Jump to content

అశోక్‌నగర్ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 24°34′48″N 77°43′48″E / 24.58000°N 77.73000°E / 24.58000; 77.73000
వికీపీడియా నుండి
అశోక్‌నగర్ జిల్లా
మధ్యప్రదేశ్ జిల్లా
అశోక్ నగర్ లో బెత్వా నది
అశోక్ నగర్ లో బెత్వా నది
మధ్య ప్రదేశ్ లో జిల్లా ఉనికి
మధ్య ప్రదేశ్ లో జిల్లా ఉనికి
Coordinates (Ashoknagar): 24°34′48″N 77°43′48″E / 24.58000°N 77.73000°E / 24.58000; 77.73000
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజన్గ్వాలియర్ డివిజన్
ముఖ్య పట్టణంఅశోక్ నగర్
Government
 • Lok Sabha constituenciesGuna
విస్తీర్ణం
 • Total4,673.94 కి.మీ2 (1,804.62 చ. మై)
జనాభా
 (2011)
 • Total8,45,071
 • జనసాంద్రత180/కి.మీ2 (470/చ. మై.)
Demographics
 • Literacy67.90
 • Sex ratio900
Time zoneUTC+05:30 (IST)

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అశోక్‌నగర్ జిల్లా (హిందీ:अशोकनगर जिला) ఒకటి. అశోక్‌నగర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. అశోక్‌నగర్ జిల్లా 2003లో రూపొందించబడింది.

భౌగోళికం

[మార్చు]

జిల్లా వైశాల్యం 4673.94 చ.కి.మీ.

సరిహద్దులు

[మార్చు]

జిల్లా సరిహద్దులలో బెత్వా నది ప్రవహిస్తుంది. బెత్వానది జిల్లాను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లలిత్‌పూర్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాగర్ జిల్లా ఉన్నాయి. దక్షిణ సరిహద్దులలో విదిశా జిల్లా, పశ్చిమ సరిహద్దులలో సింధ్ నది ప్రవహిస్తుంది. సింధ్ నదికి ఆవలి తీరంలో గునా జిల్లా ఉంది. ఉత్తర సరిహద్దులలో శివ్‌పురి జిల్లా ఉంది. [1]

చరిత్ర

[మార్చు]

2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 688,920. జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి (అశోక్‌నగర్, చందేరి, ఇస్సాగర్, ముంగవొలి, షాదొరా). 2003 ఆగస్టు 15 న గునా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి అశోక్‌నగర్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[1] అశోక్‌నగర్‌కు 15కి.మీ దూరంలో ఉన్న షాదొరా పట్టణానికి 2008 సెప్టెంబరులో తాలూకా అంతస్తు ఇవ్వబడింది.

మండలాల వారీగా వివరణ

[మార్చు]
బ్లాక్ యొక్క పేరు స్క్వేర్ KM ఏరియా జనాభా
గాంధారి 1035,50 130532
అశోక్‌నగర్ 1237,48 227404
ముంగయోలి 1229,04 182497
ఇస్సాగర్ 1078,35 138160
షహ్దొర -------- --------

[1]

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

అశోక్‌నగర్ జిల్లా ప్రాతం ఇసాగర్ రాజాస్థానంలో భాగం. దీనిని అర్పిత్ భార్గవ పాలించాడు. ఇసాగర్ రాజాస్థానం గ్వాలియర్ సామ్రాజ్యంలో భాగం. ఉజ్జయిని విజయానంతరం అశోకచక్రవర్తి ఇక్కడ ఉన్న పచ్చర్ భూమిలో కొంతకాలం విశ్రమించాడు కనుక దీనికి అశోక్‌నగర్ అని పేరువచ్చింది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 67,705.[2]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 181
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి. 900:1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 67.90%
జాతియ సరాసరి (72%) కంటే.
పురుషులఅక్షరాస్యత 80.22 %
స్త్రీల అక్షరాస్యత 54.18 %
అక్షరాశ్యుల సంఖ్య 480,957
పురుషుల అక్షరాష్యుల సంఖ్య 299,409
స్త్రీల అక్షరాష్యుల సంఖ్య 181,548
4,674చ.కి.మీ

2001 గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 844,979
పురుషుల సంఖ్య 444,651
స్త్రీల సంఖ్య 400,328
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 147
1991- 2001 కుటుంబనియంత్రణ శాతం. 22.65%
స్త్రీ పురుష నిష్పత్తి. 879:1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 62.26
జాతియ సరాసరి (72%) కంటే.
పురుషుల అక్షరాస్యత 77.01%
స్త్రీల అక్షరాస్యత 45.24%
జిల్లా వైశాల్యం 344,760 చి.కి.మీ

ప్రత్యేకత

[మార్చు]

అశోక్‌నగర్‌కు 35 కి.మీ దూరంలో కరిలామాతా మందిర్ ఉంది. ఇది లకుశుల జన్మస్థలమని విశ్వసిస్థున్నారు. రంగపంచమి నాడు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తుంటారు. ఉత్సవంలో బెద్ని స్త్రీలు రాయ్ నృత్యం ప్రదర్శిస్తారు. త్రివేణి వద్ద ఉన్న తుమెన్‌ కూడా ప్రఖ్యాత యాత్రా స్థలాలలో ఒకటి. ఇక్కడ మాతా విద్యావాసిని ఆలయం ఉంది. జిల్లాలో మతప్రాముఖ్యత కలిగిన పలు ప్రదేశాలు ఉన్నాయి.

చందేర్

[మార్చు]

అశోక్‌నగర్‌లోని చందేర్ ప్రబల చారిత్రక, పర్యాటక ప్రదేశాలలో ఒకటి. చందేరి ప్రజల ప్రధానవృత్తి హస్తకళలు. చందేరి చీరలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. స్వయంగా చేసిన మగ్గం (ఖత్కా) మీద పత్తి, పట్టు నూలుతో చీరలు నేస్తారు.

ఆనందపూర్

[మార్చు]

ఆనందపూర్‌లో " శ్రీ అద్వైత పరమహంస శాఖకు" కేంద్రం ఉంది. అద్వైత పరమహంస శాఖకు చెందిన శిష్యులు గురువుల ఆశీర్వాదం పొందడానికి ప్రపంచం అంతటి నుండి ఇక్కడకు సంవత్సరానికి 2 మార్లు ఇక్కడకు వస్తుంటారు.

కద్వయా

[మార్చు]

కద్వయా గ్రామంలో పురాతనమైన శివాలయం, గర్హి ఆలయం, మాతా మందిరం ఉన్నాయి.

పర్యాటకం

[మార్చు]

చందేరి

[మార్చు]

చందేరి కోట పట్టణానికి 71మీటర్ల ఎత్తున ఉన్న కొండ మీద నిర్మిచబడ్జింది. కోటగోడలు చందేరీని పాలించిన ముస్లిం పాలకులు నిర్మించారు. కోటకు చేరుకోవడానికి 3 ద్వారాలు ఉన్నాయి. పైన ఉన్న ద్వారాన్ని హవా పౌర్ దిగువ ద్వారాన్ని కుని దర్వాజా (రక్తద్వారం) అంటారు. ఇక్కడ నేరస్తులను బురుజుల నుండి కిందకు త్రోసివేస్తారు వారి వారిశరీరాలు రక్తసిక్తమై ముక్కలు ముక్కలుగా మారి మరస్తారు కనుక దీనిని రక్తద్వారం అంటారు. కోటలో రెండు శిథిల రాజభవనాలు (హవా, నౌఖండా) మాత్రమే ఉన్నాయి. వీటిని చందేలాను పాలించిన రాజప్రతినిధులు నిర్మించారు. కోటకు ఉత్తరసరిహద్దులో ఉన్న గెస్ట్‌హౌస్ నుండి దృశ్యం అందగా కనిపిస్తుంది. ఇక్కడి నుండి కింద ఉన్న గ్రామాలు అందగా కనిపిస్తాయి.

చందేరి కోట

[మార్చు]

కోటకు ఆగ్నేయంలో ఉన్న ద్వారాన్ని కట్టి - ఘట్టి కొండవైపు ఉంటుంది. ఇది 59 మీ పొడవు, 12 మీ వెడల్పు ఉంది. మధ్యభాగంలో 24 మీ ఎత్తు ఉంటుంది. మద్యలో ద్వారంలా రాయి ఆర్చిలాగా మలచబడి ఉంది.

కౌషక్ మహల్

[మార్చు]

చందేరీలోని కౌషక్ మహల్‌ను " తవరిఖ్ - ఇ - ఫెరిష్ట " అంటారు. చందేరీ గుండా మాల్వా పాలకుడు మొహమ్మద్ షాహ్ ఖిల్జీ ప్రయాణించాడు. ఖిల్జీ ఈ ప్రాంతంలో ఏడు అంతస్తుల భవనం నిర్మించమని ఆఙాపించాడు ఇచ్చాడు. ఈ మహాతర భవనం ప్రస్తుతం సగంశుధిలమై ఉంది. పట్టణానికి దక్షిణ, తూర్పు, ఉత్తర దిశలలో చక్కగా నిర్వహించబడుతున్న రామ్‌నగర్, పంచనగర్, సింఘ్‌పూర్ రాజభవనాలు ఉన్నాయి. వీటిని 18వ శతాబ్దంలో చందేరీని పాలించిన బుండేలా రాజప్రతినిధులు పాలించారు.

అనంద్‌పూర్

[మార్చు]

శ్రీ అనంద్‌పూర్సాహిబ్ ఇది మతప్రాముఖ్యత కలిగిన అనదమైన ప్రదేశం. ఇది జిల్లాకేంద్రానికి 30 కి.మీ దూరంలో ఇసాగర్ తాలూకాలో ఉంది. ఆధ్వైతే మఠాన్ని శ్రీ ఆనంద్‌జీ స్థాపించాడు. ఆయనను మహరాజ్ పరమహంస దయాలజీ అని కూడా అంటారు. ఈ ప్రాంతం పచ్చదనం, సహజత్వం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ ఆశ్రమం విద్యాచల పర్వతశ్రేణిలో ఉంది. కలుషితరహితమైన సౌందర్యానికి ఆకర్షణీయమైన నిర్మాణవైభవానికి ఇది ప్రతీక. ఆనంద్‌పూర్ అభివృద్ధి 1938 నుండి ఆరంభమై 1964 వరకూ కొనసాగింది. ఈ సంస్థ " శ్రీ ఆనంద్‌పూర్ ట్రస్ట్ "గా 1954 ఏప్రెల్ 22 న స్థాపించబడింది. " శ్రీ ఫోర్త్, శ్రీ ఫిఫ్త్ " ఈ ట్రస్ట్ అధికంగా అభివృద్ధి చెందింది.

  • శ్రీ ఆనంద్‌ శాంతి భవన్ ప్రధానభాగం స్వచ్చమైన పాలరాతితో నిర్మించబడింది. సత్సంగ్ భవన్ చాలా విశాలమైన ఆకర్షణీయమైన భవనం. భక్తులకు అది ప్రధాన ఆకర్షణ. శరదృతువు సమయంలో ఈ ఆశ్రమంలోని తోట వర్ణవర్ణాల పూలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
  • దూర ప్రాంతాల నుండి పర్యాటకుల కొరకు రెస్ట్‌హౌసులు లభ్యమౌతుంటాయి. ఆశ్రమంలో భోజనం సౌకర్యం అంబాటులో ఉంది. ఇక్కడ ఆసుపత్రి, స్కూల్, పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి.
  • ప్రఖ్యాత టి.వి ప్రదర్శన " లోగ్ కహతే హై " ఈ ప్రాంతంలో చిత్రీకరించబడింది.

ఇస్సాగర్

[మార్చు]

అశోక్‌నగర్ తాలూకాలో కద్వాయ ఒక గ్రామంలో పలు ఆలయాలు ఉన్నాయి. వీటిలో 10వ శతాబ్దంలోకచ్చపఘట శైలి ఆర్కిటెక్చర్ ఆలయం ఒకటి. ఇందులో గర్భగృహం, అంతరాలయం, మండపం ఉన్నాయి. 1067, 1105 లలో భక్తులు అధికంగా అధికంగా ఉన్నారు. మరొక ఆకర్షణీయమైన ఆలయాలలో ఒకటైన కద్వా ఆలయం (చందల్ మఠం) పురాతనమైన ఆలయాలలో ఒకటిగా గుర్తినబడుతుంది.ఈ ఆలయంలో ఒక శిథిలమైన మఠం ఉంది. ఈ మఠంలో పురాతన కాలంలో శైవసిద్ధాంత కారుడు మట్టమౌర్య నివసించాడని పురాతన ఆధారాలద్వారా తెలుస్తుంది. అక్బర్ పరిపాలనా కాలంలో అగ్రా సుబాహ్‌కు చెందిన గ్వాలియర్ సర్కార్‌లోని మహల్‌కు రాజధానిగా ఉంది.

తుబోంజ్ సిధా క్షేత్ర

[మార్చు]

తుబోంజ్ సిధా క్షేత్రలో ప్రశాంతమైన 26 ఆలయాలతో ఉన్న ఆలయసమూహం ఉంది. తువోంజి ప్రముఖ వ్యాపార వేత్త శ్రీ పదాహ్ కాలంలో ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది. శ్రీ పదాహ్ ఆలయంలో లోహపాత్రను వదిలి వెళ్ళాడని మరుసటి రోజు అది వెండి పాత్రగా మారిందని ఒక కథనం ప్రచారంలో ఉంది. 26 అందమైన ఆలయాలలో పలు దైవాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. వీటిలో 15 ఆలయాలు ప్రత్యేకమౌనవి. 28 అడుగుల అదినాధుని నిలబడిన విగ్రహాన్ని 1672లో విక్రం సంవత్ ప్రతిష్ఠించాడు.

అద్భుతాలు

[మార్చు]

ఈ ఆలయంలో రాత్రివేళలో పలువాద్యాలతో భజగీతాలు వినిపిస్తుంటాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అదినాధుని విగ్రహం ప్రతిష్ఠించడానికి పలువురు ప్రయత్నించినప్పటికీ నిలబెట్టడానికి సాధ్యం కాలేదని ఆలయ శిల్పులలో పెద్ద ఆరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయనకు ఒక కల వచ్చుందని కలలో అదునాధుని విగ్రహం ప్రయిష్టించబడి ఉండం కనిపిందింది. మతునాడు ఆలయానికి వెళ్ళి చూసినప్పుడు విగ్రహం ప్రతిష్ఠితమై ఉందని ఒక కథనం ప్రచారంలో ఉంది.

పస్వనాథ్ ఆలయం

[మార్చు]

ఆలయంలో గంభీరమైన 15 అడుగుల పస్వనాథ్ విగ్రహం ఉంది. దీనిని 23వ తీర్ధంకర్ 1864లో స్థాపించాడు. విగ్రం రెండువైపులా ఆకర్షణీయంగా చెక్కబడిన రెండు విభిన్నమైన సర్పాలు ఉన్నాయి.

జైనఆలయాలు

[మార్చు]

ఈ జైన ఆలయంలో శాంతినాధుని ఆలయంల 16వ తీర్ధంకర్శాంతినాధుని 18 అడుగుల విగ్రహం ఉంది. 2వ తీర్ధంకర్ అజిత్‌నాథ్ ఆలయం స్థాపినబడింది. ఇక్కడ 18 అడుగుల అజిత్‌నాథ్ విగ్రహం ఉంది. దీనిని 1874లో శ్రీ సవసింగ్ చందేరి ప్రయిష్ఠించాడు. చంద్రప్రభు (8వ తీర్ధంకర్) జైన ఆలయం కొత్తగా నిర్మించబడింది. ఆలయంలో పద్మాసనంలో కూర్చున్న 1.5 అడుగుల విగ్రహం ఉంది. ఇక్కడ ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. పలుపురాతన శిల్పాలను భద్రపరచిన మ్యూజియం ఉంది. ఇక్కడ 12 అడుగుల అనదమైన నింబస్ విగ్రహం ఉంది.

ఉపాధి

[మార్చు]

జిల్లాలో ప్రజలు అధికంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పలువురు ధాన్య వ్యాపారులు ఉన్నారు. వస్త్రాలు, చిల్లవ్యాపారం కూడా అధికంగానే ఉంది.

ఆర్థికవేత్తలకు , బ్యాంకులు

[మార్చు]
  1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (మండి రోడ్)
  2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (స్టేషను రోడ్)
  3. యాక్సిస్ బ్యాంక్ (బిలాల మిల్ రోడ్)
  4. బ్యాంక్ ఆఫ్ ఇండియా (రఘువంశి గలి)
  5. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (బిలాల మిల్ రోడ్)
  6. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (స్టేషను రోడ్)
  7. ఓరియంటల్ బ్యాంక్ అఫ్ కామర్స్ (బిలాల మిల్ రోడ్)
  8. జి ఐ యల్ Sehkari బ్యాంక్ (గల్లా మండి)
  9. ఐసిఐసిఐ బ్యాంక్ (బిలాల రోడ్)
  10. హెచ్డిఎఫ్సి బ్యాంక్ (బైపాస్ వంతెన)
  11. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (మండి రోడ్)
  12. మధ్య భారత్ గ్రామీణ బ్యాంకు (Sarafa బజార్)
  13. మధ్య భారత్ గ్రామీణ బ్యాంకు (పాత బస్ స్టాండ్)
  14. బ్యాంక్ ఆఫ్ బరోడా (బిలాల మిల్లు రహదారి)

సంస్థలు

[మార్చు]

అశోక్‌నగర్ అనేక ఇంగ్లీష్, హిందీ మాధ్యమ పాఠశాలలు ఉన్నాయి:

పాఠశాలలు

[మార్చు]
  • మిలన్ పబ్లిక్ స్కూల్
  • సెయింట్ థామస్ హయ్యర్ సెకండరీ స్కూల్
  • వర్ధమాన్ హయ్యర్ సెకండరీ స్కూల్
  • శ్రీ వివేకానంద శిశు మందిర్ హై స్కూల్
  • సరస్వతి విద్యా మందిర్ హయర్ సెకండరీ స్కూల్
  • శివపురి పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్
  • సంస్కృతి కిడ్స్
  • సంస్కార్ అకాడమీ
  • హలో పిల్లలు-కించిన్
  • బచ్పన్ ఒక పాఠశాల నాటకంలో
  • సిటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల
  • తారా సదన్ sr క్షణ పాఠశాల

కళాశాలలు

[మార్చు]
  • ప్రభుత్వ. పాలిటెక్నిక్ కాలేజ్, అశోక్‌నగర్
  • ప్రభుత్వ. నెహ్రూ డిగ్రీ కళాశాల, అశోక్‌నగర్
  • వర్ధమాన్ బాలికల డిగ్రీ కళాశాల, అశోక్‌నగర్
  • ఇండియన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ & మేనేజ్మెంట్, అశోక్‌నగర్
  • శ్రీ సాయిబాబా కాలేజ్, అశోక్‌నగర్
  • శ్రీ ద్వారక ప్రసాద్ కాలేజ్, అశోక్‌నగర్
  • ముస్కన్ పబ్లిక్ స్కూల్, అశోక్‌నగర్

ఇతర మేజర్ దుకాణాలు

[మార్చు]
  • సునీల్ పెయింట్స్, స్టేషను రోడ్ (http://goo.gl/maps/Bxgpc)
  • లాలీ చీరలు
  • మహావీర్ స్వీట్స్,వివేక్ టాకీస్ సమీపంలో
  • టాప్ ఎన్ టౌన్, కె.పి స్వీట్స్, బిలాల్ మిల్ రోడ్
  • సునీల్ బుక్ స్టోర్, బిలాల్ మిల్ రోడ్
  • మదర్ డైరీ, ఊరేగింపు రోడ్
  • సప్న స్వీట్స్, కొత్త బస్ స్టాండ్
  • వడిలాల్, మొహ్రి ఐస్ క్రీమ్స్
  • కృష్ణ పాల, లాంబర్ దార్ గలి విదిష రోడ్
  • షొబిత్ ఏజెన్సీలు, రైల్వే క్రాసింగ్ సమీపంలో పౌర ఆసుపత్రి చదరపు.
  • శైలి స్వీట్లు, స్టేషను రోడ్
  • సాధనా స్వీట్లు, పెద్ది రోడ్

భౌగోళికం

[మార్చు]

అశోక్‌నగర్ సముద్రమట్టానికి 507 మీ ఎత్తున ఉంది. ఇది వ్యవసాయ అనుకూలమైన పీఠభూమి. ఇది దక్కన్ పీఠభూమిలో భాగం. ఇది 60-68 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఏర్పడిన పీఠభూమి అని భావిస్తున్నారు. ఈ భూభాగంలో శిలాధూళితో కూడిన నల్లరేగడి మట్టి ఉంది. అగ్నిపర్వత బంకమట్టితో కూడిన భూమిలో ఇనుము శాతం అధికంగా ఉంటుంది. భూమిలో ఇసుక శాతం అధికంగా ఉన్నందున నీటిని తక్కువగా పీల్చుకుంటుంది.

వాతావరణం

[మార్చు]
విషయ వివరణ వాతావరణ వివరణ
సీజన్లు వేసవి, వర్షాకాలం, శితాకాలం
శీతాకాలం అక్టోబరు - సెప్టెంబరు
శీతాకాల ఉష్ణోగ్రత 15° సెల్షియస్ - 20° సెల్షియస్
శీతాకాలం కనిష్ఠ ఉష్ణోగ్రత 5 ° సెల్షియస్
వర్షాకాలం జూన్ మధ్య భాగం - సెప్టెంబరు వరకు (60-90 రోజులు)
వేసని కాలం మార్చి మధ్య - మే
వేసవి కాలం గరిష్ఠ ఉష్ణోగ్రత 46 ° సెల్షియస్
వేసవి కాలం సరాసరి ఉష్ణోగ్రత 35 ° సెల్షియస్
అశోక్‌నగర్ పట్టణ వర్షపాతం 140 మి.మీ
జిల్లా వర్షపాతం పశ్చిమం 100 మి.మీ తూర్పు 165 మి.మీ
వర్షాకాల ఉష్ణోగ్రత 30 ° సెల్షియస్ - 20° సెల్షియస్

వాతావరణం

[మార్చు]

అశోక్‌నగర్ జిల్లాలో ఉప ఉష్ణ మండల శీతోష్ణస్థితి నెలకొని ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 47° సెల్షియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 4° సెల్షియస్. చాలినంత వర్షపాతం ఉంది. కొన్ని సార్లు వర్షపాతం తక్కువగా ఉంటుంది.

మర్మం

[మార్చు]

అశోక్‌నగర్ సంబంధిత మర్మం ఒకటి ప్రచారంలో ఉంది. అశోక్‌నగర్ సందర్శించిన ముఖ్యమంత్రులు త్వరలో పదవీచ్యుతులౌతారన్న విశ్వాసం ప్రజలలో బలంగా నాటుకుని ఉంది. వీరిలో శ్రీ ద్వారకా ప్రసాద్ మిశ్రా, శ్రీ సుందర్లాల్ పత్వ, శ్రీ అర్జున్ సింగ్, శ్రీ దిగ్విజయ్ సింగ్ (రాజకీయవేత్త), శ్రీమతి ఉమా భారతి, శ్రీ బాబూలాల్ గౌర్,, లాలూ ప్రసాద్ యాదవ్ వంటివారు ముఖులు.

సమస్యలు

[మార్చు]

నగరం మధ్యనుండి రైలు మార్గం నిర్మించబడడం ఒక పెద్ద సమస్యగా మారింది. జనసంఖ్య, వాహనాల అభివృద్ధి కారణంగా ప్రజలు రైలు పట్టాలు మారడానికి ఇబ్బందులు పడుతున్నారు. 1995లో ఒక వంతెన నిర్మించినప్పటికీ ఇది రైల్వేక్రాసింగ్‌కు దూరంగా ఉన్నందున ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. జ్రైలు గేటు మూతపడినప్పటికీ ప్రజలు పట్టాలు దాటడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. 2005లో అండర్ బ్రిడిజ్ ప్రతిపాదించినప్పటికీ ఇకా నిర్మించబడలేదు. ప్రస్తుత మంత్రి నుండి చిన్న వంతెన నిర్మాణానికి ఆదేశం జారీ అయింది. ఈ క్రాసింగ్ వద్ద పలు ప్రమాదాలు సంభవించాయి. 2010 ప్రజలు మొదటిసారిగా నీటి సమస్యను ఎదుర్కొన్నారు. వర్షాభావం, అమై సరసు నుండి వ్యవసాయ అవసరాలకు అధికంగా నీరు వాడినందువలన నీటి సమస్య ఎదురైంది.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

అశోక్‌నగర్‌లో చక్కని రవాణా సౌకర్యం ఉంది. ఇది రాష్ట్ర, దేశీయ ప్రధాన నగరాలతో రహదారి, రైలుమార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది.

వాయుమార్గం

[మార్చు]

జిల్లాకు సమీపంలోని విమానాశ్రయం:- గ్వాలియర్ విమానాశ్రయం.

రైలుమార్గం

[మార్చు]

ఇది పశ్చిమ మధ్య రైల్వేకి చెందిన కోట - బినా రైలు మార్గంలో ఉంది. జిల్లాలో మొత్తం రైలు మార్గం పొడవు 141 కి.మీ.కోట, ఉజ్జయిని, ఇండోర్, జోధ్‌పూర్,జైపూర్, అహమ్మదాబాద్, భోపాల్, సాగర్, దమోహ్, జబల్‌పూర్, వారణాసి, గోరక్‌పూర్, ఢిల్లీ, డెహరాడూన్, దర్భంగా, గ్వాలియర్ లకు రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

రహదారి

[మార్చు]

అశోక్‌నగర్ రాష్ట్ర రహదారి మార్గంలో ఉంది. జిల్లా నుండి పొరుగున ఉన్న గునా, విదిశ, శివ్‌పురి జిల్లాలకు చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది. జిల్లాలోని రాష్ట్ర రహదారి పొడవు 82.20 కి.మీ.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Ashoknagar district". District administration. Archived from the original on 2009-09-04. Retrieved 2010-04-15.
  2. "Population of Madhya Pradesh (Census 2001)" (PDF). City Managers' Association Madhya Pradesh. Archived from the original (PDF) on 2009-12-11. Retrieved 2010-04-14.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వెలుపలి లింకులు

[మార్చు]