అల్లుడు శీను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లుడు శీను
Alludu Seenu poster.jpg
దర్శకత్వంవి. వి. వినాయక్
నిర్మాతబెల్లంకొండ సురేష్
రచనకోన వెంకట్,
గోపీ మోహన్,
కె.ఎస్. రవీంద్రనాథ్
నటులుబెల్లంకొండ శ్రీనివాస్,
సమంత,
ప్రకాశ్ రాజ్,
ప్రదీప్ రావత్,
బ్రహ్మానందం
సంగీతందేవి శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుగౌతంరాజు
నిర్మాణ సంస్థ
శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
విడుదల
జులై 25, 2014
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై వి. వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన సినిమా "అల్లుడు శీను". ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సురేష్ చిన్నకొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమయ్యాడు. సమంత కథానాయిక. ప్రకాశ్ రాజ్, ప్రదీప్ రావత్, కన్నెగంటి బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషించారు. తమన్నా మొదటి సారి ఈ సినిమాలో ఒక ఐటెం పాటలో నర్తించింది.[1] కోన వెంకట్, గోపీ మోహన్, కె.ఎస్. రవీంద్రనాథ్ ఈ సినిమాకు కథ, చిత్రానువాదం, సంభాషణలను అందించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఛోటా కె. నాయుడు ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా, గౌతంరాజు ఎడిటరుగా పనిచేసారు. ఎ.ఎస్.ప్రకాశ్ ఈ సినిమా కళావిభాగంలో పనిచేసాడు. నల్గొండలోని సిరిపురం అనే ఓ పల్లెటూళ్లో కథ మొదలవుతుంది. గ్రామంలో అల్లుడు శీను, అతని మామ నరసింహ అప్పుల పాలై ఊరి నుండి దుబాయ్ వెళ్లాలనుకుని చెన్నై ట్రైన్ బదులు హైదరాబాదు ట్రైన్ ఎక్కేస్తారు. దాంతో వారు హైదరాబాదు చేరుకుంటారు. నరసింహ పోలికలున్న భాయ్ హైదరాబాదులో దందాలు, సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. దాంతో శీను బాయ్ పిఎ డింపుల్ ను తెలివిగా వాడుకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ టైమ్ లోనే భాయ్ కూతురు అంజలిను ప్రేమిస్తాడు శీను. ఇలాంటి సమయంలో భాయ్ కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడు భాయ్ ఏం చేస్తాడు? అసలు భాయ్ కి, నరసింహకి ఉన్న సంబంధం ఏమిటి? అల్లుడు శీను తన ప్రేమను ఎలా దక్కించుకుంటాడు అనేది మిగిలిన కథ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2014 జూలై 25న విడుదలైంది.[2]

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "సమంత సినిమాలో తమన్నా ఐటెం సాంగ్!". వెబ్ దునియా. March 31, 2014. Retrieved July 25, 2014. Cite web requires |website= (help)
  2. "జూలై 25న బెల్లంకొండ శ్రీనివాస్‌-వి.వి.వినాయక్‌ల 'అల్లుడు శీను'". వెబ్ దునియా. July 5, 2014. Retrieved July 25, 2014. Cite web requires |website= (help)