అల్లుడు అదుర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లుడు అదుర్స్
దర్శకత్వంసంతోష్ శ్రీనివాస్
రచనసంతోష్‌ శ్రీనివాస్‌
శ్రీకాంత్ విస్సా మాటలు)
నిర్మాతగొర్రెల సుబ్రహ్మణ్యం
తారాగణంబెల్లంకొండ శ్రీనివాస్
నభా నటేష్
అను ఇమ్మాన్యుయేల్‌
సోనూ సూద్
ప్రకాష్ రాజ్
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుతమ్మిరాజు
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
14 జనవరి 2021 (2021-01-14)
సినిమా నిడివి
149 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అల్లుడు అదుర్స్ 2021, జనవరి 14న వచ్చిన రొమాంటిక్‌ కామెడీ సినిమా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మజీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.[1]

సాయి శ్రీనివాస్‌ అలియాస్‌ శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్‌) ఓ చలాకీ కుర్రాడు. తొమ్మిదో తరగతిలోనే వసుంధర (అను ఇమ్మాన్యుయేల్‌) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. అనుకోని పరిస్థితుల కారణంగా వసుంధర.. శ్రీనుని వదిలి వెళ్లిపోతుంది. దీంతో శ్రీనుకి ప్రేమంటే అసహ్యం కలుగుతుంది. జీవితంలో ఎవర్నీ ప్రేమించకూడదు అనుకుంటాడు. కానీ, తొలి చూపులోనే కౌముదితో (నభానటేశ్‌) ప్రేమలో పడతాడు. పది రోజుల్లో కౌముదిని ప్రేమలోకి దింపుతానని ఆమె తండ్రి జైపాల్‌ రెడ్డితో (ప్రకాశ్‌రాజ్‌) ఛాలెంజ్‌ చేస్తాడు. మరి, శ్రీను.. కౌముది ప్రేమను గెలుచుకున్నాడా? గజ (సోనూసూద్‌)తో శ్రీనుకు ఉన్న వైరం ఏమిటి? శ్రీను జీవితంలోకి వసుంధర తిరిగి ఎందుకు వచ్చింది? కౌముదికి, వసుంధరకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? అనేదే ఈ చిత్ర కథ.[2]

నటీనటులు \ సినిమాలో పాత్ర పేరు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • నదిలా నదిలా , రచన: శ్రీమణి, గానం. సాగర్, హరిప్రియ
  • అల్లుడు అదుర్స్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.జస్ప్రీత్ జాజ్ , శ్రీకృష్ణ , వైష్ణవి
  • పడిపోయా, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. జావిద్ అలీ
  • హొల చికా, రచన: శ్రీమణి, గానం. జస్ప్రీత్ జాస్, రనిన రెడ్డి,
  • రంభ ఊర్వశి మేనక, రచన: శ్రీమణి, గానం.హేమచంద్ర, మంగ్లి.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (14 January 2021). "అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ". Archived from the original on 5 ఫిబ్రవరి 2021. Retrieved 17 April 2021.
  2. "Alludu Adhurs movie review: Santosh Srinivas' silly, outdated comedy is an assault to the senses". Firstpost. 2021-01-15. Retrieved 17 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)