అర్మానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Giorgio Armani S.p.A.
రకంPrivate
స్థాపితం1975
వ్యవస్థాపకు(లు)Giorgio Armani and Sergio Galeotti
ప్రధానకార్యాలయంఇటలీ Milan, Italy
సేవా ప్రాంతముWorldwide
కీలక వ్యక్తులుGiorgio Armani
పరిశ్రమFashion and Leisure
ఆదాయం$1.69bn (2005)
ఉద్యోగులు4,700
వెబ్‌సైటుwww.giorgioarmani.com

జార్జియో అర్మానీ S.P.A అనేది గృహోపకరణాలు, కాస్మటిక్స్, కళ్ళద్దాలు, అలంకరణ సామాగ్రి, రెడీమేడ్, ఉత్ కుతూర్, తోలు వస్తువులు, పాదరక్షలు, చేతి గడియారాలు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువుల రూపకల్పన, తయారీ, పంపిణీ మరియు రిటైల్ అమ్మకాలు నిర్వహించే ఒక అంతర్జాతీయ ఇటలీ ఫ్యాషన్ హౌస్. ఈ బ్రాండ్ తమ ఉత్పత్తులను జార్జియో అర్మానీ, అర్మానీ కొల్లీజియోనీ, ఎంపోరియో అర్మానీ, AJ | అర్మానీ జీన్స్, AX | అర్మానీ ఎక్స్ఛేంజ్, అర్మానీ జూనియర్ మరియు అర్మానీ/కాసా సహా పలు రకాల ఉప-లేబుళ్ల ద్వారా మార్కెట్లో విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఫ్యాషన్లు మరియు కోచర్‌కు అర్మానీ పర్యాయపదంగా మారింది. అంతేకాక ఫ్యాషన్ రంగంలో ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక బ్రాండ్‌గా పరిగణించబడింది. 2005 సంవత్సరం ముగింపు నాటికి దీని అమ్మకాలు $1.69 బిలియన్లు[1].

ఎమ్మార్ ప్రాపర్టీస్‌ సంస్థతో కలిసి మిలాన్, పారిస్, న్యూయార్క్, లండన్, టోక్యో, షాంఘై, మరియు దుబాయ్ వంటి నగరాల్లో లగ్జరీ హోటళ్లు మరియు రిసార్టుల వ్యాపారానికి అర్మానీ యోచిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కేఫ్‌ల శ్రేణితో పాటు బార్, రెస్టారెంట్ మరియు నైట్ క్లబ్బులను కూడా నిర్వహిస్తోంది.

ఉత్పత్తులు[మార్చు]

చికాగో లోని ఒక అర్మానీ ఫ్యాషన్ షాపు.

జార్జియో అర్మానీ[మార్చు]

జార్జియో అర్మానీ అనేది ప్రత్యేకించి, పురుషల మరియు మహిళల యొక్క రెడీమేడ్ దుస్తులు, అలంకరణవస్తువులు, కళ్ళద్దాలు, కాస్మటిక్స్ మరియు సుగంధద్రవ్యాలకు సంబంధించి ఒక ఖరీదైన లేబుల్‌గా పేరుగాంచింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దుస్తుల లేబుళ్లలో ఒకటి మరియు ఇది ఎంపికచేసిన ఖరీదైన డిపార్ట్‌మెంట్ స్టోర్లలో మాత్రమే లభిస్తుంది.

అర్మానీ కొల్లీజియోనీ[మార్చు]

అర్మానీ కొల్లీజియోనీ (గతంలో జార్జియో అర్మానీ లే కొల్లీజియోనీ ) అనేది మరో ఖరీదైన అర్మానీ ఉప-లేబుల్. ఈ వ్యాపారం (లైన్) ఎంపోరియో అర్మానీ, అర్మానీ జీన్స్, అర్మానీ ఎక్స్ఛేంజ్ కంటే అత్యంత ఖరీదైనది, అయితే ఖరీదైన మరియు రెడీమేడ్ వ్యాపారమైన జార్జియో అర్మానీ మరియు హాట్ కోచర్ వ్యాపారం అర్మానీ ప్రైవ్‌ కంటే తక్కువ ఖరీదైనది. ఫ్రీస్టాండింగ్ దుకాణాల్లో విక్రయించడంతో పాటు (ప్రత్యేకించి, కొల్లీజియోని విక్రయించబడుతుంది) హాల్ట్ రెన్ఫ్రూ, బ్లూమింగ్‌డాలేస్, డేవిడ్ జోన్స్, హార్వే నికోల్స్, హ్యరోడ్స్, నీమన్ మార్కస్, నార్డ్ స్ట్రోం మరియు సాక్స్ ఫిఫ్త్ ఎవెన్యు వంటి ఖరీదైన డిపార్టుమెంట్ స్టోర్లలోనూ అర్మానీ కొల్లీజియోనీ విక్రయించబడుతోంది.

ఎంపొరియో అర్మానీ[మార్చు]

ఎంపోరియో అర్మానీ స్టోర్, టోక్యో.

ఎంపొరియో అర్మానీ అనేది 20 మరియు 30 సంవత్సరముల మధ్య ఉన్న వయస్సు వారి కోసం తయారు చేసిన ఒక "సంపన్న" లేబుల్. ఈ లేబుల్ యొక్క విశిష్టతలు రెడీమేడ్స్ మరియు ఇతర వస్తువులు. ఎంపొరియో అర్మానీ అమెరికాలోని దాని 13 స్టోర్లలోనూ మరియు ప్రపంచవ్యాప్తంగా,[ఆధారం కోరబడింది] 140 స్టోర్స్‌లో మరియు బ్రాండ్ యొక్క వెబ్‌సైటులో లభిస్తుంది. జనవరి, 2010లో ప్రముఖ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరియు హాలీవుడ్ నటి మేగన్ ఫాక్స్లు ఎంపోరియా అర్మానీ యొక్క ప్రచారకర్తలుగా వ్యవహరించారు.

అర్మానీ జీన్స్[మార్చు]

అర్మానీ జీన్స్ అనేది నీలం రంగు వస్త్ర సంబంధిత దుస్తుల యొక్క బ్రిడ్జ్-లైన్ కలెక్షన్. ఇది 1981లో జార్జియో అర్మానీ ద్వారా రూపొందించబడింది. అర్మానీ జీన్స్ ప్రధానంగా డిపార్టుమెంట్ స్టోర్లలో అమ్ముడవుతున్నప్పటికీ, మిలాన్‌లో ఉన్న అర్మానీ జీన్స్ కేఫ్‌కు అదనంగా, ప్రపంచంలో మొత్తం 15 స్వతంత్ర (ఫ్రీస్టాండింగ్) అర్మానీ జీన్స్ స్టోర్లు ఉన్నాయి. కొన్ని అర్మానీ జీన్స్ వస్తువులు ఎంపోరియో అర్మానీ స్టోర్లలో అమ్ముడవుతున్నాయి. ఆసియా మార్కెట్‌లో ఎంపోరియో అర్మానీ వస్తువులను అర్మానీ జీన్స్ స్టోర్స్ విక్రయిస్తాయి.

డిజైన్ పరంగా, ఈ వ్యాపారానికి సంబంధించిన దుస్తులు జార్జియో అర్మానీ యొక్క సంతక సరళతను కలిగి ఉండవు. తరచూ అతని ఇతర కలెక్షన్ల దుస్తుల కంటే అతిపెద్ద లోగోలను కలిగి ఉంటాయి. అర్మానీ జీన్స్కి ఉపయోగించే రంగులు తన మిగిలిన ఖరీదైన లైన్లు లేదా అర్మానీ ఎక్స్చేంజ్ కంటే వైవిధ్యంగా ఉంటాయి. ఇది ఏకవర్ణ కాంతి రంగు అవుట్‌లైన్లను మరియు రంగుపై కంటే కత్తిరింపు మరియు వస్తువుపై దృష్టి సారిస్తుంది.

అర్మానీ ఎక్స్చేంజ్[మార్చు]

దస్త్రం:Armaniexchangelogo.JPG
అర్మానీ ఎక్స్చేంజ్

A|X అర్మానీ ఎక్స్చేంజ్ 1991లో యునైటెడ్ స్టేట్స్‌‍లో ప్రారంభించబడి. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లలో ఇది ఒకటి.[ఆధారం కోరబడింది] జార్జియో అర్మానీ రూపొందించిన లేబుల్ రెచ్చగొట్టడం మరియు ఉద్యమాలకు పెట్టిందిపేరుగా మరియు యువ హాలీవుడ్ పాప్ సంస్కృతిలో ఆదరణ పొందింది. అర్మానీ ఎక్స్చేంజ్ దుస్తులు, అలంకరణ వస్తువులు, కళ్ళద్దాలు, వాచీలు, జుయలరీ మరియు సంగీత వస్తువులు వంటి ఫ్యాషన్ మరియు లైఫ్ స్టైల్ ఉత్పత్తుల రూపకల్పన, తయారీ, పంపిణీ మరియు రిటైల్ వ్యాపారం చేస్తుంది. ఇది స్ట్రీట్ చిక్ సంస్కృతి మరియు ఫ్యాషన్ నృత్య సంగీతం ద్వారా ప్రభావితమైంది. ఎక్కువగా లభించే అర్మానీ బ్రాండుగా పరిగణించబడిన అర్మానీ ఎక్స్చేంజ్ సాదారణ మార్కెట్‌లో సమంజసమైన ధరకే లభిస్తున్నట్లు భావించబడుతోంది. దీని ధర సగటున $100 కంటే తక్కువగా ఉంటుంది.

అర్మానీ ఎక్స్చేంజ్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 178 స్టోర్లలో మరియు బ్రాండ్ యొక్క వెబ్‌సైటులో మాత్రమే లభిస్తాయి.[2]

అర్మానీ జూనియర్[మార్చు]

అర్మానీ పిల్లల లేబుల్, అర్మానీ జూనియర్ ప్రపంచవ్యాప్తంగా 15 ఫ్యాషన్ షాపులలో మరియు ఎంపిక చేసిన న్యూమాన్ మార్కస్ మరియు సాక్స్ ఫిఫ్త్ ఎవెన్యు డిపార్టుమెంట్ స్టోర్లలో మాత్రమే లభిస్తుంది.

అర్మానీ/కాసా[మార్చు]

అర్మానీ/కాసా (ఇటాలీ భాషలో అర్మానీ హోమ్) అనేది అర్మానీ రూపొందించిన ఖరీదైన గృహోపకరణాలు. ఫర్మిచర్, ల్యాంపులు, వస్త్రాలు మరియు డైనింగ్ ఉత్పత్తులు ఇక్కడ లభిస్తాయి. అర్మానీ/కాసా ప్రపంచవ్యాప్తంగా 40 ఫ్యాషన్ షాపులలోనూ మరియు ముఖ్యమైన నీమన్ మార్కస్ స్టోర్లలోనూ లభిస్తుంది.

ఇతర పెట్టుబడులు[మార్చు]

అర్మానీ ప్రైవ్[మార్చు]

అర్మానీ హాట్ కోచర్ దుస్తుల వ్యాపారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన తొలి హాట్ కోచర్ ప్యారిస్ ఫ్యాషన్ షోగా చరిత్ర సృష్టించింది. ఈ లేబుల్ ప్రత్యేకంగా, ధరించడానికి మరియు ఆర్డర్ ద్వారా మాత్రమే తయారు చేయబడుతుంది.

అర్మానీ కాస్మటిక్స్[మార్చు]

కాస్మటిక్స్, స్కిన్ కేర్ మరియు పర్ఫ్యూమ్స్ అర్మానీ యొక్క బ్యూటీ బ్రాండ్స్. ఈ ఉత్పత్తులన్నీ కూడా అర్మానీతో చాలా కాలం భాగస్వామ్య ఒప్పందం గల లోరియల్ లగ్జరీ ద్వారా తయారుచేయబడి పంపిణీ చేయబడ్డాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా డిపార్టుమెంట్ స్టోర్స్ లలో మరియు కొన్ని చిన్న ఫ్యాషన్ షాపులలో లభిస్తుంది. అర్మానీ ఆహార పరిశ్రమలో కూడా తన పెట్టుబడులు పెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా తనకు 14 ఎంపోరియో అర్మానీ మరియు అర్మానీ జీన్స్ కేఫ్స్ ఉన్నాయి. దీనితో పాటుగా అతనికి హాంకాంగ్ లో అర్మానీ బార్ మరియు ప్రపంచవ్యాప్తంగా నోబు & ప్రైవ్ అనే రెండు కొత్త రెస్టారెంట్లు ఉన్నాయి. అర్మానీ పేరుతో ఉన్న బుక్ షాపు (అర్మానీ లైబ్రి ) మరియు ఫ్లోరిస్ట్ (అర్మానీ ఫ్లోరి) మరియు అర్మానీ దాల్సి అనే ఒక మిఠాయి కంపెనీ కూడా ఉంది. ఇలాంటి చిన్న బ్రాండ్స్ మిలాన్ ఫ్లాగ్ షిప్,31 వయా మంజోని, మరియు అర్మానీ/ చాటార్ హౌస్ వద్ద 11 చాటార్ రోడ్, సెంట్రల్, హాంగ్ కాంగ్ లాంటి పెద్ద అర్మానీ షాపులలో అమ్ముడవుతాయి. ఇతను ప్రసిద్ధిచెందిన ఇటలీ సౌండ్ డిజైనర్ మాటోసేకారిని ద్వారా ఎంపోరియో అర్మానీ కేఫ్ అనే 4 లక్కీ సీడీ లను కూడా రూపొందించాడు.

అర్మానీ హోటళ్లు మరయు రిసార్టులు[మార్చు]

2004లో ఎమ్మార్ హోటల్స్ అర్మానీ మరియు ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థలు అర్మానీ పేరు మీద కొరకు కనీసం ఏడు లగ్జరీ హోటళ్లు మరియు మూడు వినోద రిసార్ట్స్‌ను నిర్మించి, నడిపించడం ఈ ఒప్పందం యొక్క సారాంశం. ఆ హోటళ్ల యొక్క అంతర్గత రూపకల్పన మరియు శైలి వంటి అన్ని అంశాల పర్యవేక్షణ బాధ్యతను అర్మానీ తీసుకుంటుంది. ఈ హోటళ్లలో ఒకటి దుబాయ్‌లో ఉంది.[3]

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా స్కై స్క్రీపర్ యొక్క దిగువ భాగంలోని 39 అంతస్తులలో 160 అతిథి గృహాలు, గదుల శ్రేణి మరియు 144 [4] నివాసాలు కలిగి ఉన్న ప్రపంచ తొలి అర్మానీ హోటల్ ఉంది.[4] అర్మానీ రెసిడెన్సెస్ మరియు స్కై స్క్రాపర్ కొరకు గృహ అలంకరణలను రూపొందించడమే గాక [4] అర్మానీ/కాసా ఫర్నీచర్ కలక్షన్స్ ఉత్పత్తులకు రూపకల్పన చేసాడు.

బుర్జ్ ఖలీఫా అర్మానీ రెసిడెన్సెస్ రోడ్ షో మిలాన్, లండన్, జెద్ద, మాస్కో మరియు ఢిల్లీ నగరాలను పర్యటించింది. ఈ ప్రదర్శన[5]ను రూపొందించిన బ్రాష్ బ్రాండ్స్ దాని యొక్క గుర్తులు, ప్రదర్శనలు మరియు పాయింట్ ఆఫ్ పర్చేజ్ (POP) ప్రదర్శనల ద్వారా ఇంటర్నేషనల్ డిజైన్ అవార్డును గెలుచుకుంది.[6] న్యూ బాండ్ స్ట్రీట్‌లోని అర్మానీ కాసా షోరూంలో లండన్ ఈవెంట్ జరిగింది.[7]

2010 ఏప్రిల్ 27న బుర్జ్ ఖలీఫాలో అర్మానీ హోటల్ ప్రారంభించబడింది.[8]

జూలు వివాదం[మార్చు]

2007 జూలైలో జార్జియో అర్మానీ టైమ్ మేగజైన్‌కి ఈ విధంగా తెలిపాడు, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్ (PETA) వస్తువులను చూసిన తర్వాత "బొచ్చుగల చర్మాన్ని వాడరాదని నన్ను నేను సముదాయించుకున్నాను."[9] ఏమైనా PETA ప్రకారం, అర్మానీ యొక్క Fall 2008 కలెక్షన్‌ కింద పిల్లల ఫర్ కోట్లు, ఫ్లోరల్ ప్రింటెడ్ ఫర్స్, ఫర్-హెమ్మ్డ్ స్కర్ట్స్ మరియు ఫర్-ట్రిమ్డ్ జాకెట్లు అందుబాటులోకి వచ్చాయి.[10]

ఇది కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

మరింత చదవడానికి[మార్చు]

  • Mackenzie, Suzie (2004-12-11). "The gentle touch". The Guardian. Retrieved 2007-09-23.
  • McCartney, Stella (2006-05-16). "The wisdom of King Giorgio". Independent on Sunday. Retrieved 2007-09-23.
  • "Q & A: Giorgio Armani". The Scene. CNN. 2006-10-03. Retrieved 2007-09-23.
  • Lee, Vinny (2007-09-22). "Above the shop". The Times. London. Retrieved 2007-09-23.

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అర్మానీ&oldid=2422557" నుండి వెలికితీశారు