అర్జున్ లాల్ జాట్
2024లో అర్జున్ లాల్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Personal information | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Born | 1997 ఫిబ్రవరి 7 నయాబాస్, రాజస్థాన్, భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Height | 180 సెం.మీ. | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Military career | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| రాజభక్తి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| సేవలు/శాఖ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| సేవా కాలం | 2016–ప్రస్తుతం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ర్యాంకు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Sport | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Sport | రోయింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అర్జున్ లాల్ జాట్ (జననం 7 ఫిబ్రవరి 1997) ఒక భారతీయ ప్రొఫెషనల్ రోవర్. ఇతడు భారత సైన్యంలో ఒక సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు వేసవి ఒలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్స్ వంటి అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[1] ఇతడు 2021, 2022 ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్స్ పోటీలలో స్వర్ణపతకాలను, 2019 ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్స్‌లో రజత పతకాన్నీ, 2022 ఆసియా క్రీడలలో రజత పతకాన్నీ గెలుచుకున్నాడు. ఇంకా 2022, 2023 భారత జాతీయ క్రీడలలో స్వర్ణ పతకాలు గెలుచుకున్నాడు.[2]
ప్రారంభ జీవితం
[మార్చు]అర్జున్ లాల్ 1997 ఫిబ్రవరి 7న రాజస్థాన్ జైపూర్ జిల్లాలోని నయాబాస్ గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి రామ్ స్వరూప్ జాట్ ఒక రైతు. [3][4] ఇతడు ప్రాథమిక విద్యను నయాబాస్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్తి చేశాడు. కాలాడేరాలోని ఆర్. ఎల్. సహరియా కళాశాలలో తన కళాశాల విద్యను అభ్యసించాడు.[5]
వృత్తి
[మార్చు]సైనికవృత్తి
[మార్చు]అర్జున్ 2014లో రాజ్ పుటానా రైఫిల్స్ రెజిమెంట్‌లో సిపాయిగా ఎంపికయ్యాడు. భారత సైన్యంలో పనిచేస్తున్నప్పుడు, ఇతడు తన రోయింగ్ కోచ్ బజరంగ్ లాల్ తాఖర్ ను కలుసుకున్నాడు. తన కోచ్ సలహాను అనుసరించి, అర్జున్ 2014 నుండి రోయింగ్‌లో శిక్షణను ప్రారంభించాడు. 2020లో, ఇతడు నాయబ్ సుబేదార్ హోదాకు పదోన్నతి పొందాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ నుండి తిరిగి వచ్చిన తరువాత, సుబేదార్ గా పదోన్నతి పొంది ప్రస్తుతం భారత సైన్యంలో సుబేదార్ గా పనిచేస్తున్నాడు.[6]
రోయింగ్ వృత్తి
[మార్చు]అర్జున్ లాల్ ప్రధానంగా పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో అరవింద్ సింగ్ తో కలిసి పోటీ చేస్తాడు. ఈ ద్వయం దక్షిణ కొరియా జరిగిన 2019 ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. టోక్యోలో జరిగిన 2020 వేసవి ఒలింపిక్స్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ముందు, వారు ఒలింపిక్స్‌లో డబుల్ స్కల్స్ సెమీఫైనల్‌కు చేరుకున్న మొదటి భారతీయులు అయ్యారు.[7][8]

2021లో, రవి తో జత కట్టిన అర్జున్ లాల్, థాయిలాండ్ లో జరిగిన 2021 ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్స్‌లో పురుషుల డబుల్ స్కల్స్ లో 6: 57.883 ల సమయంలో లక్ష్యాన్ని చేరుకుని బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు, ఈ విజయం కాంటినెంటల్ ఛాంపియన్షిప్లో పురుషుల డబుల్ స్కల్స్‌లో భారతదేశానికి వరుసగా రెండవ పోడియం ముగింపు.[9][10] మరుసటి సంవత్సరం, ఇతడు, అరవింద్ సింగ్ లు 2022 ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్స్‌లో బంగారు పతకాన్ని సాధించారు. ఈ జంట డబుల్ స్కల్స్ ఈవెంట్లలో అనేక జాతీయ టైటిల్స్ తో పాటు 2022 , 2023 జాతీయ క్రీడలలో బంగారు పతకాలు గెలుచుకుంది.[2]
2022 హాంగ్జౌ ఆసియా క్రీడలలో, అర్జున్ లాల్, అరవింద్ సింగ్లు పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఈవెంటులో వెండి పతకాన్ని గెలుచుకున్నారు.[11][12]
పారిస్ 2024 ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు ముందు, చైనాలో శిక్షణ పొందుతున్నప్పుడు ఇతడు వెన్నునొప్పి కారణంగా, దక్షిణ కొరియాలో జరిగిన ఒలింపిక్ అర్హత పోటీని కోల్పోయాడు. ఇది టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) డెవలప్మెంట్ గ్రూప్‌కు తాత్కాలికంగా తిరిగి నియమించడానికి దారితీసింది. అధికారిక వైద్య పర్యవేక్షణ లేకుండా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫిజియోథెరపిస్ట్ మార్గదర్శకత్వంలో పునరావాసం పొంది, 2025లో శిక్షణను తిరిగి ప్రారంభించాడు. జాతీయ పోటీలకు ముందు, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో తన సంసిద్ధతను అంచనా వేయడానికి ఇతడు ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్నాడు.[2]
అంతర్జాతీయ ఈవెంట్లతో పాటు, అర్జున్ దేశీయ రోయింగ్ సర్క్యూట్లలో కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 2018, 2019 ఓపెన్ స్ప్రింట్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్స్ రెండింటిలోనూ లైట్వెయిట్ పురుషుల డబుల్ స్కల్స్‌లో రజత పతకాలు గెలుచుకున్నాడు. తరువాత 2022లో పూణే జరిగిన డబుల్ స్కల్స్ విభాగంలో మరో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. తన ఫామ్ను కొనసాగిస్తూ, 2023లో పూణే జరిగిన లైట్వెయిట్ పురుషుల డబుల్ స్కల్స్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. [13]
మూలాలు
[మార్చు]- ↑ "Never gave Tokyo Olympics much thought, but have been training for it since October 2020: Rower Arjun Lal Jat". New Indian Express News.
- 1 2 3 Dey, Santadeep (2025-08-22). "Faded tattoo, clear dreams: Rower Arjun Lal Jat returns from back injury and sets LA28 target". Sportstar (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-10-03.
- ↑ झा, मोहित (24 September 2023). "Asian Games 2023: राजस्थान के खिलाड़ियों का धमाल, नौकायन में भारत को मिले एक से अधिक पदक". rajasthan.ndtv.in (in హిందీ). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 October 2025.
7 फ़रवरी, 1997 को राजस्थान के जयपुर में स्थित नयाबास ग्राम पंचायत में जन्में अर्जुन लाल जाट और अरविंद सिंह ने एशियन गेम्स 2023 में पुरूष लाइटवेट डबल स्कल स्पर्धा में रजत पदक जीतकर भारत का खाता खोला.
[permanent dead link] - ↑ "Arjun LAL JAT". Olympics.com (in హిందీ). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 October 2025.
- ↑ "कॉलेज तक स्पोट्र्स में इंटरेस्ट नहीं था, अब जीता मेडल: एशियन गेम्स में सिल्वर जीतने वाले अर्जुन ने आर्मी जॉइन करने के बाद सीखी रोइंग". Dainik Bhaskar (in హిందీ). 24 September 2023. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 October 2025.
- ↑ "कॉलेज तक स्पोट्र्स में इंटरेस्ट नहीं था, अब जीता मेडल: एशियन गेम्स में सिल्वर जीतने वाले अर्जुन ने आर्मी जॉइन करने के बाद सीखी रोइंग". Dainik Bhaskar (in హిందీ). 24 September 2023. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 October 2025.
- ↑ "Tokyo Olympics: Know Your Olympian - Arjun Jat, Rowing". News18 (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-10-03.
Arjun and Arvind's dedication and efforts bore fruit after they made India proud by clinching the second position at the 2019 Asian Championships.
- ↑ SUBRAHMANYAM, V. V. (2021-07-25). "Tokyo Olympics | Arjun Jat, Arvind Singh become first Indians to reach double sculls semifinals". The Hindu (in Indian English). ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-10-03.
- ↑ "Asian Rowing Championships: Arjun Lal Jat-Ravi pair wins gold, Parminder Singh bags silver". The Times of India. 2021-12-11. ISSN 0971-8257. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-10-03.
- ↑ "Asian Rowing C'ships: Arjun Lal Jat, Ravi claim gold in double sculls". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-12-11. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-10-03.
- ↑ "Asian Games 2023: Meet Arjun Lal Jat and Arvind Singh, who won silver medals for India in rowing". The Indian Express (in ఇంగ్లీష్). 2023-09-24. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-10-03.
- ↑ "Hangzhou Asian Games: India's Arjun Lal Jat and Arvind Singh win silver in Men's Rowing Lightweight Double Sculls". The Times of India. 2023-09-24. ISSN 0971-8257. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-10-03.
- ↑ "India Rowing". www.indiarowing.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-10-07.
