ఆలీసాగర్

వికీపీడియా నుండి
(అలీసాగర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అలీసాగర్ నిజామాబాదు జిల్లాలోని ఒక పర్యాటక కేంద్రము. ఇది థనకలాన్ గ్రామములో ఉంది. దీన్ని నిజాం ప్రభువుల పరిపాలనలో ఏర్పాటు చేశారు. అలీసాగర్ నిజామాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరములో నిజామాబాదు - బాసర రోడ్డుకి 2 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ మానవ నిర్మిత జలాశయము 1930లొ కట్టబడింది. నగర జీవితము యొక్క హడావిడికి దూరముగా ఈ జలాశయము ప్రశాంత వాతావరణము కల్పిస్తుంది. వన్య ప్రాంతముతో పాటు కల వేసవి విడిది, చక్కగా తీర్చిదిద్దిన ఉద్యానవనాలు, ఒక దీవి, కొండపైనున్న అతిధిగృహము దీనిని పర్యాటకులకు ఒక ముఖ్య గమ్యస్థానముగా చేస్తున్నాయి. వీటితో పాటు జింకల పార్కు, ట్రెక్కింగ్, జలక్రీడలకు సదుపాయాలు ఉండటము అదనపు ఆకర్షణ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఆలీసాగర్&oldid=2950720" నుండి వెలికితీశారు