Jump to content

అవధానం హరిహరనాథశర్మ

వికీపీడియా నుండి
అవధానం హరిహరనాథశర్మ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 జనవరి 25
నియమించిన వారు ద్రౌపది ముర్ము

వ్యక్తిగత వివరాలు

జననం (1968-04-16) 1968 ఏప్రిల్ 16 (age 57)
కర్నూలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
తల్లిదండ్రులు రామచంద్రయ్య, సుబ్బమ్మ
పూర్వ విద్యార్థి వీఆర్‌ లా కాలేజీ, నెల్లూరు

జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. జస్టిస్ అవధానం హరిహరనాథశర్మను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలో 2025 జనవరి 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

హరిహరనాథశర్మ 1968 ఏప్రిల్‌ 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలులో అవధానం సుబ్బమ్మ, రామచంద్రయ్య దంపతులకు జన్మించాడు. ఆయన కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి, నెల్లూరు వీ.ఆర్‌. న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం పూర్తి చేసి 1994లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.

వృత్తి జీవితం

[మార్చు]

హరిహరనాథశర్మ కర్నూలు జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి తరువాత సీనియర్‌ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెలకువలు నేర్చుకొని 1998లో సొంతగా ప్రాక్టీసు ప్రారంభించాడు. ఆయన 2007 అక్టోబర్‌లో జిల్లా జడ్జిగా ఎంపికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో జడ్జి పని చేసి 2017-18లో అనంతరపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా (పీడీజే), 2020-22లో విశాఖ పీడీజేగా పని చేశాడు. హరిహరనాథశర్మ 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా నియమితుడై,[2] ఆ తరువాత 2023 నుండి ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

జస్టిస్ అవధానం హరిహరనాథశర్మను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలో 2025 జనవరి 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[3][4] ఆయన జనవరి 25న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Supreme Court Collegium approves appointment of two judges in Andhra Pradesh High Court" (in Indian English). The Hindu. 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
  2. "హైకోర్టు రిజిస్ట్రార్‌గా హరిహరనాథ శర్మ". Andhrajyothy. 18 September 2022. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
  3. "హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు". Andhrajyothy. 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
  4. "హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు". 16 January 2025. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
  5. "హైకోర్టు న్యాయమూర్తులుగా హరిహరనాథ శర్మ, లక్ష్మణరావు ప్రమాణం". Sakshi. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.