అర్షద్ అయూబ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

1958లో ఆంధ్ర ప్రదేశ్ లోని హైదరాబాదులో జన్మించిన అర్షద్ అయూబ్ (Arshad Ayub) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అయూబ్ 1987 నుంచి 1990 వరకు 13 టెస్టులలో మరియు 32 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

అర్షద్ అయూబ్ 13 టెస్టులు ఆడి 17.13 సగటుతో 257 పరుగులు సాధించాడు. అందులో ఒక అర్థసెంచరీ ఉంది. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 57 పరుగులు. బౌలింగ్‌లో 35.07 సగటుతో 41 వికెట్లు సాధించాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 3 సార్లు సాధించాడు. టెస్టులలోఆతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 50 పరుగులకు 5 వికెట్లు.

వన్డే క్రికెట్ గణాంకాలు[మార్చు]

అయూబ్ 32 వన్డేలు ఆడి 11.59 సగటుతో 116 పరుగులు చేశాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 31 నాటౌట్. వన్డేలలో 39.22 సగటుతో 31 వికెట్లు సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 21 పరుగులకు 5 వికెట్లు.