అర్ధాంగి (1955 సినిమా)
అర్ధాంగి (1955 సినిమా) (1955 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి. పుల్లయ్య |
---|---|
నిర్మాణం | శాంతకుమారి, పి. పుల్లయ్య |
రచన | శరత్ చంద్ర ఛటర్జీ (నవల), ఆచార్య ఆత్రేయ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, కొంగర జగ్గయ్య, శాంతకుమారి, చదలవాడ, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి |
సంగీతం | భీమవరపు నరసింహారావు, అశ్వత్థామ |
నేపథ్య గానం | జిక్కి, శాంతకుమారి, ఘంటసాల |
నిర్మాణ సంస్థ | రాగిణి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అర్ధాంగి (స్వయంసిద్ధ కథ) 1955లో విడుదలైన తెలుగు సినిమా. ఇది ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర రచించిన స్వయంసిధ్ద నవల ఆధారంగా నిర్మితమైనది. కీలకమైన కథానాయిక పద్మ పాత్రను మహానటి సావిత్రి గొప్పగా పోషించగా; ఆమెకు మతిలేని భర్తగా అక్కినేని నాగేశ్వరరావు నటించాడు.
సంక్షిప్త చిత్రకథ
[మార్చు]ఒక ఊరిలో జమిందారు (గుమ్మడి), ఆయన రెండవ భార్య రాజేశ్వరి (శాంతకుమారి). అతనికి ఇద్దరు కొడుకులు. మొదటి భార్యకు పుట్టిన కొడుకు రాఘవేంద్రరావు (అక్కినేని) ఆలనా పాలనా లేక ఆయా పెంపకంలో నల్లమందు ప్రభావంతో అమాయకుడుగా పెరుగుతాడు. రెండవ భార్య సంతానమయిన నాగూ (జగ్గయ్య) విచ్చలవిడిగా ఖర్చుచేస్తూ వ్యసనపరుడవుతాడు. శిస్తు వసూలు కోసం వెళ్ళిన పొగరుబోతు నాగూకు తగిన విధంగా బుద్ధిచెబుతుంది, పల్లెటూరి పిల్ల పద్మ (సావిత్రి). జమిందారు ఆమెను ప్రశంసించి తన రెండో కోడలుగా చేసుకోవాలనుకుంటాడు. దీనిని వ్యతిరేకించిన రాజేశ్వరి "అంతగా మీకు ఇష్టమైతే మీ పెద్ద కొడుక్కిచ్చి చేసుకోడి. ఆ మతిలేనివాడికి ఈ గతిలేనిదానికి సరిపోతుంది" అని సలహా ఇస్తుంది. మాట తప్పని జమిందారు రఘుతో పద్మకు వివాహం జరిపిస్తాడు. పెళ్ళిపీటల మీదే తన భర్త వెర్రిబాగులవాడని తెలుసుకున్న పద్మ తరువాత ఆత్మ సంయమనంతో వ్యవహరిస్తుంది. తూలనాడిన మరిది నాగూకు బుద్ధి చెబుతుంది. మరోవైపు భర్తను ప్రయోజకునిగాను, సంస్కారవంతునిగాను తీర్చిదిద్దుతుంది. ఈ సంగతి గమనించిన జమిందారు తృప్తిగా కన్నుమూస్తాడు. వేశ్యాసాంగత్యంలో మునిగితేలుతున్న నాగూకు డబ్బు అవసరమై అన్నపై ధ్వజమెత్తుతాడు. చివరకు కన్నతల్లిపై చేయిచేసుకోవడనికి కూడా వెనుకాడడు. రఘు త్యాగబుద్ధితో ఆస్తిని వదులుకొంటాడు. నిజానిజాలు గ్రహించిన జమిందారిణి రాజేశ్వరి రఘు ఔదార్యాన్ని, నాగూ నిజస్వరూపాన్ని గ్రహించి కొడుక్కి బుద్ధి చెబుతుంది.
పాత్రలు-పాత్రధారులు
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు ... రఘు (రాఘవేంద్రరావు)
- సావిత్రి ... పద్మ
- గుమ్మడి వెంకటేశ్వరరావు ... జమిందారు
- శాంతకుమారి ... జమిందారు భార్య
- కొంగర జగ్గయ్య ... నాగు (నాగేంద్రరావు)
- రేలంగి వెంకట్రామయ్య
- చదలవాడ కుటుంబరావు
- శివరామకృష్ణయ్య
- కామరాజు
- దొరైస్వామి ... పద్మ తండ్రి
- సురభి బాలసరస్వతి ... ఆయమ్మ
- బి. నరసింహారావు
పాటలు
[మార్చు]ఈ సినిమాలో 9 పాటలను చిత్రీకరించారు. అన్ని పాటలను ఆచార్య ఆత్రేయ రచించారు.[1]
క్రమసంఖ్య | పాటలు | గాయకులు |
---|---|---|
1. | ఇంటికి దీపం ఇల్లాలే.. ఇల్లాలే సుఖాల పంటకు జీవం | ఘంటసాల |
2. | ఏడ్చేవాళ్ళని ఏడవని నవ్వే వాళ్ళ అదృష్టమేమని ఏడ్చేవాళ్ళని | పి. లీల బృందం |
3. | ఎక్కడమ్మా చంద్రుడు చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా | జిక్కి |
4. | తరలినావా త్యాగమూర్తి ధర్మానికి నీ తలవంచి తరలినావా | ఘంటసాల |
5. | పెళ్ళి మూహూర్తం కుదిరిందా పిల్లా నీ పొగరణిగిందా | |
6. | రాధను రమ్మన్నాడు రాసక్రీడకు మాధవ దేవుడు | ఆకుల నరసింహా రావు |
7. | రాక రాక వచ్చావు చందమామ లేక లేక నవ్వింది కలువభామ | జిక్కి |
8. | వద్దురా కన్నయ్యా ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా | జిక్కి |
9. | సిగ్గేస్తాదోయి బావా సిగ్గేస్తాది ఒగ్గలేను మొగ్గలేని మొగమెత్తి | పి. లీల |
బాక్సఫీసు
[మార్చు]ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కేంద్రాలలో (విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి) 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది.[2]
పురస్కారాలు
[మార్చు]- 3వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1955) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా - ప్రశంసా పత్రం[3]
మూలాలు
[మార్చు]- ↑ "అర్ధాంగి - 1955". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 5 March 2016.[permanent dead link]
- ↑ "ANR's 100 days films list at Idlebrain.com". Archived from the original on 2012-12-26. Retrieved 2016-03-05.
- ↑ "3rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 1 September 2011.
బయటి లింకులు
[మార్చు]- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- All articles with dead external links
- 1955 తెలుగు సినిమాలు
- అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు
- పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన సినిమాలు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు
- జగ్గయ్య నటించిన సినిమాలు
- సావిత్రి నటించిన సినిమాలు
- గుమ్మడి నటించిన సినిమాలు
- రేలంగి నటించిన సినిమాలు