అర్చన గౌతమ్
అర్చన గౌతమ్ | |
---|---|
జననం | [1] మీరట్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1995 సెప్టెంబరు 1
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2016–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
|
బిరుదు | మిస్ ఉత్తరప్రదేశ్ 2014 మిస్ బికినీ భారతదేశం 2018 మిస్ కాస్మో ఇండియా 2018 మిస్ టాలెంట్ వరల్డ్ 2018 |
అర్చన గౌతమ్ (జననం: 1995 సెప్టెంబరు 1) భారతీయ రాజకీయవేత్త, మోడల్. ఆమె మిస్ బికినీ ఇండియా 2018 అందాల పోటీ టైటిల్‌ను గెలుచుకుంది. అలాగే ఆమె మిస్ కాస్మోస్ వరల్డ్ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. 2022లో మోస్ట్ టాలెంట్ 2018 సబ్ టైటిల్‌ను గెలుచుకుంది. హిందీ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 16లో పార్టిసిపెంట్ కూడా అయిన ఆమె 3వ రన్నరప్‌గా నిలిచింది.[2]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దళిత కుటుంబంలో జన్మించింది.[3][4] ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆమె మాస్ కమ్యూనికేషన్‌లో తన చదువును పూర్తి చేసింది.[5]
కెరీర్
[మార్చు]సినిమా
[మార్చు]ఆమె ప్రింట్, టెలివిజన్‌లలో మోడలింగ్ తో పాటు వివిధ బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనల ప్రచారాలను చేసింది. ఆమె గ్రేట్ గ్రాండ్ మస్తీ, హసీనా పార్కర్, బారాత్ కంపెనీ వంటి చిత్రాలలో అతిథి పాత్రలను పోషించింది. వారణాసి జంక్షన్ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం ఆమె అతిథి పాత్రలో నటించింది. ఆమె టి-సిరీస్ కోసం దర్శకుడు అపూర్వ లఖియాతో ఒక మ్యూజిక్ వీడియో షూట్ లో పాల్గొన్నది.
ఆమె 2014లో మిస్ ఉత్తరప్రదేశ్ టైటిల్‌ను అందుకుంది. ఆమె మిస్ బికినీ ఇండియా 2018ని గెలుచుకుంది. మిస్ బికినీ యూనివర్స్ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[6] మలేషియాలో జరిగిన మిస్ కాస్మోస్ 2018లో ఆమె కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. మోస్ట్ టాలెంట్ 2018 అనే ఉప టైటిల్‌ను గెలుచుకుంది.
2022 అక్టోబరు నుండి 2023 ఫిబ్రవరి వరకు, ఆమె కలర్స్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 16లో పార్టిసిపెంట్‌గా చేసింది,[7] అక్కడ ఆమె 3వ రన్నరప్‌గా నిలిచింది.[8]
రాజకీయాలు
[మార్చు]ఆమె 2021 నవంబరులో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరింది. 2022 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు హస్తినాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి టిక్కెట్ పొందింది.[9] ఆమె 107587 ఓట్లతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దినేష్ ఖటిక్ చేతిలో ఓడిపోగా, ఆమెకు కేవలం 1,519 ఓట్లు మాత్రమే వచ్చాయి.[10]
మూలాలు
[మార్చు]- ↑ "Bigg Boss 16 contestant Archana Gautam; Here's all you need to know about the Congress MLA - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-02-15.
- ↑ "Miss Bikini India 2018 and UP Congress candidate Archana Gautam on her viral bikini pictures: 'Don't mix my professions' | Hindi Movie News - Bollywood - Times of India". m.timesofindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-20.
- ↑ "I have come to break draupadi's curse". Times of India. Retrieved 23 September 2023.
- ↑ "In pics: Politician-actress Archana Gautam's journey from Miss Bikini India to Bigg Boss 16, Khatron Ke Khiladi 13".
- ↑ "Bigg Boss 16 contestant Archana Gautam; Here's all you need to know about the Congress MLA - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-02-15.
- ↑ "Archana Gautam, beauty pageant winner who contested UP polls, got 1,519 votes". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 2022-12-23.
- ↑ "Meet Bigg Boss 16 contestant Archana Gautam, who went from modelling to politics". The Indian Express (in ఇంగ్లీష్). 2 October 2022. Retrieved 2 October 2022.
- ↑ "Archana Gautam gets evicted from the winner's race and becomes the third runner up". The Times of India. Retrieved 2023-02-13.
- ↑ "UP election: Actor-model Archana Gautam, now Congress candidate, has a request". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-01-15. Retrieved 2023-02-14.
- ↑ "'Bikini Girl' Archana Gautam, Hastinapur's Congress Candidate, Got 1519 Votes But Has 756K Insta Followers!". News18 (in ఇంగ్లీష్). 2 October 2022. Retrieved 30 October 2022.