Jump to content

అవంతిక వందనపు

వికీపీడియా నుండి
అవంతిక వందనపు
జననం (2005-01-01) 2005 జనవరి 1 (వయసు 19)
యూనియన్ సిటీ, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్
పౌరసత్వంయునైటెడ్ స్టేట్స్
క్రియాశీల సంవత్సరాలు2005 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటి, నృత్య కళాకారిణి
గుర్తించదగిన సేవలు
జీ.టి.వి. డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్ నార్త్ అమెరికా

అవంతిక వందనపు ఒక నటి, నటి, నాట్యకారిణి, గాయకురాలు, మోడల్, సంధానకర్త. తను కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలకి చెందినది. ఆమె జూన్ 2014 లో జరిగిన జీ టీవీ రియాలిటీ కార్యక్రమం "డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ ఉత్తర అమెరికా"లో తన ప్రదర్శనకి పేరు గాంచింది. ఆమె ఆ కార్యక్రమములో రెండవ విజేతగా నిలిచింది.[1] ఐదేళ్ల వయసులో డ్యాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించిన అవంతిక.. కూచిపూడి, కథక్, జాజ్, ఇండియన్ కాంటెపరరీ డ్యాన్సులన్నీ నేర్చుకుంది. బొమ్మలు కూడా గీస్తుంది.

బాల్యము, విద్య

[మార్చు]

అవంతిక వందనపు యూనియన్ సిటి, కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రం లో జన్మించింది. ఆమె తల్లితండ్రులు భారత దేశానికి చెందినవారు. [2]

వృత్తి

[మార్చు]

అవంతిక తన ఐదవ ఏటనుండే నాట్యంతో తన కళా వృత్తిని మొదలు పెట్టింది. మొదటగా తను సెమీ క్లాసిక్ నృత్యంలో శిక్షణ పొందింది. తదుపరి దక్షిణ భారత సంప్రదాయ నృత్యంలో ఒకటైన కూచిపూడిని తన ఏడవ ఏట నుండి నేర్చుకోవడం మొదలు పెట్టింది. అవంతిక పలు నృత్య ప్రదర్శన పోటీలలో పాల్గొన్నది. 2012 సంవత్సరంలో ATA స్టార్ డాన్సర్ పురస్కారాన్ని పొందింది.[3] 2014 సంవత్సరంలో జీ టీవీ మొదటి ఉత్తర అమెరికా ఎడిషన్ "డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్"లో అవంతిక ద్వితియ స్థానంలో నిలిచింది.[1][4][5][6][7] 2015 సంవత్సరంలో రెండు తెలుగు చలన చిత్రాలలో నటించుటకు ఒప్పుకొనడం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. ఆమె 2016 లో విడుదలైన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వారి కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంలో చుట్కీ పాత్రకు ఎంపికైనది. కానీ షెడ్యూల్ కుదరకపోవడం వలన తను ఆ చిత్రంలో నటించలేదు. అధికారికంగా మహేష్ బాబు, కాజల్, సమంత, ప్రణీత నటించిన బ్రహ్మోత్సవం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి బాలనటిగా పరిచయమయ్యింది. బ్రహ్మోత్సవం చిత్రం చిత్రీకరణ 2015 సెప్టెంబరు 16 న మొదలైంది. తదుపరి చంద్రశేఖర్ యేలేటి చిత్రం మనమంతాలో నటించింది. గోపి చంద్ చిత్రం ఆక్సిజన్ లో ఒక పాటలో చిన్న పాత్ర చేసింది. తదుపరి నాగ చైతన్య, శ్రుతీ హాసన్ చిత్రం ప్రేమమ్లో తృతీయ కథానాయకి (మడోన్నా సెబాస్టియన్) యుక్త వయసు పాత్రలో నటించింది. అవంతిక అభిషేక్ పిక్చర్స్ చిత్రంలో నటించుటకు ఒప్పుకున్నది.

మార్చి 2016 లో అవంతిక "స్వేచ్ఛ" అనే లఘు చిత్రంలో నటించింది. ఈ లఘు చిత్ర దర్శకుడు "రాజ్ శివసథాని". "చదువుకోవలసిన పసి పిల్లలను పనివాళ్లుగా మార్చకండి. బడికి వెళ్లాల్సిన వయసులో బాల కార్మికులను చేయకండి" అనే ఇతివృత్తంతో రూపొందిన షార్ట్ ఫిల్మ్ "ప్రజా హక్కు"లో అవంతిక వందనపు ప్రధాన పాత్రలో నటించింది. బాలికల విద్య, హక్కులు, కూచిపూడి నాట్య ప్రాముఖ్యతను చర్చించిన ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.[2]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష వివరణ
2016 బ్రహ్మోత్సవం మహేష్ బాబు కజిన్ తెలుగు 2016 మే 20 విడుదల
2016 స్వేచ్ఛ (లఘుచిత్రం) కౌమరదశలో గల బాలిక తెలుగు 2016 మార్చి 21 విడుదల
2016 మనమంతా అవంతిక తెలుగు, మలయాళం ఆగస్టు 4 విడుదల
2016 ప్రజాహక్కు (లఘుచిత్రం) అమ్రీన్ అవంతిక తెలుగు 2016 అక్టోబరు 1 న విడుదల,

చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటి పురస్కారం

2016 ప్రేమమ్ సింధు తెలుగు 2016 అక్టోబరు 7 విడుదల
2017 బాబు బాగా బిజీ అవంతిక తెలుగు 2017 మే 5 విడుదల
2017 రారండోయ్ వేడుక చూద్దాం బ్రమరాంబ - జూనియర్ రకుల్ ప్రీత్ తెలుగు 2017 మే 25 విడుదల
2017 లైక్ గర్ల్ (లఘుచిత్రం) అవంతిక తమిళం పోస్టు ప్రొడక్షన్
2017 బాలకృష్ణుడు ఆధ్య - జూనియర్ రెజీనా కస్సాంద్ర తెలుగు 2017 నవంబరు 23 విడుదల
2017 ఆక్సిజన్ అవంతిక తెలుగు 2017 నవంబరు 30 విడుదల
2018 అజ్ఞాతవాసి సంపత్ కుమార్ కుమార్తె తెలుగు 2018 జనవరి 10 విడుదల
2021 స్పిన్ రెయా కుమార్ ఆంగ్లం
2021 భూమిక తమిళం \ తెలుగు
సినియర్ ఇయర్ ఆంగ్లం

పురస్కారాలు, గుర్తింపులు

[మార్చు]
  • TV9 ఆంధ్రప్రదేశ్ అందాల పోటీ విజేత (2010)
  • CA ఫాబ్లస్ ఫేసెస్ అండ్ సెంట్రల్ కోస్ట్ పాజీయంట్ విజేత (2011)
  • ATA స్టార్ డాన్సర్ అవార్డు (2012)[8]
  • ATA స్టార్ డాన్సర్ అవార్డు (2014)
  • సిలికాన్ వాలీ గాట్ టేలెంట్ అవార్డు (2014)
  • సరతోగా గాట్ టేలెంట్ పోటీ (2014)[9]
  • జీ టీవీ డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ నార్త్ అమెరికా (రెండవ స్థానం) (2014)[4]
  • బాటా బాటా 14వ వార్షిక యూట్ టాలెంట్ షో డాన్స్ విభాగం (2014)[10]
  • ETv స్టార్ మహిళ కాంటెస్ట్ విన్నర్ (2015)[11]
  • ETV కేష్ రియాలిటీ షో పార్టిసిపెంట్ (2015)[12][13]

ప్రదర్శనలు

[మార్చు]
  • బ్రహ్మోత్సవ ప్రమోషన్ సందర్భంగా మహేష్ బాబును ఇంటర్వ్యూ చేసింది. [14][15]
  • బ్రహ్మోత్సవ ప్రమోషన్ సందర్భంగా కాజల్ అగర్వాల్ ను ఇంటర్వ్యూ చేసింది [16]
  • సెంట్రో బ్రహ్మోత్సవ కలెక్షన్స్ లాంచ్ స్ందర్భంగా బ్రహ్మోత్సవ సినిమా ప్రమోట్ చేసింది. [17][18][19]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Avantika Vandanapu from Union City was selected as one of the top ten finalists out of more than 10,000 contestants". tricityvoice.com. 13 August 2014. Archived from the original on 2015-05-21. Retrieved 2018-04-16.
  2. 2.0 2.1 "మల్టీ టాలెంటెడ్". Sakshi. 2016-11-13. Retrieved 2018-05-21.
  3. "CALIFORNIA Diwali Festivals and Events Diwali is October 23, 2014". seecalifornia.com.
  4. 4.0 4.1 "9-Year-Old Girl Wins 'Dance India Dance' North America". indiawest.com. 14 August 2014. Archived from the original on 14 జూన్ 2016. Retrieved 16 ఏప్రిల్ 2018.
  5. "9-YEAR-OLD AVANTIKA WINS 'DANCE INDIA DANCE' N. AMERICA". indiajournal.com. 13 August 2014.
  6. "20th Festival of India Results" (PDF). fiaonline.org. Archived from the original (PDF) on 2015-05-19. Retrieved 2018-04-16.
  7. "special performance by Avantika Vandanapu 2nd place in "Dance India dance L'il Masters" and more". telugucommunitynews.com. Archived from the original on 2017-06-07. Retrieved 2018-04-16.
  8. "STAR Dancer (Solo Dancer Talent Search) ATA 2012 – Semifinalists". ataconference.org. Archived from the original on 2015-07-24. Retrieved 2018-04-16.
  9. "The Saratoga Cares Foundation named Megan Lopez and Avantika Vandanapu as the winners of the 2014". mercurynews.com.
  10. "BATA (Bay Area Telugu Association) 14th Annual Youth Talent Show Results". bata.org. Archived from the original on 2016-03-04. Retrieved 2018-04-16.
  11. "Star Mahila - 15th August 2015 - స్టార్ మహిళ – Full Episode". Etv.
  12. "ETV Cash 26th September, 2015 Promo". youtube.com.
  13. "ETV Cash 26th September, 2015 Full Episode". youtube.com.
  14. "Avantika Interviews Mahesh Babu for Brahmotsavam". youtube.com.
  15. "Avantika's Interview of Mahesh Babu gets Huge Applause". telugumoviephotos.com. Archived from the original on 2017-01-18. Retrieved 2018-04-16.
  16. "Avantika Interviews Kajal Aggarwal for Brahmotsavam". youtube.com.
  17. "Brahmotsavam Team at Centro Brahmotsavam Collections Launch in Hyderabad". metroindia.com.[permanent dead link]
  18. "Avantika Vandanapu: A rising star". www.deccanchronicle.com/. 2016-05-31. Retrieved 2018-04-03.
  19. "Chhota packet, bada dhamaka". The New Indian Express. Retrieved 2018-04-03.

బయటి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.