Jump to content

అవిదుర్ రెహమాన్

వికీపీడియా నుండి
అవిదుర్ రెహమాన్

పదవీ కాలం
2015 – ప్రస్తుతం
ముందు జాకీర్ హుస్సేన్ ఖాన్
నియోజకవర్గం అరారియా

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

అవిదుర్ రెహమాన్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు అరారియా శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అవిదుర్ రెహమాన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2015 బీహార్ శాసనసభ ఎన్నికలలో అరారియా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎల్‌జేపీ అభ్యర్థి అజయ్ కుమార్ ఝాపై 40,044 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2020 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీ (యు) అభ్యర్థి షగుఫ్తా అజీమ్ పై 47,936 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

అవిదుర్ రెహమాన్ 2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో అరారియా శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీ (యు) అభ్యర్థి షగుఫ్తా అజీమ్ పై 12,741 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  2. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "2025 Bihar Legislative Assembly Election Results: Araria". Election Commission of India. 14 November 2025. Archived from the original on 30 December 2025. Retrieved 7 January 2026.
  4. "Araria Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 29 December 2025. Retrieved 7 January 2026.