అర్ధవాహకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అర్ధవాహకాలు (సెమి కండక్టర్లు) అనేవి ఒక ప్రత్యేకమైన విద్యుత్తు ప్రవాహ లక్షణాలు కలిగిన స్ఫటిక లేద అస్ఫటిక ఘన పదార్థాలు[1]. ఇవి సాధారణంగా ఇతర మూలకాలకు ఉండే విద్యున్నిరోధం కంటే ఎక్కువ నిరోధం కలిగిఉంటాయి. అలాగని పూర్తి విద్యున్నిరోధాకాలుగా కూడా పనిచేయవు. వీటి ఉష్ణోగ్రత పెంచుతూ పోతే వాటి నిరోధం తగ్గుతూ వస్తుంటుంది. ఈ లక్షణం లోహాలకు విరుద్ధంగా ఉంటుంది. వాటిలో విద్యుత్ ప్రవాహాన్ని మనం వాటి స్ఫటికాకృతిలోనికి మలినాలను కలపడం ద్వారా మనకు కావలసిన విధంగా మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియనే డోపింగ్ అని వ్యవహరిస్తారు. దీనివల్ల నిరోధం తగ్గడమే కాకుండా మలినాలను వివిధ పరిమాణాల్లో కలిపిన ప్రాంతాల్లో సెమికండక్టర్ జంక్షన్లు ఏర్పడే అవకాశం ఉంది. ఈ జంక్షన్ల దగ్గర తారాడే చార్జ్ క్యారియర్ల ఆధారంగానే ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలైన డయోడ్లు, ట్రాన్సిస్టర్లు పనిచేస్తాయి.

అర్ధవాహకాలు ఒకవైపుతో పోలిస్తే మరో వైపునుండి నుంచే విద్యుత్తును బాగా ప్రసారం చేయడం, వివిధ స్థాయిల్లో నిరోధాన్ని కలిగిఉండటం, కాంతికి, ఉష్ణానికి ప్రతిస్పందించడం లాంటి అనేక ఉపయోగకర లక్షణాలు కలిగి ఉంటాయి. వీటి విద్యుత్ లక్షణాలను నియంత్రిత పద్ధతిలో చేర్చే మలినాల ద్వారా, వాటి చుట్టూ విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరచడం ద్వారా, కాంతిని ప్రసరింపచేయడం ద్వారా మార్చే వీలుండటం వల్ల వీటిని ఆంప్లిఫికేషన్, స్విచ్చింగ్,, శక్తిమార్పిడి కోసం విరివిగా వాడుతారు.

మూలాలు[మార్చు]

  1. Mehta, V. K. (2008-01-01). Principles of Electronics. S. Chand. p. 56. ISBN 9788121924504. Retrieved 6 December 2015.