అర్జున్ దేశ్వాల్
| Personal information | |||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nickname | Raid Machine | ||||||||||||||||||||
| Nationality | భారతీయుడు | ||||||||||||||||||||
| Born | 1999 జూలై 7 | ||||||||||||||||||||
| Years active | 2019-ప్రస్త్తుతం | ||||||||||||||||||||
| Employer | యు.పి. పోలిస్‌లో డి.ఎస్.పి. | ||||||||||||||||||||
| Sport | |||||||||||||||||||||
| Country | భారతదేశం | ||||||||||||||||||||
| Sport | కబడ్డీ | ||||||||||||||||||||
| League | ప్రో కబడ్డీ లీగ్ | ||||||||||||||||||||
| Team | తమిళ్ తలైవాస్ (2025-ప్రస్తుతం) | ||||||||||||||||||||
Medal record
| |||||||||||||||||||||
అర్జున్ దేశ్వాల్ (జననం 7 జూలై 1999) ఉత్తర ప్రదేశ్‌కు చెందిన భారతీయ ప్రొఫెషనల్ కబడ్డీ ఆటగాడు. ఇతడు రైడర్ గా ఆడతాడు. ఇతడు ప్రో కబడ్డీ లీగ్ (PKL) లో తమిళ తలైవాస్కు నాయకత్వం వహించాడు. ఇతడు దూకుడు రైడింగ్ టెక్నిక్‌కు లీగ్‌లో ఇతడిని "రైడ్ మెషిన్" అని ముద్దుగా పిలుస్తారు. చైనాలోని గాంగ్‌జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన భారత జట్టులో ఇతడు భాగంగా ఉన్నాడు.[1]
ప్రారంభ జీవితం, నేపథ్యం
[మార్చు]దేశ్వాల్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లా బసేరా గ్రామంలో ఒక జాట్ కుటుంబంలో జన్మించాడు.[2][3] ఇతడు తన గ్రామంలో కుర్రాళ్ళు కబడ్డీ ఆడటం చూసేవాడు. దానితో ప్రేరణ పొంది ఇతడు కూడా 14 సంవత్సరాల వయస్సులో క్రమం తప్పకుండా కబడ్డీ ఆడటం ప్రారంభించాడు. ఆ తర్వాత అండర్-16 స్కూల్ నేషనల్స్‌లో తన పాఠశాలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2019లో ఉత్తరాఖండ్ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు.[4]
వృత్తి
[మార్చు]దేశ్వాల్ తన వృత్తిపరమైన క్రీడను ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా తరపున ఆడుతూ ప్రారంభించాడు. తరువాత ఇతడు జైపూర్ పింక్ పాంథర్స్ కు బదిలీ చేయబడ్డాడు, అక్కడ ఇతడు 2022 PKL సీజన్ 9 గెలవడానికి ఆ జట్టుకు సహాయపడ్డాడు.[2][3][5] ఇతడు PKL సీజన్ 9లో అగ్రశ్రేణి రైడర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[6] 2023 లో, ఇతడు 2022 ఆసియా క్రీడలలో భారతదేశం తరపున పోటీ పడిన ఇతని జట్టు ఫైనల్స్‌లో ఇరాన్ జట్టును 33-29 స్కోరుతో ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.[7][1][8][9] దేశీయ టోర్నమెంట్లలో, ఇతడు సర్వీసెస్ జట్టు, గ్రీన్ ఆర్మీకి ప్రాతినిధ్యం వహించాడు.
మూలాలు
[మార్చు]- 1 2 "We will win gold medal: Kabaddi legends on Indian teams' Asian Games prospects". The Times of India. 2023-10-04. ISSN 0971-8257. Archived from the original on 7 October 2023. Retrieved 2023-10-07.
- 1 2 "Arjun Deshwal - Jaipur Pink Panthers' raider for all seasons". ESPN (in ఇంగ్లీష్). 2022-11-26. Archived from the original on 2023-02-04. Retrieved 2023-10-07.
- 1 2 "Arjun Deshwal Bio & Stats | Jaipur Pink Panthers | Pro Kabaddi Season 9". Kabaddi Adda (in ఇంగ్లీష్). Archived from the original on 2023-10-07. Retrieved 2023-10-07.
- ↑ "arjun deshwal biography , village, age, auction, pkl 8 - Kabaddian" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-29. Archived from the original on 2024-01-13. Retrieved 2024-01-13.
- ↑ "Deshwal leads Jaipur to win over Haryana in Pro Kabaddi". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-10-14. Archived from the original on 2023-09-01. Retrieved 2023-10-07.
- ↑ "Pro Kabaddi 2022 Top Raider, Most Super 10s: Arjun Deshwal gets green sleeve; score table after Bengal vs Bengaluru". The Hindu (in ఇంగ్లీష్). 2022-11-25. Archived from the original on 2022-11-29. Retrieved 2023-10-07.
- ↑ "Full list of Indian athletes for Asian Games 2023". Firstpost (in ఇంగ్లీష్). 2023-08-26. Archived from the original on 27 August 2023. Retrieved 2023-10-07.
- ↑ "Asian Games 2023, Day 14 Live Updates: India win men's kabaddi Gold after controversial finish". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 7 October 2023. Retrieved 2023-10-07.
- ↑ "India win men's kabaddi gold after controversial final against Iran involving one hour stoppage". ESPN (in ఇంగ్లీష్). 2023-10-07. Archived from the original on 7 October 2023. Retrieved 2023-10-07.