అలీ మహమ్మద్ ఖాన్
| నవాబ్ అలీ మహమ్మద్ ఖాన్ బహదూర్ రోహిల్లా | |||||
|---|---|---|---|---|---|
| కతేహిర్ నవాబ్ బదౌన్ నవాబ్ రాంపూర్ నవాబ్ బరేలీ నవాబ్ మొరాదాబాద్ నవాబ్ అఓన్లా నవాబ్ బరేచ్ తెగ సర్దార్ రోహిల్లాల నాయకుడు | |||||
| రోహిల్‌ఖండ్ | |||||
| పరిపాలన | 1721–1748 | ||||
| పూర్వాధికారి | సర్దార్ దావూద్ ఖాన్ రోహిల్లా | ||||
| ఉత్తరాధికారి | నవాబ్ అబ్దుల్లా ఖాన్ బహదూర్ రోహిల్లా | ||||
| బదౌన్ | |||||
| పరిపాలన | 1721–1748 | ||||
| పూర్వ వ్యక్తి | సర్దార్ దావూద్ ఖాన్ రోహిల్లా | ||||
| తర్యాత వచ్చిన వ్యక్తి | నవాబ్ అబ్దుల్లా ఖాన్ బహదూర్ రోహిల్లా | ||||
| రాంపూర్ | |||||
| Reign | 1741–1748 | ||||
| Predecessor | కతేహర్‌కు చెందిన రాజా రామ్ సింగ్ | ||||
| Successor | నవాబ్ ఫైజుల్లా ఖాన్ బహదూర్ రోహిల్లా | ||||
| బరేలీ | |||||
| Reign | 1741–1748 | ||||
| Predecessor | నవాబ్ అబ్ద్ ఉన్ నబీ ఖాన్ | ||||
| Successor | నవాబ్ ముహమ్మద్ యార్ ఖాన్ బహదూర్ రోహిల్లా | ||||
| మొరాదాబాద్ | |||||
| Reign | 1741–1748 | ||||
| Predecessor | రాజా హర్నంద్ | ||||
| Successor | నవాబ్ సాదుల్లా ఖాన్ బహదూర్ రోహిల్లా | ||||
| అఓన్లా | |||||
| Reign | 1721–1748 | ||||
| Successor | నవాబ్ అబ్దుల్లా ఖాన్ బహదూర్ రోహిల్లా | ||||
| జననం | ప్రేమ్ సింగ్[1] 1707 జాన్‌సత్ | ||||
| మరణం | 15 సెప్టెంబర్ 1748 అఓన్లా | ||||
| Burial | |||||
| |||||
| రాజ్యం | రోహిల్లా (నైన్/నానో జాట్‌ల నుండి దత్తత ద్వారా)[2] | ||||
| మతం | సున్నీ ఇస్లాం | ||||
| Occupation | సర్హింద్, రోహిల్‌ఖండ్ల సుబేదార్ | ||||
అలీ మహమ్మద్ ఖాన్ (సుమారు 1707 - 15 సెప్టెంబర్ 1748), పుట్టుకతో వచ్చిన పేరు ప్రేమ్ సింగ్ నైన్,[1][2] ఇతను రోహిల్‌ఖండ్ రాజ్య వ్యవస్థాపకుడు, రోహిల్లా రాజవంశ మూలపురుషుడు. పద్నాలుగేళ్ల వయసులో అతను తన పెంపుడు తండ్రి దావూద్ ఖాన్ బరేచ్ తర్వాత రోహిల్లాల నాయకుడయ్యాడు. ప్రజల పట్ల నిరంకుశంగా లేని పాలకుడిగా సాధారణంగా అతన్ని పరిగణిస్తారు.[3] మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా ద్వారా అతనికి భారతదేశపు అత్యున్నత సైనిక చిహ్నమైన మషీర్‌ను ఉపయోగించుకునే హక్కు లభించింది.
అతను చిన్న వయస్సులోనే మరణించడంతో, మరణశయ్యపై ఉన్న అలీ మహమ్మద్ వీలునామాను అమలు చేస్తానని ఖురాన్పై చేసిన గట్టి ప్రమాణానికి విరుద్ధంగా, హఫీజ్ రెహ్మత్ ఖాన్ సంరక్షక పాలకుడు (Regent) గా అధికారంలోకి రావడం జరిగింది.[మూలం అవసరం]
ప్రారంభ జీవితం
[మార్చు]అలీ మహమ్మద్ ఖాన్ అసలు పేరు ప్రేమ్ సింగ్ నైన్,[1][2] సుమారు 1707లో ఒక జాట్ కుటుంబంలో జన్మించాడు.[4][note 1] చిన్నతనంలో, ప్రత్యర్థి జమీందారులతో జరిగిన ఒక వివాదంలో బరేచ్ నాయకుడు దావూద్ ఖాన్ బరేచ్ ఇతనిని బంధించాడు. ఆ బాలుడి పట్ల ఆకర్షితుడైన దావూద్ అతనిని దత్తత తీసుకుని, ఇస్లాం మతంలోకి మార్చి, అతనికి కొత్త పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.[8]
ఇన్రదుస్ సాదత్ ప్రకారం, అలీ భారతదేశంలో ఉన్న ఇతర ఆధ్యాత్మిక వర్గాల కంటే కూడా స్వచ్ఛమైన ఇస్లాంకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా భావించే ఖాదిరి సూఫీ వర్గానికి చెందిన హనాఫీ ముస్లిం.[9]
పాలన
[మార్చు]అతను దావూద్ ఖాన్ తర్వాత అధికారంలోకి వచ్చి రోహిల్‌ఖండ్‌ను ఒక శక్తివంతమైన దేశంగా అభివృద్ధి చేశాడు, అది 1721లో స్వతంత్ర దేశంగా అవతరించింది. మొఘల్ గవర్నర్ మర్హమత్ ఖాన్‌ను, అతని అనుచరులందరినీ చంపిన సైఫుద్దీన్ బర్హా నేతృత్వంలోని బారా సయ్యద్‌ల తిరుగుబాటును అణచివేయడంలో సహాయపడటం ద్వారా అలీ ముహమ్మద్ ఖాన్ గుర్తింపు పొందాడు.[10] బహుమతిగా 1737లో ముహమ్మద్ షా ద్వారా అలీ ముహమ్మద్ ఖాన్‌కు నవాబ్ బిరుదు ఇవ్వబడింది. 1746లో, కలప సేకరణపై సఫ్దర్ జంగ్ నిర్మాణ కార్మికులకు, అలీ ముహమ్మద్ ఖాన్ అటవీ రక్షకులకు మధ్య జరిగిన ఘర్షణ కారణంగా, అతనిని అంతం చేయాలని సఫ్దర్ జంగ్ నిర్ణయించుకున్నాడు.[11] అలీ మహమ్మద్ ఖాన్ తన సొంతం సుల్తానేట్‌ను స్థాపించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడని అవధ్ నవాబు సఫ్దర్ జంగ్, కమరుద్దీన్ ఖాన్[11] ద్వారా భారతదేశ మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షాకు (పాలన. 1719–1748)[12] తెలియజేశాడు. మొహమ్మద్ షా అతనిపై దండయాత్రకు సైన్యాన్ని పంపాడు, దీని ఫలితంగా ముహమ్మద్ ఖాన్ బంధించబడ్డాడు. ఆ తర్వాత అతన్ని క్షమించి సర్హింద్ గవర్నర్‌గా నియమించారు.[11] ఇరాన్ విజేత నాదిర్ షా 1739లో కాబూల్ను ఆక్రమించుకుని, ఢిల్లీని దోచుకున్న తరువాత, అలీ ముహమ్మద్ ఖాన్ తన మాతృభూమికి తిరిగి వచ్చి 1748లో మరణించే వరకు స్వతంత్ర రోహిల్‌ఖండ్ రాజ్యాన్ని పరిపాలించాడు.[మూలం అవసరం]
ఫైజుల్లా ఖాన్ అలీ ముహమ్మద్ ఖాన్ రెండవ కుమారుడు. నవాబ్ సైదుల్లా ఖాన్ తరువాత అతను రోహిల్లాల పాలనను స్వీకరించాడు.[మూలం అవసరం]
వారసులు
[మార్చు]19వ శతాబ్దంలో, అలీ వారసులు, ముఖ్యంగా రాంపూర్ నవాబులు, అతను బార్హా సయ్యద్ అని చెప్పుకుంటూ సయ్యద్ అనే బిరుదును ఉపయోగించడం ప్రారంభించారు. అయితే, వారు ఈ వాదనకు మద్దతుగా ఎటువంటి వంశవృక్షాన్ని లేదా చెల్లుబాటు అయ్యే చారిత్రక రుజువును సమర్పించలేకపోయారు.[6] నవాబులు అలీ నుండి పూర్వీకతను స్థాపించడానికి రాంపూర్‌కు చెందిన ప్రముఖ మౌల్వి నజ్ముల్ ఘనీని కూడా నియమించుకున్నారు, కానీ ఇది సాధారణంగా తిరస్కరించబడింది.[13]
అతని పిల్లల జాబితా ఈ క్రింది విధంగా ఉంది:
- నవాబ్ అబ్దుల్లా ఖాన్, అతని భార్య మర్ఘలరి బేగం (మాత్నీ తెగకు చెందినది) ద్వారా మొదటి కుమారుడు.
- నవాబ్ ఫైజుల్లా ఖాన్, అతని భార్య మర్ఘలరి బేగం ద్వారా రెండవ కుమారుడు, ఇతను తరువాత రాంపూర్ సంస్థానాన్ని స్థాపించాడు.
- నవాబ్ సాదుల్లా ఖాన్, అతని భార్య సారా బేగం (బునేర్వాల్‌కు చెందినది) ద్వారా కుమారుడు.
- నవాబ్ ముహమ్మద్ యార్ ఖాన్, అతని భార్య లాడో బేగం ద్వారా కుమారుడు.
- నవాబ్ అలాహ్-యార్ ఖాన్, అతని భార్య రాజ్ బేగం ద్వారా కుమారుడు - అతని తమ్ముడు ముర్తాజా మరణించిన సమయంలోనే ఇతను క్షయవ్యాధితో మరణించాడు.
- ముర్తాజా ఖాన్, కుమారుడు - హఫీజ్ రెహ్మత్ ఖాన్ అన్యాయమైన ప్రవర్తనతో విసిగిపోయి, సికింద్రాబాద్‌కు వెళ్లిపోయాడు, అక్కడే మరణించాడు.
- షా బేగం, కుమార్తె, భార్య మర్ఘలరి బేగం ద్వారా జన్మించింది (హఫీజ్ రెహ్మత్ ఖాన్ కుమారుడు ఇనాయత్ ఖాన్ భార్య).
- నియాజ్ బేగం, కుమార్తె [, హఫీజ్ రెహ్మత్ ఖాన్ సోదరుడైన షా ముహమ్మద్ ఖాన్ భార్య],
- మసూమ్ బేగం, కుమార్తె, [జబితా ఖాన్ భార్య]
- ఇనాయత్ బేగం, కుమార్తె, [బహదూర్ ఖాన్ కమల్ జాయ్ భార్య]
- ఒక కుమార్తె, పేరు తెలియదు, బాల్యంలోనే మరణించింది, కమరుద్దీన్ ఖాన్ కుమారుడితో నిశ్చితార్థం జరిగింది.[14]
ఇవి కూడా చూడండి
[మార్చు]గమనికలు
[మార్చు]- ↑ అబ్దుర్ రషీద్ ప్రకారం, మిగతా మూలాలన్నీ అతనిని జాట్‌గా వర్ణించగా, ఒక మూలం మాత్రం అతను అహిర్ అని పేర్కొంది.[5] జోస్ జె. ఎల్. గోమన్స్ కూడా నాటి మూలాలలో అతను ఎక్కువగా జాట్ లేదా అహిర్‌గా వర్ణించబడ్డాడని పేర్కొన్నాడు.[6] ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ, "అలీ ముహమ్మద్ ఖాన్ ఆఫ్ఘన్ కాదన్న విషయం అందరూ అంగీకరిస్తారు. అతను ఒక సయ్యద్ అనడం బహుశా అనుమానాస్పదమే; అతను ఒక జాట్, లేదా ఏదైనా ఇతర స్థానిక రైతు కులానికి చెందినవాడై ఉండొచ్చన్న వాదన ఎక్కువగా నమ్మదగినది" అని అన్నారు.[7]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Khoja, Neelam. 2018. Sovereignty, Space, and Identity: The Politics of Power in Eighteenth Century Punjab. Doctoral dissertation, Harvard University, Graduate School of Arts & Sciences.
- ↑ 2.0 2.1 2.2 Journal of the Pakistan Historical Society Volume 42. Pakistan Historical Society. 1994. p. 24.
Among the captives was one handsome Jat boy by the name of Prem Singh Nano. Da'ud Khan was so attracted towards him that he adopted him as his son, initiated him into the Islamic belief, and named him Ali Muhammad Nano. Later, when the boy reached adulthood, Daud Khan declared him as his successor. Thus began the pedigree of the Nawwabs of Rampur.
- ↑ Strachley, Sir John. Hastings and the Rohilla. p. 14.
- ↑ మూస:Bulleted
- ↑ Rashid, Abdur (1978). History of the Muslims of Indo-Pakistan Sub-continent, 1707-1806. Vol. 1. Pakistan Research Society. p. 297.
According to the Siyar-ul-Mutakhkhirin⁸ Ali Muhammad Khan was an Ahir by birth. According to others he was of Jat parentage.
- ↑ 6.0 6.1 Gommans, Jos J. L. (1995). The Rise of the Indo-Afghan Empire: C. 1710-1780 (in ఇంగ్లీష్). BRILL. p. 120. ISBN 978-90-04-10109-8.
Most of the contemporary sources, however, call him a Jat or an Ahir.
- ↑ Husain, Iqbal (1994). The Ruhela Chieftaincies: The Rise and Fall of Ruhela Power in India in the Eighteenth Century. Oxford University Press. p. 41. ISBN 978-0-19-563068-8.
- ↑ Irvine, W. (1971). Later Mughal. Atlantic Publishers & Distri. p. 118. Retrieved 2022-07-30.
Once Daud was sent against the village of Bankauli, in pargana Chaumahla, with which his employer was at feud. Along with the plunder taken on this occasion Daud obtained possession of a Jat boy seven or eight years of age, whom he caused to be circumcised and then adopted under the name of Ali Muhammad Khan.
- ↑ Altaf Ali Brelvi (1966). Life of Hafiz Rahmat Khan (Hayat-I-Hafiz Rahmat Khan). Academy of Educational Research, All Pakistan Education Conference.
- ↑ Edwin Thomas Atkinson (1876). Statistical, Descriptive and Historical Account of the North-Western Provinces of India: 3.:Meerut division part 2 · Volume 3. National Central Library of Florence. p. 605.
- ↑ 11.0 11.1 11.2 Khan, Muhammad Najm-ul-Ghani (1918). Akhbar-us-Sanadeed, vol. 1. Lucknow: Munshi Nawal Kishore. pp. 146–152.
- ↑ ముహమ్మద్ షా (1702–1748) 1719, 1748 మధ్య భారతదేశ మొఘల్ చక్రవర్తి
- ↑ Srivastava, Ashirbadi Lal (1954). The First Two Nawabs of Oudh (2nd rev. ed.). Shiva Lal Agarwala & Co. Ltd. p. 103. OCLC 678892685.
Contemporary Persian authorities say that Ali Muhammad Khan was of Jat parents. See Gulistan. 7; Abdulkarim, 88b, Ashob, 424; Siyar. II 480, A partisan attempt has, however, been made in modern times to prove that he was a Sayyid. Najmul Ghanl of Rampur has invented a false pedigree of the Khan, tracing it to Muhammad. The Maulvi's discussion is altogether unconvincing and ridiculous. His object seems to be to prove that the present ruler of Rampur is a Sayyid.
- ↑ Khan, Mohammad Najm-ul-Ghani Khan (1918). Akhbar-us-Sanadeed, vol. 1. Lucknow: Munshi Nawal Kishore. pp. 195–196.