Jump to content

అర్జున్ సింగ్ చీమా

వికీపీడియా నుండి
అర్జున్ సింగ్ చీమా
Personal information
Nationalityభారతదేశం
Born (2001-06-13) 2001 జూన్ 13 (వయసు: 24)
మండి గోవింద్గఢ్‌, పంజాబ్, భారతదేశం
Sport
Country భారతదేశం
Sportషూటింగ్
Event10 మీ. ఎయిర్ పిస్టల్
Medal record
షూటింగ్
Representing భారతదేశం
ఆసియా ఛాంపియన్షిప్స్
Bronze medal – third place 2019 దోహా 50 మీ పిస్టల్
Bronze medal – third place 2019 దోహా 50 మీ పిస్టల్ జట్టు
ఆసియా క్రీడలు
Gold medal – first place 2022 హంగ్‌జౌ 10 మీ ఎయిర్ పిస్టల్ జట్టు

అర్జున్ సింగ్ చీమా (జననం 13 జూన్ 2001) పంజాబ్‌కు చెందిన భారతీయ క్రీడా షూటర్. ఇతడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పోటీ చేస్తాడు. చైనా దేశం హాంగ్జౌ లో జరిగిన 2022 ఆసియా క్రీడలలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంటులో స్వర్ణం సాధించిన భారత షూటింగ్ జట్టులో ఇతడు భాగంగా ఉన్నాడు.[1][2]

ప్రారంభ జీవితం

[మార్చు]

అర్జున్ పంజాబ్ లోని మండి గోవింద్గఢ్‌లో జన్మించాడు.[3] ఇతడు తన పాఠశాల విద్యను మండి గోవింద్గఢ్‌లోని ఓం ప్రకాష్ బన్సాల్ మోడల్ స్కూల్లో పూర్తి చేశాడు.[4][5] ఇతడు ఒక క్రీడా కుటుంబం నుండి వచ్చాడు. ఇతని తాత సర్దార్ బల్వీందర్ సింగ్ భారతదేశం కోసం ఫుట్బాల్ ఆడాడు. ఇతని మామ జగ్వీందర్ సింగ్ చీమా ఆసియా జూనియర్ పవర్‌లిఫ్టింగ్ రికార్డును కలిగి ఉన్నాడు.[5] ఇతడు ఈతగాడుగా తన క్రీడాజీవితాన్ని ప్రారంభించి, షూటింగ్‌కు మారడానికి ముందు ఆస్ట్రియా లో జరిగిన అంతర్జాతీయ జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్‌లో పాల్గొన్నాడు.[5]

వృత్తి

[మార్చు]

అర్జున్ సింగ్ తన వృత్తి జీవితాన్ని 2015లో కోచ్ లు జోషి పర్వేజ్, కుమార్ హోలిండర్, జస్పాల్ రాణాల పర్యవేక్షణలో ప్రారంభించాడు. 2022 ఆసియా క్రీడలలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారతదేశం కోసం బంగారు పతకం సాధించిన 3 మంది సభ్యుల జట్టులో శివ నర్వాల్,సరబ్ జోత్ సింగ్లతో పాటు ఇతడూ ఉన్నాడు.[6] 2019లో దక్షిణ కొరియా లో జరిగిన 52వ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో రెండు బంగారు పతకాలు సాధించాడు.[3] 2018లో, సుహ్ల్ , సిడ్నీలలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారత జట్టులో కూడా ఇతడు ఒక భాగం.[4] 2018లో, కొరియాలోని చాంగ్వాన్ జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో జూనియర్ పురుషుల 50 మీటర్ల పిస్టల్లో కూడా ఇతడు బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.[7] ఏప్రిల్ 2024లో న్యూఢిల్లీలో జరిగిన రెండవ భారత ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌లో రవీందర్ సింగ్, ఒలింపిక్ కోటా విజేత వరుణ్ తోమర్ కంటే ముందు చీమా అగ్రస్థానంలో నిలిచాడు. అధికారుల లోపం కారణంగా అతను బోనస్ పాయింట్‌ను కూడా కోల్పోయాడని సమాచారం.[8][9][10]

మూలాలు

[మార్చు]
  1. "Indian shooters at Asian Games: Events, key dates, format and rules". ESPN (in ఇంగ్లీష్). 2023-09-24. Retrieved 2023-09-28.
  2. "Youngsters make a big bang, claim 10m air pistol gold". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-09-28. Retrieved 2023-11-19.
  3. 3.0 3.1 Diary, Punjab (2019-01-28). "Shooter hits the bull's eye". www.tribuneindia.com. Retrieved 2023-09-28.
  4. 4.0 4.1 "Arjun Cheema of Fatehgarh Sahib wins shooting gold". www.babushahi.com. Retrieved 2023-11-19.
  5. 5.0 5.1 5.2 "Punjab shooter Arjun Cheema eyes ticket to Tokyo". The Times of India. 2019-01-30. ISSN 0971-8257. Retrieved 2023-11-19.
  6. Sportstar, Team (2023-09-28). "Indian shooters clinch gold in 10m air pistol team event at Asian Games 2023". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
  7. Administrator (2018-09-02). "Arjun Cheema becomes Junior World Champion in 50m Pistol" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-19.
  8. Srinivasan, Kamesh (2024-04-27). "Olympic Shooting trials: Cheema, Esha, Divyansh and Elavenil win on final day". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2024-05-15.
  9. "Olympic trials". The Hindu (in Indian English). 2024-04-27. ISSN 0971-751X. Retrieved 2024-05-15.
  10. "NRAI Overlooked Key Selection Clause Ahead of Olympic Trials, Corrected It in Nick of Time". News18 (in ఇంగ్లీష్). 2024-05-09. Retrieved 2024-05-15.

బాహ్య లింకులు

[మార్చు]