అర్జున్ మోద్వాడియా
| అర్జున్ మోద్వాడియా | |||
| పదవీ కాలం 2025 అక్టోబర్ 17 – ప్రస్తుతం | |||
| పదవీ కాలం 2022 డిసెంబర్ 8 – ప్రస్తుతం | |||
| ముందు | బాబూభాయ్ బోఖిరియా | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | పోర్‌బందర్ | ||
| పదవీ కాలం డిసెంబర్ 2002 – డిసెంబర్ 2012 | |||
| ముందు | బాబూభాయ్ బోఖిరియా | ||
| తరువాత | బాబూభాయ్ బోఖిరియా | ||
| నియోజకవర్గం | పోర్‌బందర్ | ||
గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు | |||
| పదవీ కాలం మార్చి 2011 – మార్చి 2015 | |||
| ముందు | సిద్ధార్థ్ పటేల్ | ||
| తరువాత | భరత్‌సిన్హ్ సోలంకి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1957 ఫిబ్రవరి 17 మోధ్వాడా, బొంబాయి రాష్ట్రం, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | హీరాబెన్ | ||
| సంతానం | 2 | ||
| నివాసం | పోర్‌బందర్ | ||
| పూర్వ విద్యార్థి | లుఖ్ధీర్జి ఇంజనీరింగ్ కళాశాల , మోర్బి; సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
అర్జున్ మోద్వాడియా గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు పోర్‌బందర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2025 అక్టోబర్ 18న శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]అర్జున్ మోద్వాడియా 1997లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2002లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోర్‌బందర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆయన ఆ తరువాత గుజరాత్ (పార్లమెంటరీ & శాసనసభ నియోజకవర్గాలు) కోసం భారత డీలిమిటేషన్ కమిషన్ సభ్యుడిగా, 2004 నుండి 2007 వరకు గుజరాత్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పని చేశాడు.
అర్జున్ మోద్వాడియా 2007లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2008 నుండి 2009 వరకు మీడియా కమిటీ ఛైర్మన్‌గా, గుజరాత్ పీసీసీ ముఖ్య ప్రతినిధిగా, 2011 మార్చి 2న గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి 27వ అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు.[2] ఆయన 2012లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత డిసెంబర్ 20న గుజరాత్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఆయన 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బాబు బోఖిరియా చేతిలో ఓడిపోయాడు.
అర్జున్ మోద్వాడియా 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో పోర్‌బందర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బాబు బోఖిరియాను ఓడించి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన మార్చి 2024లో భారత జాతీయ కాంగ్రెస్‌ను వీడి,[3] బిజెపి గుజరాత్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సి.ఆర్. పాటిల్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[4]
అర్జున్ మోద్వాడియా 2025 అక్టోబర్ 17న భూపేంద్రభాయ్ పటేల్ మంత్రివర్గంలో శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[5][6][7][8][9]
మూలాలు
[మార్చు]- ↑ "Gujarat portfolio allocation: CM Bhupendra Patel keeps GAD, Harsh Sanghavi Home and Kanubhai Desai Finance - Details" (in ఇంగ్లీష్). Mint. 17 October 2025. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "Arjun Modhwadia appointed new state Cong president" (in ఇంగ్లీష్). The Indian Express. 3 March 2011. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "Gujarat Congress veteran Arjun Modhwadia quits, 'felt helpless'" (in ఇంగ్లీష్). India Today. 4 March 2024. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "Gujarat leaders join BJP a day after quitting Congress" (in ఇంగ్లీష్). Hindustan Times. 5 March 2024. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "New Gujarat cabinet: Harsh Sanghavi becomes Deputy CM, Rivaba Jadeja gets education | Check list" (in ఇంగ్లీష్). India TV News. 17 October 2025. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "List Of Portfolios of Gujarat Ministers". Vibes Of India. 17 October 2025. Archived from the original on 20 October 2025.
- ↑ "Bhupendra Patel 3.0: Gujarat Dy CM Sanghvi, Rivaba take charge as Cabinet gets down to business" (in ఇంగ్లీష్). The New Indian Express. 19 October 2025. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "Who are the 19 new ministers in Gujarat cabinet? Know here". english..com (in ఇంగ్లీష్). Gujarat Samachar. 21 October 2025. Archived from the original on 21 October 2025. Retrieved 21 October 2025.
- ↑ "Gujarat Cabinet reshuffle: 3 women ministers, but none given Cabinet rank" (in ఇంగ్లీష్). The Indian Express. 17 October 2025. Archived from the original on 21 October 2025. Retrieved 21 October 2025.