Jump to content

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం
2026 మే నాటికి నిర్మాణ స్థితి
  • IATA: VTZ (2026 ఆగస్టు 17 నుండి)[1]
  • ICAO: VOVI
సంగ్రహం
విమానాశ్రయ రకంPublic
యజమాని/కార్యనిర్వాహకుడుఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, జీఎమ్‌ఆర్ గ్రూప్
సేవలువిశాఖపట్నం
ప్రదేశంభోగాపురం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఎత్తు AMSL59.00 ft / 18.00 m
అక్షాంశరేఖాంశాలు17°58′34″N 083°30′14″E / 17.97611°N 83.50389°E / 17.97611; 83.50389
పటం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
మీటర్లు అడుగులు
10/28 3,800 12,467 Concrete
Cat I C ILS

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ నిర్మించి నిర్వహిస్తోంది. దీనికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు.[2] 2019 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిలాఫలకం వేయగా, 2023 లో ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్. జగన్మోహనరెడ్డి అన్ని అనుమతులు తీసుకువచ్చారు. జిఎంఆర్ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకొని పనులు ప్రారంభించారు.

ఈ విమానాశ్రయం విశాఖపట్నం నుండి 44 కి. మీ. ల దూరంలో, విజయనగరం నుండి 23 కి. మీ, శ్రీకాకుళం నుండి 64 కి. మీ దూరంలో ఉంది. ఇది ప్రధానంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలకు సేవలు అందిస్తుంది. ఈ ప్రాంతంలో కనెక్టివిటీ, ఉపాధికి దీన్ని ప్రధాన కేంద్రంగా భావిస్తున్నారు. విమానాశ్రయం జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 26 ద్వారా అనుసంధానమై ఉంది. భవిష్యత్తులో విశాఖ బీచ్ కారిడార్, విశాఖ మెట్రోలను దీనికి కలుపుతారు. ఏపీఎస్ఆర్టీసీ, విమానాశ్రయం నుండి సమీప నగరాలకు బస్సులను నడుపుతోంది. 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం జంక్షన్, విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషను.

ఈ విమానాశ్రయం 2026 ఆగస్టు 1 న ప్రారంభోత్సవం జరుపుకుంది. ఆగస్టు 17 న విమానాల రాకపోకలు మొదలయ్యాయి. దాంతో అదే రోజున విశాఖపట్నం లోని పాత అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమానయానాలను నిలిపివేసారు. అది రక్షణ దళాల సేవలకు పరిమితమైంది.

నిర్మాణం, ప్రారంభం

[మార్చు]

విమానాశ్రయ నిర్మాణం 2023 నవంబరులో ప్రారంభమైంది. పౌర నిర్మాణ పనుల కాంట్రాక్టును జీఎమ్‌ఆర్ గ్రూపు, లార్సెన్ & టూబ్రోకు అప్పగించింది.[3][4] 2024 లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకుని నిర్మాణ పనులను వేగవంతం చేసింది. 2024 సెప్టెంబరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విమానాశ్రయానికి భారత స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించింది.[5][6][7][8]

2024 నవంబరులో టాటా గ్రూపు, విమానాశ్రయం సమీపంలో వాణిజ్య అభివృద్ధి చేపట్టే ప్రణాళికలను ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వాన్ని భూమి కేటాయించాలని కోరింది.[9] విమానాశ్రయంలో ఆపరేషన్లకు అనుమతి (ఆపరేటింగ్ లైసెన్స్) పొందే ప్రక్రియలో భాగంగా, 2026 జనవరి 4 న తొలి ధ్రువీకరణ విమానం ఈ విమానాశ్రయంలో దిగింది.[10]

విమానాశ్రయం తొలి దశలో ఏటా 63 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం ఉంది. రెండో దశ పూర్తయ్యాక ఇది 1.2 కోట్లకు, మూడో దశ పూర్తయ్యాక 1.8 కోట్లకు పెరుగుతుంది.[11] విమానాశ్రయం ప్రారంభోత్సవం 2026 ఆగస్టు 1 న జరిగింది.[12][13] విమానాశ్రయం నుండి వాణిజ్య సేవలు 2026 ఆగస్టు 17 న మొదలయ్యాయి.[14]

GMR ఏరోసిటీ

[మార్చు]

విమానాశ్రయం పక్కనే GMR ఏరోసిటీ పేరుతో వాణిజ్య, వసతి, రెటెయిల్, వ్యాపారాల సౌకర్యాలను నిర్మించాలని ప్రణాళిక వేసారు.[15]

సౌకర్యాలు

[మార్చు]

రన్‌వే

[మార్చు]
సంఖ్య పొడవు వెడల్పు ILS మూలాలు
10/28 3,800 మీటర్లు 45 మీటర్లు CAT I (RWY 28) [16]

విమానాశ్రయం లోని రన్‌వే వెడల్పాటి విమానాలు వచ్చిపోయేలా రూపొందించారు.[17]

టర్మినల్

[మార్చు]

ఆధునిక సమీకృత ప్రయాణికుల టెర్మినల్‌ తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో నిర్మించారు. తరువాతి దశల్లో దీన్ని విస్తరించి ఏటా 4 కోట్ల మంది ప్రయాణికుల స్థాయికి పెంచవచ్చు. ఔషధాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు తోడ్పడేందుకు ప్రత్యేక కార్గో టెర్మినల్‌ను కూడా ఏర్పాటు చేశారు. పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, వర్షపు నీటి సంరక్షణ వంటి పర్యావరణహిత సదుపాయాలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. 2026 జూలైలో ఈ విమానాశ్రయానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషను (డీజీసీఏ) నుంచి ఏరోడ్రోమ్ లైసెన్సు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) నుంచి అవసరమైన భద్రతా అనుమతులు లభించాయి.[18][19]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Rao, V. Kamalakara (2026-07-29). "Vizag flights shift to Bhogapuram from August 17; INS Dega closed to scheduled services for 30 years". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2026-08-06. Retrieved 2026-08-06.
  2. "AP cabinet approves new liquor policy, renaming airport". The Siasat Daily (in ఇంగ్లీష్). 2024-09-18. Retrieved 2024-09-18.
  3. "L&T Awarded Vizag Bhogapuram Airport's Construction Contract". The Metro Rail Guy. 8 November 2023. Archived from the original on 7 June 2025. Retrieved 20 April 2025.
  4. "Andhra Pradesh: Bhogapuram Greenfield International Airport work begins". The New Indian Express. Archived from the original on 15 August 2025. Retrieved 31 July 2025.
  5. "AP cabinet approves new liquor policy, renaming airport". The Siasat Daily. 18 September 2024. Archived from the original on 18 September 2024. Retrieved 18 September 2024.
  6. Ilyas, M. D. (19 September 2024). "AP Cabinet Approves New Liquor Policy, 10% Shops to Kallu Geethas". Deccan Chronicle. Archived from the original on 18 September 2024. Retrieved 19 September 2024.
  7. "'Bhogapuram Airport will be opened six months before scheduled construction'". The Times of India. 19 September 2024. ISSN 0971-8257. Archived from the original on 19 September 2024. Retrieved 19 September 2024.
  8. "Bhogapuram Airport to be named after Alluri Seetharama Raju". Deccan Chronicle. 21 November 2024. Archived from the original on 6 December 2025. Retrieved 11 April 2026.
  9. Rao, K. Srinivasa (12 November 2024). "Star hotels, resorts likely to come up near Bhogapuram international airport". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 4 December 2024. Retrieved 25 November 2024.
  10. "GMR Visakhapatnam International Airport successfully conducts validation flight at Bhogapuram". The Economic Times. 4 January 2026. ISSN 0013-0389. Archived from the original on 4 January 2026. Retrieved 4 January 2026.
  11. "The first phase of the development of Bhogapuram International Greenfield Airport set in motion". Press Information Bureau (Press release). Archived from the original on 16 February 2024. Retrieved 31 July 2025.
  12. Rao, K. Srinivasa (20 July 2026). "After 43 years, a PM to visit Vizianagaram: Modi to inaugurate Bhogapuram airport on August 1". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 21 July 2026.
  13. "PM Modi inaugurates Bhogapuram international airport, third for Andhra Pradesh". India Today (in ఇంగ్లీష్). 2026-08-01. Retrieved 2026-08-01.
  14. "Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో ల్యాండైన తొలి విమానం". EENADU. Retrieved 2026-08-17.
  15. "Bay City to Aerocity: Govt approves VMRDA's 2041 vision". The Times of India. 2026-07-13. ISSN 0971-8257. Retrieved 2026-08-01.
  16. "Aerodrome Data, Bhogapuram International Airport (VOVI)" (PDF). aim-india.aai.aero. 29 April 2026. Retrieved 30 July 2026.{{cite web}}: CS1 maint: url-status (link)
  17. "Aerodrome Data, Bhogapuram International Airport (VOVI)" (PDF). aim-india.aai.aero. 29 April 2026. Retrieved 30 July 2026.{{cite web}}: CS1 maint: url-status (link)
  18. "DGCA License For ASRIA". Tathya (in అమెరికన్ ఇంగ్లీష్). 2026-07-13. Retrieved 2026-07-22.
  19. "Bhogapuram airport operations likely to begin by August". The New Indian Express (in ఇంగ్లీష్). 2026-04-06. Retrieved 2026-07-22.