Jump to content

అల్యూమినియం ఆంటిమొనైడ్

వికీపీడియా నుండి
అల్యూమినియం ఆంటిమొనైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [25152-52-7]
పబ్ కెమ్ 91307
యూరోపియన్ కమిషన్ సంఖ్య 246-667-3
SMILES [Al]#[Sb]
ధర్మములు
AlSb
మోలార్ ద్రవ్యరాశి 148.742 g/mol
స్వరూపం black crystals
సాంద్రత 4.26 g/cm3
ద్రవీభవన స్థానం 1,060 °C (1,940 °F; 1,330 K)
బాష్పీభవన స్థానం 2,467 °C (4,473 °F; 2,740 K)
insoluble
Band gap 1.58 eV
వక్రీభవన గుణకం (nD) 3.3
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Zinc blende
T2d-F-43m
కోఆర్డినేషన్ జ్యామితి
Tetrahedral
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-50.4 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
65 J/mol K
ప్రమాదాలు
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
317 °C (603 °F; 590 K)
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అల్యూమినియం అంటిమొనైడ్ ఒక రసాయన సంయోగపదార్ధం. ఇది ఒక అకర్బన రసాయన సంయోగపదార్ధం. ఇది ఆవర్తన పట్టికలోని సమూహం/గ్రూప్ మూడు-ఐదు కుటుంబానికి చెందిన అల్యూమినియం-ఆంటిమొనిమూలకాల సంయోగము వలన ఏర్పడిన రసాయనపదార్థం. అల్యూమినియం ఆంటిమొనైడ్ ఒక అర్దవాహకం (semiconductor).

భౌతిక ధర్మాలు

[మార్చు]

అల్యూమినియం ఆంటిమొనైడ్ నల్లని స్పటికములుగా ఘనరూపంలో ఉండును. అల్యూమినియం ఆంటిమొనైడ్ అణుభారం 148.742 గ్రాములు/మోల్[1].25 °C వద్ద అల్యూమినియం ఆంటిమొనైడ్ సంయోగపదార్ధం సాంద్రత 4.26 గ్రాములు/సెం.మీ3.అల్యూమినియం ఆంటిమొనైడ్ సమ్మేళనపదార్ధం ద్రవీభవన స్థానం 1,060 °C (1,940 °F;1,330K)., అల్యూమినియం ఆంటిమొనైడ్ బాష్పీభవన స్థానం 2,467 °C (4,473 °F;2,740 K).[2] ఈ రసాయనపదార్ధం నీటిలో కరుగదు. అల్యూమినియం ఆంటిమొనైడ్ స్వయం దహనఉష్ణోగ్రత (Autoignition temperature) 317 °C (603 °F; 590K)

అణు సౌష్టవం

[మార్చు]

అల్యూమినియం ఆంటిమొనైడ్ అణువు అల్లిక స్థిరాంకం (lattice constant) 0.61 nm.అణువులో పరమాణువుల అప్రత్యక్ష బంధఖాళి 300K (27 °C) వద్ద సుమారుగా 1.6 eV.ప్రత్యక్ష బంధఖాళి 2.22 eV.అల్యూమినియం ఆంటిమొనైడ్ అణువుయొక్క ఎలక్ట్రాన్ మొబిలిటి 200 cm²V−1s−1., హోల్ మొబిలిటి 300K (27 °C) వద్ద 400 cm²•V−1•s−1.అల్యూమినియం ఆంటిమొనైడ్ వక్రీభవన సూచిక, 2 µm తరంగ దైర్ఘ్యంవద్ద 3.3. మైక్రోవేవ్ ఫ్రిక్వేన్సిసిస్ వద్ద అల్యూమినియం ఆంటిమొనైడ్ డైఎలెక్ట్రిక్ స్థిరాంకం 10.9[1].అణువు సమన్వయచతుర్భుజ సౌష్టవాన్ని కల్గిఉన్నది.

రసాయన చర్యలు

[మార్చు]

అల్యూమినియం ఆంటిమొనైడ్ ఇతరగ్రూప్ III-V పదార్థాలతో రసాయనచర్య వలన త్రికరసాయన పదార్థాలను ఏర్పరచును. ఉదాహరణకు AlInSb, AlGaSb,AlAsSb. అల్యూమినియం ఆంటిమొనైడ్ లోని అంటిమొనైడు క్షయికరణలక్షణం వలన అల్యూమినియం ఆంటిమొనైడ్ మండేలక్షణము కల్గిఉన్నది.అల్యూమినియం అంటి మొనైడ్ను మండించి నపుడు అల్యూమినియం ఆక్సైడ్, అంటిమొని ట్రైఆక్సైడ్ ఏర్పడును.

వినియోగం

[మార్చు]

అల్యూమినియం ఆంటిమొనైడ్ ఒక అర్దవాహకం.దీనిని ఎలక్ట్రో ఆప్టికల్ ఉపకరణాలలో ఉపయోగిస్తారు., ఎక్సు-కిరణాల, గామాకిరణాలను గుర్తించుటకు ఉపయోగిస్తారు.[1]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Aluminium Antimonide (AlSb) Semiconductors". azom.com. Retrieved 2015-10-11.
  2. "Aluminum Antimonide". americanelements.com. Retrieved 2015-10-11.