాభా లెక్కలు (ఆ సమయంలో భారతదేశంలో కులాన్ని ఆధారంగా చేసుకొని జనాభా లెక్కలు వేసేవారు), నిశ్చయాంశాలు ఎలా ఉండేయో, జనాభా లెక్కలు తీసుకున్నవారి స్వీయ అంగీకారాలను కమిషన్ అనుకూలంగా ఉపయోగించుకుందని పేర్కొన్నారు. ఈ పుస్తకం చివరి భాగంలో, శౌరీ ఉద్యోగిస్వామ్యం మరియు మరెక్కడైనా రిజర్వేషన్ల ప్రభావాలను వివరించారు, వీటి వలన ఏర్పడిన హేతువిరుద్ధమైన పరిస్థితి మరియు సంస్థలపై వీటియొక్క ప్రతికూల ప్రభావాన్ని ఎత్తిచూపే నిర్దిష్ట ఉదాహరణలు మరియు సందర్భాలను ప్రస్తావించారు. భవిష్యత్‌లో ఈ ధోరణికి సంబంధించిన సంకేతాలను చర్చించారు, ఈ పతనాన్ని ఆపకపోతే ఏర్పడే ప్రతికూల పరిస్థితులను ఊహించారు. నెహ్రూ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు 'దిస్ వే లైస్ నాట్ ఫోలీ, బట్ డిజాస్టర్' (ఇది అవివేకవంతమైన మార్గం కాదు, ఉపద్రవానికి దారితీసే మార్గం) తో శౌరీ ఈ పుస్తకాన్ని ముగించారు.
 • గవర్నెన్స్ అండ్ ది స్క్లెరోసిస్ దట్ హాజ్ సెట్ ఇన్: ఉద్యోగిస్వామ్యంలో బలహీన ఆధిపత్యం మరియు ప్రతి పనిలోనూ జరిగే మితిమీరిన జాప్యంపై అరుణ్ శౌరీ ఇందులో చర్చించారు. వ్యవస్థ యొక్క అసమర్థతను చూపించేందుకు వివిధ సందర్భాలను, వాటి కాలవ్యవధులను మరియు వాటి యొక్క వివిధ దశలను ప్రస్తావించారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో తాను పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలను కూడా శౌరీ చర్చించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, PSUల్లో మరియు శాఖల్లో అసమర్థతలపై కూడా ఆయన ఇందులో చర్చ జరిపారు. విలుప్తమైన చట్టాలకు దూరంగా పనులు నిర్వహించడం మరియు ప్రక్రియలను సరళీకరించడానికి శౌరీ మద్దతు తెలిపారు.

ఉపయుక్త గ్రంథసూచి[మార్చు]

 • ఆర్ వి డిసీవింగ్ అవర్‌సెల్వ్స్ ఎగైన్ [1][permanent dead link]
 • వేర్ విల్ ఆల్ దిస్ టేక్ అజ్ [2][permanent dead link]
 • ది పార్లమెంటరీ సిస్టమ్
 • కోర్ట్స్ అండ్ దెయిర్ జడ్జిమెంట్స్: ప్రెమిసెస్, ప్రెరెక్విసైట్స్, కాన్‌సీక్వెన్సెస్
 • ఎమినెంట్ హిస్టారియన్స్: దెయిర్ టెక్నాలజీ, దెయిర్ లైన్, దెయిర్ ఫ్రాడ్
 • ఫాలింగ్ ఓవర్ బాక్‌వార్డ్స్: ఎన్ ఎస్సే ఎగైనెస్ట్ రిజర్వేషన్స్ అండ్ ఎగైనెస్ట్ జ్యుడీషియల్ పాపులిజం
 • గవర్నెన్స్ అండ్ ది స్క్లెరోసిస్ దట్ హాజ్ సెట్ ఇన్ [3][permanent dead link]
 • హార్వెస్టింగ్ అవర్ సోల్స్
 • హిందూయిజం: ఎసెన్స్ అండ్ కాన్సీక్వెన్స్
 • ఇండియన్ కాంట్రవర్శీస్
 • ఇండివిడ్యువల్స్, ఇన్‌స్టిట్యూషన్స్, ప్రాసెసెస్ : హౌ వన్ మే స్ట్రెంథన్ ది అదర్ ఇన్ ఇండియా టుడే
 • ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ ది జనతా ఫేజ్
 • మిషనరీస్ ఇన్ ఇండియా [4]
 • Mrs గాంధీస్ సెకెండ్ రీన్
 • ఓన్లీ ఫాదర్‌ల్యాండ్ : కమ్యూనిస్ట్స్, 'క్విట్ ఇండియా, ' అండ్ ది సోవియట్ యూనియన్
 • రిలీజియన్ ఇన్ పాలిటిక్స్
 • ఎ సెక్యులర్ అజెండా
 • సింప్టమ్స్ ఆఫ్ ఫాసిజం
 • దీజ్ లెథల్, ఇన్‌యెగ్జారబుల్ లాస్: రాజీవ్, హిజ్ మెన్ అండ్ హిజ్ రీజీమ్
 • ది స్టేట్ యాజ్ చరాడేe: V.P. సింగ్, చంద్ర శేఖర్ అండ్ ది రెస్ట్
 • విల్ ది ఐరన్ ఫెన్స్ సేవ్ ఎ ట్రీ హాలౌడ్ బై టెర్మిటెస్?
 • వర్‌షిపింగ్ ఫాల్స్ గాడ్స్ [5] [6]
 • ది వరల్డ్ ఆఫ్ ఫత్వాస్ [7]

సహ-రచయిత:

సూచనలు[మార్చు]

 1. http://www.answers.com/topic/arun-shourie
 2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2010-04-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-04-05. Cite web requires |website= (help)
 3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2007-10-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-04-05. Cite web requires |website= (help)
 4. http://catalogue.nla.gov.au/Record/2612231
 5. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2015-04-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-04-05. Cite web requires |website= (help)
 6. http://offstumped.wordpress.com/2009/07/17/arun-shourie-on-bjp-final-part/
 7. http://en.wikipedia.org/wiki/Pratibha_Patil
 8. http://www.indianexpress.com/news/arun-shourie-hits-out-at-bjp-top-leadership/506470/
 9. 9.0 9.1 9.2 "A Secular Agenda". Indiaclub.com. మూలం నుండి 2007-09-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-09-27.

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.