అశుతోష్ ముఖర్జీ
అశుతోష్ ముఖర్జీ | |
|---|---|
అశుతోష్ ముఖర్జీ | |
| జననం | 1864 జూన్ 29 కోల్‌కత |
| మరణం | 1924 మే 25 (వయసు: 59) పాట్నా |
| సమాథి స్థలం | రుస్సా రోడ్, కోల్‌కత (ఇప్పుడు 77 అశుతోష్ ముఖర్జీ రోడ్డు, కోల్‌కత- 700025) |
| వృత్తి | విద్యావేత్త , కోల్‌కత విశ్వవిద్యాలయం రెండవ వైస్ ఛాన్స్‌లర్ |
| జాతీయత | భారతీయుడు |
| పూర్వ విద్యార్థి | కోల్‌కత విశ్వవిద్యాలయం |
| సాహిత్య ప్రక్రియ | విద్యావేత్త |
| సాహిత్య ఉద్యమం | బెంగాల్ సాంస్కృతిక విప్లవం |
| ప్రసిద్ధ పురస్కారాలు | ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా |
| పిల్లలు | శ్యామ ప్రసాద్ ముఖర్జీ |
అశుతోష్ ముఖర్జీ (జూన్ 29, 1864 - మే 25, 1924) బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త. గణితం, సైన్సు, న్యాయశాస్త్రం లాంటి పలు రంగాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త కూడా.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]బాల్యం నుంచే అశుతోష్ చదువులో మంచి ప్రతిభ కనబరచాడు. సౌత్ సబర్బన్ స్కూల్లో చేరి 1879లో కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క మెట్రిక్యులేషన్ పరీక్షలో రెండవ స్థానంలో నిలిచాడు. తరువాత ప్రెసిడెన్సీ కళాశాలలో చేరి 1881లో F.A పరీక్షలో మూడవ స్థానంలో నిలిచాడు. 1884లో బి.ఏ డిగ్రీలో యూనివర్శిటీలోనే ప్రథముడిగా ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత సంవత్సరమే గణితంలో M.A మొదటి స్థానంలో నిలిచాడు. తరువాత సైన్సులో M.A కొరకు, ప్రేమ్‌చంద్-రాయ్‌చంద్ ఉపకార వేతనం కొరకు మళ్ళీ పరీక్ష కోసం సిద్ధమై వయసు చాలక వాటిని మద్యలోనే వదిలేశాడు. అది అలా ఉండగానే సిటీ కాలేజీలో లా చదివి దానికి సంబంధించిన మూడు పరీక్షల్లో ప్రథముడిగా నిలిచాడు.
వృత్తి
[మార్చు]అశుతోష్ గణితంలో ప్రతిభావంతుడైనప్పటికీ కలకత్తా విశ్వవిద్యాలయంలో నిధులు చాలకపోవడం వలన (సంవత్సరానికి 9000 రూపాయలు) ఆయన్ను ఆచార్యుడిగా నియమించలేక పోయారు. దాంతో ఆయన 1888 లో న్యాయవాద వృత్తి చేపట్టాడు. 1904 లో కలకత్తా హైకోర్టుకు న్యాయమూర్తి అయ్యాడు. 1906 నుంచి 1914 వరకు కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్‌లర్ గా వ్యవహరించాడు. ఆయన నేతృత్వంలో కలకత్తా విశ్వవిద్యాలయం అధునాతన సౌకర్యాలను సమకూర్చుకుని ఇతర భారతీయ విశ్వవిద్యాలయాలకు ఆదర్శంగా నిలిచింది.[1]
మరణం
[మార్చు]1924 మే 25 న అకస్మాత్తుగా మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Writing the History of Mathematics - Its Historical Development edited by Joseph W. Dauben, Christoph Page 313
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- 1864 జననాలు
- 1924 మరణాలు
- సాహితీకారులు
- సంఘసంస్కర్తలు
- తత్వవేత్తలు
- శాస్త్రవేత్తలు
- భారతీయ శాస్త్రవేత్తలు
- కోల్కతా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు