అర్చన చిట్నిస్
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2023 డిసెంబర్ 3 | |||
| ముందు | ఠాకూర్ సురేంద్ర సింగ్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బుర్హాన్‌పూర్ | ||
| పదవీ కాలం 2008 – డిసెంబర్ 2018 | |||
| ముందు | హమీద్ కాజీ | ||
| నియోజకవర్గం | బుర్హాన్‌పూర్ | ||
మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం జూన్ 2016 – డిసెంబర్ 2018 | |||
| తరువాత | ఇమార్తి దేవి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1964 ఏప్రిల్ 20 | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | బుర్హాన్‌పూర్, మధ్యప్రదేశ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
అర్చన చిట్నిస్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు నేపానగర్, భికాన్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా పని చేసింది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అర్చన చిట్నిస్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నేపానగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రఘునాథ్ చౌదరి చేతిలో 295 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఆమె 2003 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రఘునాథ్ చౌదరిపై 24,802 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై స్త్రీ, శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమ, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, శిక్షణ, పశుసంవర్ధక, గో ప్రమోషన్ బోర్డు, సామాజిక న్యాయ శాఖల మంత్రిగా పని చేసింది.
అర్చన చిట్నిస్ 2008 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బుర్హాన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి హమీద్ కాజీ చేతిలో 32,854 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] విద్య, స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిగా పని చేసింది. ఆమె 2013 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అజయ్‌సింగ్ రఘువంశీపై 22,827 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[3], జూన్ 2016 నుండి డిసెంబర్ 2018 వరకు స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిగా పని చేసింది.
అర్చన చిట్నిస్ 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బుర్హాన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఠాకూర్ సురేంద్ర సింగ్ చేతిలో 5120 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఠాకూర్ సురేంద్ర సింగ్‌పై 31,171 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "बुरहानपुर में पूर्व मंत्री पर भारी पड़े थे निर्दलीय शेरा, इस बार फिर दोनों आमने-सामने, कौन मारेगा बाजी?". Zee News Hindi. 23 October 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ "Madhya Pradesh Assembly Election Results 2023 - Burhanpur" (in ఇంగ్లీష్). Election Commission of India. 3 December 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.
- ↑ "Burhanpur Constituency Election Results 2023". The Times of India (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 27 February 2025. Retrieved 27 February 2025.