Jump to content

సుధామ

వికీపీడియా నుండి
(అల్లంరాజు వెంకటరావు నుండి దారిమార్పు చెందింది)
సుధామ
సుధామ
జననంఅల్లంరాజు వెంకటరావు
(1951-11-25) 1951 నవంబరు 25 (వయసు 73)
India అనకాపల్లి ,విశాఖపట్టణం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
నివాస ప్రాంతంE.107,రాజపుష్ప అట్రియా ,గోల్డేన్ మైల్ రోడ్ ,కోకాపేట ,హైదరాబాద్.500075 (TS)
వృత్తిప్రోగామ్‌ ఎక్జిక్యూటివ్ (ఆల్ ఇండియా రేడియో)
కవి,కార్టూనిస్టు ,రచయిత,ప్రసార ప్రముఖుడు, సాహితీవేత్త
ప్రసిద్ధిసుధామ
మతంహిందూ
భార్య / భర్తఉషారాణి
పిల్లలుఅల్లంరాజు స్నేహిత్ ,

కోడలు: అల్లంరాజు(దువ్వూరి) లక్ష్మీ స్రవంతి

మనుమడు :చి.ఆథర్వ్ అల్లంరాజు (చి.జున్ను)
తండ్రికీ.శే.అల్లంరాజు కామేశ్వరరావు (22.5.1922-13.1.1986)
తల్లికీ.శే.అల్లంరాజు (ద్విభాష్యం)రాజేశ్వరమ్మ (30.10.1930-29.1.2018)

అల్లంరాజు వెంకటరావు అసలు పేరుతో కంటే సుధామ గా పేరు పొందిన కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత.ప్రముఖ వక్త ,సాహితీవేత్త , ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి..సామాజిక మాధ్యమమైన వాట్సప్ లో ఓగ్రూప్ ను వినూత్న ప్రయోగంగా "ఓ సారి చూడండి ..అంతే !" (వాట్సప్ ప్రసార సంచిక ) అంటూ 2021 లో ప్రారంభించి దృశ్య, శ్రవణ,పఠన ప్రసారసంచికగా ప్రతినెలా మొదటి మూడవ గురువారాలలో వెలువరిస్తూ సాహిత్యప్రపంచంలో మూడేళ్ళపాటు సంచలనం కలిగించిన ప్రతిభాశాలి .

జీవిత విశేషాలు

[మార్చు]

సుధామ [1]1951, నవంబర్ 25వ తేదీన విశాఖ జిల్లా అనకాపల్లిలో అల్లంరాజు కామేశ్వరరావు, రాజేశ్వరమ్మ దంపతులకు జన్మించారు . పితామహులు మిలటరీ లో పనిచేయగా మాతామహులు ద్విభాష్యం వారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు .ఒకటో తరగతి నుండి సుధామ మొత్తం విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే జరిగింది. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల నుండి ఎం.ఓ.యల్ ప్రాచ్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదివి ' తెలుగు అభ్యుదయ కవిత్వంలో భావచిత్రాలు ' అనే అంశం పై ఎం.ఫిల్ పరిశోధన చేసారు.

ఈనాడు చిత్రకారులు రవికిశోర్ చిత్రించిన చిత్రం

ఆ తరువాత 1975-1977 లలో కరీంనగర్ లోని బిషప్ సాల్మన్ జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు..

1978లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వివిధభారతి వాణిజ్య ప్రసార విభాగంలో ట్రాన్స్‌మిషన్ ఎక్జిక్యూటివ్‌గా చేరి, 1982 లో ప్రధానకేంద్రానికి బదిలీ అయ్యి 1991 లో ప్రోగ్రామ్ ఎక్సిక్యూటివ్ (కార్యక్రమ నిర్వహణాధికారి))గా పదోన్నతి పై విజయవాడ ఆకాశవాణి తెలుగు విభాగాన్ని ఉషశ్రీ గారి అనంతరం నాలుగేళ్ళు నిర్వహించి,

1995 నుండి హైదరాబాద్ లో తెలుగువిభాగం అధిపతి గా, ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్ కో -ఆర్డినేటర్ గా చేసి,రెండేళ్ళు వరంగల్ కేంద్రంలోనూ పనిచేసి ,చివరగా 2008 ఆగస్టు లో వివిధభారతి వాణిజ్య ప్రసార విభాగం కార్యక్రమ నిర్వహణాధికారిగా స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు .

శ్రీమతి ఉషారాణిని సుధామ 26.1.1985 గణతంత్ర దినోత్సవం నాడే కాకినాడ లో వివాహమాడారు .సుధామ గారి భార్య అల్లంరాజు (సూకూరు) ఉషారాణి కూడా ఆకాశవాణి ఉద్యోగిని .డ్యూటీ ఆఫీసర్ గా ఆకాశవాణి కడపకేంద్రంలో ,విజయవాడ కేంద్రంలో పనిచేసి వివాహానంతరం హైద్రాబాద్ ఆకాశవాణి కేంద్రంలో నూ, ఆ పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ప్రోగ్రామ్ ఎక్సిక్యూటివ్ గా ఎంపికై ఆకాశవాణి విజయవాడ,హైదరాబాద్ కేంద్రాలలో స్త్రీలు పిల్లల కార్యక్రమాలను,సంగీత విభాగాలను నిర్వహించి ,కొన్నాళ్ళు అకాశవాణి వరంగల్ కేంద్ర బాధ్యతలు ,హైదరాబాద్ వివిధభారతి వాణిజ్య ప్రసారవిభాగం సంచాలక బాధ్యతలు నిర్వర్తించి అనంతరం ఆకాశవాణి 'రీజనల్ అకాడమీ ఫర్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ మల్టీ మీడియా ట్రైనింగ్ సెంటర్' (ప్రాంతీయ శిక్షణా సంస్థ హైదరాబాద్ సంచాలకులుగా ఆవిడ పనిచేసి, ఓ ఏడాదిముందుగా 2017 లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆమె నాట్యకళాకారిణి.ఆంధ్రావిశ్వవిద్యాలయం నుంచి ఏం.ఎ.ఇంగ్లీషు లో బంగారుపతకం పొందారు.

చిత్రకళ, సంగీత, సాహిత్యాలలో సుధామకు ప్రవేశం ఉంది.పాఠశాలలో వుండగానే పదేళ్ళవయసులో 'విజ్ఞానజ్యోతి 'అనే లిఖితపత్రికనుసంపాదకునిగా నిర్వహించారు.అమర్ జవహర్ బాలానంద సంఘం స్థాపించి బాలల వికాసానికికృషి చేశారు.

యవ్వనదశలో 1967 లో యువమిత్ర సచిత్ర లిఖితమాసపత్రిక ను సంపాదకులుగా దాదాపు ఎనిమిది సంవత్సరాలు నిర్వహించారు."నేటి ముద్రితపత్రికలు ముఖంచూసుకోదగ్గ అద్దం ఈ లిఖిత పత్రిక ..శేముషి +కృషి =సుధామ "అని జ్నానపీఠ కవి పద్మభూషణ్ డా.సి.నారాయణరెడ్డి గారిచే ప్రశంసింపబడ్డారు .

సుధామ దాదాపు అన్నీ తెలుగు పత్రికల ద్వారా తెలుగు సాహిత్యప్రపంచం లో కవిగా,కార్టూనిస్ట్ గా,చిత్రకారునిగా ,కాలమిస్ట్ గా, పుస్తక,సినిమా సమీక్షకునిగా,సాహిత్య విమర్శకునిగా,పజిల్స్ నిర్మాతగా ,సాహితీవేత్తగా పేరొందారు. సుమారు నూరు గ్రంథాలకు ముఖచిత్రాలు సంతరించారు ప్రముఖ వక్తగా ప్రసిద్ధులు.

ప్రతిష్టాత్మక సాహిత్య సంస్థ యువభారతి లో క్రియాశీల కార్యకర్తగా అనేక సంవత్సరాలు పనిచేసి యువభారతి ప్రచురణల ప్రధాన సంపాదకులుగా కొన్నేళ్ళు వ్యవహరించారు.

2021 మార్చి లో "ఓ సారి చూడండి..అంతే' పేరిట వినూత్న వాట్సప్ గ్రూప్ నేర్పరచి తొలుత రోజువారిగా ఆపై ప్రతి ,గురువారం వాట్సప్ ప్రసార సంచికగా విజ్ఞాన ,వినోద ,వికాసాలను పంచారు. శుభకృతు నామసంవత్సరంలో ఏప్రెల్ 21 నుండి ప్రతినెలా మొదటి మూడవ గురువారాలలో 'ఓ సారి చూడండి.. అంతే! 'ప్రసార సంచిక మూడేళ్ళపాటు కొనసాగించారు. వాట్సప్ ,టెలిగ్రామ్ ,మాధ్యమాలలో సుమారు మూడువేలమంది సభ్యులతో అలరారిన విశిష్ట సాంకేతిక సామాజిక మాధ్యమ సమూహ స్థాపకులుగా గుర్తింపుపొందారు.అంతేకాదు.! ఓ సారి చూడండి అంతే! .2022లో దసరాకవితలు ,కథలు,పోటీ,ప్రసన్నభారతి ప్రసారసంచిక పేర 2023 లోఉగాది కథలపోటీ నిర్వహించి- బహుమతిపొందిన కవితలతో "కవితా1ఒకవితా "సంకలనం ,"కథామాలిక","కథామంజరి" పేర బహుమతి కథల సంకలనాలు ప్రచురించి, సామాజికమాధ్యమంలో వినూత్న కృషిగా పత్రికలు ,మీడియా ప్రశంసలందుకున్నారు.

తమ రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే కవిగా సుధామ 17ఏప్రెల్ 2023 సోమవారం 'సప్తపది'పేర వినూత్న లఘుకవితా ప్రక్రియ సృజించారు. కేవలం ఒక్కరోజులోనే 98 మంది సప్తపది ప్రక్రియను చేపట్టి 600 పైగా సప్తపదులు రాయడం తెలుగుకవిత్వ చరిత్రలోనే ఒక్ రికార్డు. అంతేకాదు ప్రముఖకవి ,కథకులు ,సాహితీవేత్త, పదచిత్రరామాయణం 6500 పద్యాలలోరాసి అప్పాజోశ్యుల -విష్ణుభొట్ల కందాళo ఫౌండేషన్ లక్షరూపాయల జీవనసాఫల్య ప్రతిభాపురస్కారం వంటి పురస్కారాలు ఎన్నో అందుకున్న అరవైకి పైగా గ్రంథాలు రచించిన శ్రీ విహారి ( జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి ) గారు "సప్తపదులు (నూటపదహార్లు )" రాసి ఈ ప్రక్రియలో తొలిసంపుటిని సుధామ గారికే అంకితం చేస్తూ ప్రచురించడం ఓ విశేషం ! ప్రస్తుతం సప్తపదులు వాట్సప్ గ్రూప్ లో నిత్యం వందలాదిమంది ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.పలు ముద్రిత,అంతర్జాల వార మాసపత్రికలు సప్తపదులను ప్రచురిస్తున్నాయి.

సుధామకు ఒక కుమారుడు స్నేహిత్ అల్లంరాజు .సుమారు ఏడేళ్ళు అమెరికా కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంట్ యోర్బలిండా నోబెల్ బయోకేర్ సంస్థలో పనిచేసి గ్రీన్ కార్డ్ నిరాకరించి భారతదేశానికి తిరిగివచ్చి, ఆ అమెరికన్ కంపెనీ వారి అభ్యర్థనమేరకు ఆ సంస్థకే హైదరాబాద్ నుంచి కొన్నేళ్ళు పనిచేసి ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎం సంస్థ కు డిజిటల్ అనాల్సిస్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

సుధామ దంపతుల కోడలు శ్రీమతి అల్లంరాజు (దువ్వూరి ) లక్ష్మీస్రవంతి తొలుత 'ఇన్ఫోసిస్ ' సంస్థలో పనిచేసి ప్రస్తుతం 'లక్స్ సాఫ్ట్ 'కంపెనీ లో పనిచేస్తున్నారు .

2024 ఫిబ్రవరి 7 వ తేదీ సుధామ దంపతులను తాత,మామ్మ లను చేస్తూ మనుమడు చి.అథర్వ్ (చి.జున్ను) జన్మించాడు.

2021 నవంబర్ 25 కు సప్తతి పూర్తిచేసుకుని సుధామ సాహిత్య వ్యవసాయం కొనసాగిస్తూ విశ్రాంత జీవిత గడుపుతున్నారు



పుస్తకాలు

[మార్చు]
  • 'వీచికలు' కవితా సంకలనం 1967లో అచ్చయ్యింది.(యువభారతి వారి నలుగురి సభ్యుల ఈ కవితా సంకలనంలో మిగితా ముగ్గురు కవులూ డా.ఇరివెంటి కృష్ణమూర్తి ,చక్రవర్తి వేణుగోపాల్ .డా. వంగపల్లి విశ్వనాథం )
  • ప్రతిష్టాత్మక కేంద్రసాహితీ అకాడమీ వారి స్వాతంత్ర్యానంతర కవితాసంపుటి 'కావ్యమాల' లో సుధామ ప్రాచ్యకళాశాల విద్యార్థిగా వుండగానే రాసిన కవితకు స్థానం లభించడం విశేషం
  • 'మేం' కవితా సంకలనం 1974లో మిత్రుడు డాక్టర్. నాగినేని భాస్కరరావు సహ కవిగా ప్రచురింపబడింది.
  • సుధామ 'అగ్నిసుధ ' తొలి కవితా సంపుటి 1990లో ప్రచురితమయింది.
  • 2001లో ''సం.సా.రా.లు '' (సంస్కతి, సాహిత్యం. రాజకీయాలు) ఆంధ్రభూమి దినపత్రిక కాలం 50 వ్యాసాలతో ప్రచురితమైంది.సుమారు15 సంవత్స రాలు ఆ కాలమ్ నిర్వహించారు.
  • 'మనసు పావన గంగ ' పేరిట సుధామ రేడియో, టీ.వీ పాటలు 2010 లో పుస్తకంగా వచ్చాయి.
  • ఆంధ్రప్రభ దినపత్రికలో మూడు ఏళ్ళపాటు గురువారాల్లో ఎడిట్ పేజ్ లో కవిత్వరూపంలో రాసిన కాలమ్ నుంచి ఎంపికచేసిన కవితలతో 'కవికాలమ్ ' 2011లో విడుదలైంది.
  • అలాగే 2011 లో నే 'చిత్రగ్రంథి ' కవితా సంకలనం వచ్చింది.
  • 2012 లో 'పూతరేకులు' పేర జోక్స్ సంకలనం వెలువరించారు.
  • 2018 లో 'మన తెలంగాణ ' పేర 2015-16 లో 'సుధామ'యోక్తి' పేర మనతెలంగాణ దినపత్రిక లోని కాలమ్ వ్యాసాలు పుస్తకం గా వెలువడింది
  • ఆంధ్రభూమి వార పత్రికలో 88 వారాల పాటు పాఠకులను అలరించిన ' రామాయణ పథం' పజిల్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అభినందన వచనాలతో 2018 జూలై లో ప్రశ్నోత్తరమాలికా గ్రంథం గా వెలువడింది
  • సుధామ రాసిన పీఠికలు -ముందుమాటలు 'భూమిక ' పేర 470 పేజీల బృహద్గ్రంథం గా వారి శ్రీమతి అల్లంరాజు (సూకూరు) ఉషారాణి సంపాదకులుగా 25 నవంబర్ 2018 న ఆవిష్కరింప బడింది .
  • వ'సుధా (స)మ'యం -విజయక్రాంతి దినపత్రిక కాలమ్ వ్యాసాలు 2019 లో ప్రచురితం
  • మాటాట (గళ్ళ నుడికట్టు) 2019 లో ప్రచురితం
  • తెలుగు సొగసులు (విద్యార్థి యువతకు పరిచయ వ్యాసాలు )-యువభారతి ప్రచురణ 2020 లో ప్రచురితం
  • కాలం వెంట కలం (వ్యాస సంపుటి ) 2020 లో ప్రచురితం
  • సందర్భ (వ్యాససంపుటి ) 2020 లో ప్రచురితం
  • తెమ్మెర (కవితా సంపుటి) 2020 లో ప్రచురితం
  • హాస్యానందం మాసపత్రిక సుధామ పజిల్స్ కొన్నింటిని 'పదానందం'(అక్షరాలతో ఆట )పేర 2022 లో ప్రచురించింది
  • 'జీవనసంధ్య '(సీనియర్ కబుర్లు ) వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ మాసపత్రిక కాలమ్ వ్యాసాల సంకలనం 2022 లో వెలువడింది
  • మన పండుగలు',' ఈసఫ్ నీతికథలు'.' పురాణ బాలలు ', విజయవాడ ప్రచురణ సంస్థ కై రాయగా పుస్తకాలుగా వెలువడ్డాయి.

తొలి రచనలు :

'బాలబంధు' పత్రికలో సుధామ తొలి కథ 1965 డిసెంబర్ 1సంచికలో ప్రచురితం

'నవ్యవాణి 'మాసపత్రిక ఫిబ్రవరి 1968 లో తొలికవిత 'నే రాస్తా 'ప్రచురితం ..

'లత' మాసపత్రిక జనవరి 1968 లో తొలి కార్టూన్ ఆపై ఆంధ్రప్రభ వారపత్రిక లోకోక్తిచిత్రిక 3.4.1968 బహుమతి పొందిన కార్టూన్ తో కార్టూనిస్ట్ గా ప్రస్థానం ప్రారంభమై 'శంకర్స్ వీక్లీ 'వంటి ఆంగ్ల పత్రికతో సహా వివిధ పత్రికలలో సుమారు వెయ్యి కార్టూన్లు ప్రచురితాలు

చుక్కాని ,హాస్యప్రభ,విశ్వరచన,ప్రజావాహిని,ప్రజాతంత్ర, ప్రతిభ,ప్రగతి,ఆంధ్రప్రభ,ఆంధ్ర సచిత్రవారపత్రిక,ఆంధ్రజ్యోతి,విశాలాంధ్ర, ప్రజాశక్తి ,ఉదయం, ఆంధ్రభూమి,క్రోక్విల్ హాస్య ప్రియ,జయశ్రీ,జ్వాల.దండోరా, జ్యోతి ,కల్పన,తరుణ,కమెండో ,శ్రీమతులు ,ఈనాడు.సితార ,నది ,చినుకు ,సంతోషం ,తెలుగువెలుగు,విపుల ,పాలపిట్ట ,వార్త.హైదరాబాద్ మిర్రర్ ,కుముదం భక్తి వంటి అనేకానేక పత్రికలలో రచనలు వెలువడ్డాయి

కాలమిస్టు గా :

చుక్కానిలో 'బంగారు పాళీలు','గుసగుసలు' ,'ఉదయం' దినపత్రికలో 'హ్యూమర్ మరాలు ','పదకేళి', ఆంధ్రభూమి దినపత్రిక లోసుమారు 15 సంవత్సరాలు 'సం.సా,.రా.లు' (సంస్కృతి-సాహిత్యం-రాజకీయాలు ),ఆంధ్రప్రభలో బుధవారాల్లో కాలమ్ వ్యాసాలతో బాటు 'సితార 'లో 'సినీటాక్ ',సినీమానిసి .'సుధామధురం సితార పజిల్స్ ',ఆంధ్రప్రభ దినపత్రికలో'పద బంధం ', 'ఆంధ్రభూమి దినపత్రికలో 'మాటాట ' పేరిట డైలీ పజిల్, ఆంధ్రభూమి వారపత్రికలో ' పదబంధ పారిజాతం','నవ్య' వారపత్రికలో ' సుధామ పదగారడి', రచన మాసపత్రికలో' పజిలింగ్ పజిల్ ' ,(ప్రభాత )వెలుగు దినపత్రికఆదివారం అనుబంధం 'దర్వాజ' లో 'మాట-ఆట' (క్రాస్ వర్డ్ పజిల్స్ ) గళ్లనుడికట్టులు సుధామ నిర్వహించారు .

నవతెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం 'సోపతి' లో పదకేళి ,జాగృతి వారపత్రికలో 'పదరసం ' ,కొన్నేళ్లు నిర్వహించారు. ప్రస్తుతం అంతర్జాల వారపత్రిక 'సహరి' లో 'సహరంగం ' పజిల్స్,ఆరాధన మాసపత్రికలో 'పదరంగం 'పజిల్ నిర్వహిస్తున్నారు

'వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్" మాసపత్రిక లో 'సీ' నియర్ కబుర్లు కాలమ్ నిర్వహించి 2022 లో ప్రచురించిన 'జీవనసంధ్య' పుస్తకం మూడుముద్రణలతో ఎందరో వయోధికులకు ఉపయుక్త గ్రంథంగా ప్రశంసలందుకుంది

10 సంవత్సరాల పాటు ' వార్త' ఆదివారం అనుబంధం లో,ఆంధ్రప్రభ దినపత్రిక లోపజిల్స్ నిర్వహించారు .

'హాస్యానందం 'మాసపత్రిక తన నవంబర్ '2019 సంచికను సుధామ ప్రత్యేక సంచికగా వెలువరించి కార్టూనిస్టు గా ,హాస్యరచయితగా గౌరవించింది.

తానా ,ఆటా వారు నిర్వహించిన కవిసమ్మేళనాలలో , హైదరాబాద్,తిరుపతి,బెంగళూరు లలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొన్నారు .

2016 లో అమెరికా పర్యటించారు.సింగపూర్ ,దుబాయ్ మొదలయిన విదేశీ పర్యటనలు చేశారు.

అవార్డులు

[మార్చు]
  • 1983 లో ఆకాశవాణి సర్వ భాషా కవిసమ్మేళనానికి తెలుగుకవిగా ఎంపికై జాతీయకవిగా పాల్గొన్నారు.అన్నీ భారతీయ భాషలలోనికీ ఆ కవిత అనువాదమై అన్ని ఆకాశవాణి కేంద్రాలద్వారా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 25 జనవరి 1983 రాత్రి ప్రసారమైంది .
  • 'అగ్నిసుధ' కవితా సంకలనానికి 1990 కలహంసి, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డులు లభించాయి.
  • 2004లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథంగా సం.సా.రా.లు (సంస్కతి, సాహిత్యం. రాజకీయాలు)సాహితీ పురస్కారం అందుకుంది.ఆ కాలమ్ సుమారు15 సంవత్స రాలు ఆంధ్రభూమి దినపత్రిక ఎడిట్ పేజీలో వచ్చింది.
  • 1995లో ఆరాధన సంస్థవారి ఆకాశవాణి అవార్డు శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారితో బాటు అందుకున్నారు
  • 1998లో కమలాకర ఛారిటబుల్ ట్రస్టు వారిచే విశిష్టదంపతుల పురస్కారం
  • 2002లో జ్యోత్స్న కళాపీఠం కవితా పురస్కారం
  • 2003లో అభినందన సంస్థ పురస్కారం
  • 2005లో ఆచార్య తిరుమల స్మారక సాహితీ పురస్కారం
  • 2007లో చేతన పత్రిక విశిష్ట పురస్కారం
  • 2008 లో వంశీ ఇంటర్నేషనల్ ఉగాదికవితా పురస్కారం
  • అభినందన సంస్థవారి స్నేహితుల దినోత్సవ పురస్కారం డా.కె.బి.లక్ష్మి తో
  • 2008 లో తురగా కృష్ణమోహన్‌రావు స్మారక పురస్కారం
  • 2009 లో కమలాకరఛారిటబుల్ ట్రస్టు వారి ఉగాది పురస్కారం
  • 2011 లో 'చిత్రగ్రంథి' కవితాసంపుటికి తేజ ఆర్ట్స్ సంస్థ సాహితీ పురస్కారం
  • 2011 లో 'చిత్ర గ్రంథి'కవితా సంకలనానికి చెలిమిసంస్థ పురస్కారం
  • 2012 లో సమైక్య భారతివారిచే కార్టూనిస్టుల కాన్ఫరెన్స్ లో కార్టూనిస్ట్ గా సన్మానం
  • 2013 లో నోరి ఛారిటబుల్ సంస్థ వారిచే 'దివాకర్ల వెంకటావధానిస్మారక సాహిత్య పురస్కారం'
  • 2015 లో 'మునిమాణిక్యం హాస్యనిధి' పురస్కారం
  • 2015 లో నవ్య సాహితీ సమితి ఉగాదివసంతోత్సవ సాహిత్యవిమర్శ పురస్కారం
  • 2015 లోనే పింగళిజగన్నాధరావు స్మృతిసాహిత్య పురస్కారం
  • 2015 లోనే హాసం సంస్థ వారి పురస్కారం
  • 2015 లో డా.తిరుమల శ్రీనివాసాచార్య,స్వరాజ్యలక్ష్మిల యువభారతి ధర్మనిధి పురస్కారం
  • 2016 లో దివాకర్ల వేంకటావధాని స్మారక ట్రస్టు సాహిత్య పురస్కారం
  • 2017 లో కంభమ్మెట్టు చెన్నకేశవరావు జయంతి పురస్కారం
  • 2018 లో కీ.శే..పోలవరంవెంకటసుబ్బమ్మ సాహితీపురస్కారం
  • 2018లో నెల్లూరు గుర్రాల వెంకటరమణమ్మ స్మారక సాహితీ పురస్కారం
  • 2019లో యువకళావాహిని సంస్థ వారిచే వివేకానంద ప్రతిభా సాహిత్య పురస్కారం
  • 2020లో గిడుగురామమూర్తి ఫౌండేషన్ వారి 'జీవన సాఫల్య పురస్కారం'
  • 2021 లో తెలంగాణ సారస్వతపరిషత్తు వారి ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం
  • 2023 యువభారతి ఇరివెంటి కృష్ణమూర్తి సంస్మరణ పురస్కారం
  • 2023 లో లలితకళాభారతి కమలాకర్ ఛారిటబుల్ ట్రస్ట్ వారిచే కుందుర్తి శతజయంతి కవిత్వ ప్రతిభా పురస్కారం
  • 2024 లో మాతృభాషా దినోత్సవ సందర్భంగా అక్షరయాన్ విమెన్ రైటర్స్ ఫౌండేషన్ వారి భాషా సత్కారం

మూలాలు

[మార్చు]
  1. [1][permanent dead link] కదిలించే కలాలు - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి


"https://te.wikipedia.org/w/index.php?title=సుధామ&oldid=4293477" నుండి వెలికితీశారు