అలోకానంద రాయ్,బెంగాలీ నాటకరంగ, సినిమా నటి. 1951లో ఏడేళ్ళ వయసులో నాటకరంగంలోకి వచ్చి, తర్వాత అనేక బెంగాలీ నాటకాల్లో నటించింది. 1962లో సత్యజిత్ రే రూపొందించిన కాంచన్‌జంఘా సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1] 1988లో బుద్ధదేబ్ దాస్‌గుప్తా తీసిన ఫేరా అనే బెంగాలీ సినిమాలో నటించిన అలోకానందకు బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ నుండి ఉత్తమ నటి అవార్డును అందుకుంది.[1]పరోమితార్ ఏక్ దిన్, ఉత్సబ్, ప్రోహోర్,నేతాజీ సుభాస్ చంద్రబోస్: ది ఫర్గాటెన్ హీరో వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న సినిమాలలో నటించింది.[2]
1962లో సత్యజిత్ రే దర్శకత్వంలో వ్చిన కంచెన్జంఘా సినిమాలో మనీషా పాత్రను షర్మిలా ఠాగూర్ తిరస్కరించినపుడు, ఆ పాత్రను పోషించడానికి అలోకానంద రాయ్‌ను తీసుకున్నాడు.[3] ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు.[3]
1978లో, శేఖర్ ఛటర్జీ దర్శకత్వం వహించిన ఆచార్య బెంగాలీ నాటకంతో మళ్ళీ నాటకరంగానికి తిరిగి వచ్చింది. సౌమిత్ర ఛటర్జీ దర్శకత్వం వహించిన హోమపాఖి బెంగాలీ నాటకంలో దాదాపు పదేళ్ళపాటు అతని పక్కన నటించింది.[4]రితుపర్ణో ఘోష్ తీసిన తహర్ నమతి రంజన అనే బెంగాలీ థ్రిల్లర్ టివి సిరీస్ లో రంగపిషిమాగా నటించింది.[5] ఘోష్ ఆకస్మికంగా మరణించిన తరువాత, మొదటి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత సిరీస్ ఎప్పుడూ కొనసాగించబడలేదు.[6]