Jump to content

అర్చనా రామసుందరం

వికీపీడియా నుండి
అర్చనా రామసుందరం
రిటైర్డ్ ఐపిఎస్
2016లో అర్చనా రామసుందరం
జననం (1957-10-01) 1957 అక్టోబరు 1 (వయసు: 68)
విశ్వవిద్యాలయాలు
  • రాజస్థాన్ విశ్వవిద్యాలయం
  • దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం
వృత్తిపోలీసు అధికారి
ప్రసిద్ధిపారామిలిటరీ దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధిపతి
భార్య / భర్తRamasundaram
బంధువులుచారుబాల తొండైమాన్

అర్చనా రామసుందరం (జననం 1957 అక్టోబరు 1), తమిళనాడు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ పోలీసు అధికారి. ఆమె 2018లో పదవీ విరమణ చేసే వరకు 37 సంవత్సరాలు ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్)లో పనిచేసింది. కేంద్ర పారామిలిటరీ దళానికి నాయకత్వం వహించిన భారతదేశపు మొదటి మహిళా పోలీసు అధికారిగా గుర్తింపె తెచ్చుకుంది.[1] ఆమె భర్త రామసుందరం 2011 వరకు తమిళనాడు రాష్ట్రంలో సీనియర్ రాష్ట్ర ఐఏఎస్ అధికారిగా పనిచేసాడు.

కెరీర్

[మార్చు]

రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ఆమె పోలీసు అధికారిగా కెరీర్ ప్రారంభించింది. ఆమె 1980లో ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేరింది. 1980 బ్యాచ్ లో ఉన్న ఏకైక మహిళా అధికారి ఆమె.[2] 1989లో, ఆమె సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి క్రిమినాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసింది. 1995లో ఆమెకు రాష్ట్రపతి పోలీసు పతకం లభించింది.

మే 2014లో, ఆమె సిబిఐలో అదనపు డైరెక్టర్ గా చేరింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అదనపు డైరెక్టర్ గా నియమించబడిన భారతదేశంలో మొదటి మహిళా అధికారి కూడా ఆమెనే.[3] ఆమె నియామకాన్ని చట్టవిరుద్ధమైన నియామకంగా భావించి తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో చట్టబద్ధంగా సవాలు చేసింది, అర్చన నియామకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.[4][5][6] నియామకానికి ముందు అనుమతి కోరనందుకు ఆమెను తమిళనాడు ప్రభుత్వం డిజిపి పదవి నుండి సస్పెండ్ చేసింది.[7]


2015లో ఆమెను సిబిఐ నుండి తొలగించి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ గా నియమించారు.[8] అయితే 2015లో సిబిఐలో వివాదాస్పదమైనప్పటికీ 2017లో సిబిఐ చీఫ్ పదవికి ఆమె నామినేట్ అయింది.[9][10]

2016 ఫిబ్రవరి 3న, ఆమె సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బి) డైరెక్టర్ జనరల్ గా నియమితులయింది. దీంతో, ఆమె కేంద్ర సాయుధ పోలీసు బలగానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా పోలీసు అధికారి.[11][12][13] జూలై 2018లో, అర్చన స్థానంలో సశస్త్ర సీమా బాల్ డివిజన్ కొత్త డైరెక్టర్ జనరల్ గా రజనీకాంత్ మిశ్రా నియమించబడ్డాడు.[14] అర్చన 2018లో ఐపీఎస్ నుంచి పదవీ విరమణ చేసింది, తన కెరీర్ 37 సంవత్సరాల పాటు కొనసాగింది. మార్చి 2019లో ఆమె లోక్‌పాల్ నాన్-జ్యుడిషియల్ సభ్యురాలిగా నియమితులయింది, అక్కడ ఆమె మార్చి 2024 వరకు పనిచేసింది.[15]

మూలాలు

[మార్చు]
  1. Tripathi, Rahul (2016-02-04). "Leadership is more important than gender: Archana Ramasundaram, Director General Sashastra Seema Bal". The Economic Times. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26.
  2. "Power Trendsetter: Archana Ramasundaram". Verve Magazine (in ఇంగ్లీష్). 2016-07-07. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26.
  3. Bhagat, Rasheeda. "Archana Ramasundaram is right material to become CBI director: RK Raghavan". The Hindu Business Line.
  4. Service, Indo-Asian News (2014-08-20). "Supreme Court: IPS officer Archana Ramasundaram's appointment to CBI post flawed and illegal". India.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26.
  5. "Supreme Court asks Centre whether Archana Ramasundaram can join CBI as Additional Director". The Economic Times. 2015-10-13. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26.
  6. "CBI vs Jayalalithaa Over Top Woman Cop, Supreme Court Intervenes". NDTV.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26.
  7. BHAGAT, RASHEEDA. "The curious case of Archana Ramasundaram". @businessline (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26.
  8. "Archana Ramasundaram out of CBI, appointed Director of National Crime Records Bureau". The Economic Times. 2015-06-17. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26.
  9. "After Controversy, Central Bureau of Investigation (CBI) Could Get First Woman Chief. Key Meeting Today". NDTV.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26.
  10. "Archana Ramasundaram may become first woman CBI chief". The Asian Age. 2017-01-16. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26.
  11. Bureau, National (2016-02-02). "Archana Ramasundaram is SSB chief". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26. {{cite news}}: |last= has generic name (help)
  12. Singh, Vijaita (2016-02-04). "I was appointed because of my seniority, says SSB chief". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26.
  13. "Meet the IPS Officer Who Made History as India's First Woman to Head a Paramilitary Force!". The Better India (in ఇంగ్లీష్). 2018-10-27. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26.
  14. "First ever woman chief of SSB retires; Rajni Kant Mishra takes charge". The Economic Times. 2018-07-14. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-26.
  15. "Top judges to experienced bureaucrats: Meet all 8 members of India's first Lokpal appointed by President Kovind". Firstpost (in ఇంగ్లీష్). 2019-03-20. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-03-11.