అర్జున్ రామ్ మేఘవాల్
అర్జున్ రామ్ మేఘవాల్ | |||
| |||
పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 31 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
కేంద్ర భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్ప్రైజ్స్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 31 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | బాబుల్ సుప్రియో | ||
కేంద్ర జలవనరుల సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 3 సెప్టెంబర్ 2017 – 24 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | సంజీవ్ బాల్యాన్ | ||
తరువాత | రత్తాన్ లాల్ కటారియా | ||
కేంద్ర ఆర్ధిక మంత్రి
| |||
పదవీ కాలం 5 జులై 2016 – 3 సెప్టెంబర్ 2017 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | జయంత్ సిన్హా | ||
తరువాత | శివ్ ప్రతాప్ శుక్లా | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 31 మే 2009 | |||
ముందు | ధర్మేంద్ర | ||
నియోజకవర్గం | బికానెర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] బికానెర్, రాజస్థాన్, భారతదేశం | 1953 డిసెంబరు 20||
జీవిత భాగస్వామి | పాన దేవి | ||
వృత్తి | ఐఏఎస్ అధికారి |
అర్జున్ రామ్ మేఘవాల్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ శాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]అర్జున్ రామ్ మేఘవాల్ రాజస్థాన్‌లోని బికనీర్‌లోని కిష్మీదేసర్ గ్రామంలో 1953 డిసెంబరు 20న లఖు రామ్ మేఘ్వాల్, హీరా దేవి దంపతులకు జన్మించాడు. ఆయన బికానెర్‌లోని దుంగార్ కళాశాల, ఫిలిప్పీన్స్‌లోని ఫిలిప్పీన్స్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్, 1977లో ఎల్ఎల్బీ, 1979 ఎంబీఏ పూర్తి చేశాడు.
ఉద్యోగ జీవితం
[మార్చు]అర్జున్ రామ్ మేఘవాల్ 1982లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం పొంది బికనీర్ జిల్లా ఉద్యోగ్ కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా తొలి పోస్టింగ్ అందుకొని రాజస్థాన్‌లోని ఝుంఝును, ధౌల్పూర్, రాజ్సంవాద్, జైపూర్, అల్వార్ & శ్రీగంగానగర్ జిల్లాలో జనరల్ మేనేజర్‌గా పనిచేశాడు. అర్జున్ రామ్ రాజస్థాన్ కేడర్‌లో 1999 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారిగా పదోన్నతి అందుకొని డిప్యూటీ సెక్రటరీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ వంటి అనేక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్‌లలో ప్రత్యేక కార్యదర్శి, ఉన్నత విద్య మేనేజింగ్ డైరెక్టర్, రాజస్థాన్ లఘు ఉద్యోగ్ నిగమ్ లిమిటెడ్ అదనపు కమిషనర్, వాణిజ్య పన్ను శాఖ, జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ గా వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో చేరేందుకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి 2009లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు.
రాజకీయ జీవితం
[మార్చు]అర్జున్ రామ్ మేఘవాల్ ఐఏఎస్ పదవీ విరమణ తరువాత 2009 సంవత్సరంలో బీజేపీలో చేరి బికనీర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన తరువాత 2014, 2019లో వరుసగా పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై లోక్‌సభలో భారతీయ జనతా పార్టీ చీఫ్ విప్‌గా, హౌస్ కమిటీలలో పనిచేశాడు. ఆయన 2017లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా నియమితుడై, 2019 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha (2019). "Arjun Ram Meghwal". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
- ↑ TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.