అవెంజర్స్: ఇన్ఫినిటి వార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవెంజర్స్: ఇన్ఫినిటి వార్
(2018 ఆంగ్లం సినిమా)
దర్శకత్వం అంథొని మరియు జొయ్ రుస్సో
నిర్మాణం వాల్ట్ డిస్నీ ఎంటర్తైన్మెంట్
రచన స్టీఫెన్ మెక్
విడుదల తేదీ 2018 (2018)
దేశం ప్రపంచమంతటా
భాష ఆంగ్లం
పెట్టుబడి INR2709 కోట్లు collection=13,546కోట్లు[1]

అవెంజర్స్: ఇన్ఫినిటి వార్ 2018లో విడుదల అయిన  అమెరికన్  సినిమా. ఇది మార్వెల్ చిత్రపరిశ్రమలోని అవెంజర్స్ లోని 3వ భాగము. మార్వెల్ సినిమా ప్రపంచంలో 19వ చిత్రం. దీనిని అంథోనీ మరియు జొయ్ రుస్సో దర్శకత్వం వహించగా, క్రిష్టొఫర్ మార్కస్ మరియు స్టీఫెన్ మెక్ ఫీలి రచించారు. అవెంజర్స్ మరియు  గార్డియన్స్  ఆఫ్ గాలక్సీ  కలిసి  థానోస్ ఇంఫినిటీ రాళ్ళను పొందకుండా ఆపడమే ఈ సినిమా.

సినిమా విశేషాలు[మార్చు]

అవెంజర్స్: ఇన్ఫినిటి వార్ 2018 ఏప్రిల్ 23న లాస్ ఏంజిల్స్ లో విడుదలైంది. అమెరికాలో 2018 ఏప్రిల్ 27న, IMAX and 3Dలో ప్రదర్శించారు. ఈ చిత్రం అనుకూల విమర్శలు పొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా $1.8 బిలియన్ సంపాదించి, నాలుగో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా అవతరించింది. అత్యంత వేగంగా $1 బిలియన్ చేరుకున్నది,  అలా చేయడానికి 11 రోజులు పట్టింది. దీని తరువాతి చిత్రం 2019 మే 3న విడుదల కాబోతుంది.[2]

కథ[మార్చు]

పవర్ ష్తోన్ ను జ్యాన్డర్ గ్రహంపై సొంతం చెసుకున్న తరువాత, థానోస్ మరియు అతని ధళం అయిన ఎబోని మావ్, కల్ల్ ఒబ్సిడియన్, ఫ్రాక్సిమా మిడ్నైట్ మరియు కార్వస్ గ్లయివ్ కలిసి ఆస్గార్డ్ నుంచి వస్తున్న అంతరిక్షనౌకను నాశనం చేసి లోకీని చంపేస్తారు. టెస్సరాక్ట్ నుంచి స్పేన్ షోన్ ను తీసుకుంటారు. హల్క్ ను హైండాల్ కాపడుతాడు. థార్ ను బంధించి ఆ నౌకను పేల్చేస్తారు. [N 1]

హల్క్ న్యూ యార్క్ నగరంలోని శాంక్టం శాంక్తోరంలో పడిపోయి, బ్రూస్ బ్యానర్ గా మారిపొతాడు. అతను స్టీఫెన్ స్త్రేన్జ్ మరియు వాంగ్ లకు గురించి థనోస్ సగం విశ్వాన్ని నాశనం చెయ్యడానికి ఇన్ఫినిటి రాళ్ళ కోసం భూమి మీదకు వస్తున్నడు అని చెప్తాడు. స్త్రేన్జ్ టోని ష్టార్క్ మరియు ష్టీవ్ రాఝెర్స్ కు ఈ విషయాన్ని చెప్తాడు. ఇదే సమయంలో మావ్ స్త్రేన్జ్ ను భందిస్తాడు. ష్టార్క్ మరియు పీటర్ పార్కర్ మావ్ అంతరిక్షనౌకలోకి మావ్ కి తెలియకుండా వెళ్తారు.

స్కాట్లాండ్ లో, అర్ధరాత్రి గ్లయివ్ మరియు ఫ్రాక్సిమా మాటువేసి వాండా మరియు విజన్ పై మైండ్ స్టోన్ ను తీసుకునే క్రమంలో దాడి చేస్తారు. వీరిని రోజర్స్, బ్లాక్ విడో, మరియు సామ్ విల్సన్  కాపాడుతారు. విజన్ నుండి ఆ రాయిని తొలగించడానికి వారు వఖాండాకు వెళ్తారు.

గ్గర్డియన్స్ ఆఫ్ గాలక్సీ థార్ ను కాపాడుతారు. రాకెట్, గ్రూట్ థార్ తో కలిసి నిడవెల్లిర్ కు వెళ్తారు.పీటర్ క్విల్, గమొరా, డ్రాక్స్ మరియు మాంటిస్ నోవేర్ కు వెళ్తారు అక్కడ అప్పటిక రియాలిటీ ష్తోన్ ను సంపాదించిన థనోస్ ఉంతాడు. అతను తన దత్తతు పుత్రికయిన గమోరాను అపహరించి సోల్ ష్టోన్ కోసం వార్మిర్ కు వెల్తారు, ఆ రాయి కోసం తను ప్రేమించెవాళ్ళను చంపాలి అని తెలియంగానె, అయిష్టంగానే గమోరాను చంపేసి ఆ రాయిని సంపాదిస్తాడు.

ష్టార్క్ మరియు పార్కర్ కలిసి మావ్ ని చంపేస్తారు. వారు ఆహ్ అంతరిక్షనౌకతో థానోస్ స్వగృహం అయిన టైటాన్ పై దిగుతారు. అక్కడ థానోస్ తో యుద్ధం చేస్తారు, కాని వారు అవలీలగా ఓడిపోయి టైం ష్టోన్ ను చెజార్చుకుంటారు.

వఖాండలో షురి విజన్ నుండి ఆ రాయిని విడదీయడానికి ప్రయత్నిస్తుంతుంది. టిచల్లా మరియు థానోన్ సైన్యాల మద్య యుద్ధం జరుగుతూంటుంది. అంతలో రాకెట్, గ్రూట్ తో కలిసి థార్ తన కొత్త ఆయుధాన్ని తీసుకుని వస్తాడు. ఆ యుద్ధంలో ఒబ్సిడియన్, మిడ్నైట్ మరియు గ్లయివ్ చనిపోతారు. వాండా మైండ్ ష్టొన్ ను నాశనం చెయడానికి విజన్ ను చంపేసినా, థానోస్ టైం ష్తోన్ సాయంతో దానిని మళ్ళీ పొందుతాడు.

థోర్ థనోస్ ను తీవ్రంగా గాయాపరుస్తాడు, కానీ థనోస్ అన్ని ఇన్ఫినిటీ రాళ్ళతో ఉన్న గాంట్లెట్ ను ప్రయోగించి టెలిపోర్ట్ అయిపోతాడు. దానితో సగం విశ్వం నాశనం అయిపొతుంది. బర్న్స్, టిచల్లా, గ్రూట్, వాండా, విల్సన్, మాంటిస్, డ్రాక్స్, క్విల్, స్త్రేన్జ్, మరియు పార్కర్ చనిపోతారు. స్టార్క్ మరియు నెబ్యులా టైటాన్ మీద ఉండగా, బ్యానర్, ఇం బాకు, ఒకోయ్, రోడ్స్, రాకెట్, రోజర్స్, రోమనాఫ్, మరియు థోర్ వఖాండాలో ఉంటారు. ఇంతలో, థనోస్ మరొక గ్రహం మీద కోలుకుంటూంటాడు.[3]

సత్కారాలు[మార్చు]

అవెంజర్స్: ఇన్ఫినిటి వార్ మూడు MTV మూవీ & TV అవార్డ్లు తో, సహా ఉత్తమ చిత్రం, ఉత్తమ విలన్ (జోష్ బ్రోలిన్), మరియు ఉత్తమ ఫైట్ (స్కార్లెట్ జోహన్సన్, దనై గురిరా, ఎలిజబెథ్ ఒస్లన్ vs. క్యారీ కూన్).[4]

సీక్వెల్[మార్చు]

ఒక శీర్షికలేని సీక్వెల్  2019 మే 3న తెరకెక్కనుంది, దానికి మళ్ళీ రుస్సొస్ దర్శకత్వం వహిస్తున్నారు, మరియు మార్కస్ మరియు మెక్ ఫీలి మరోసారి రచన, స్క్రీన్ప్లే చేయబోతున్నారు.

మూలాలు[మార్చు]

  1. "'Avengers: Infinity War' Topping $1.8 Billion On Fourth Weekend". Unknown parameter |accessdaye= ignored (help); Cite web requires |website= (help)
  2. "Avengers Infinty war Boxofficemojo". Retrieved 27 May 2018. Cite web requires |website= (help)
  3. "Ininity war Story". Retrieved 27 May 2018. Cite web requires |website= (help)
  4. "Infinty war Awards". Retrieved 27 May 2018. Cite web requires |website= (help)
  1. As depicted in the 2017 film Thor: Ragnarok.