అశోక్ కుమార్ దోహరే
| అశోక్ కుమార్ దోహరే | |||
| పదవీ కాలం 2014 సెప్టెంబర్ 1 – 2019 మే 23 | |||
| ముందు | ప్రేమదాస్ కతేరియా | ||
|---|---|---|---|
| తరువాత | రాంశంకర్ కఠారియా | ||
| నియోజకవర్గం | ఇటావా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1970 సెప్టెంబరు 23 రాంపుర , ఉత్తర ప్రదేశ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | శశిబాల దోహ్రే | ||
| సంతానం | 4 | ||
| నివాసం | రాంపుర , ఉత్తర ప్రదేశ్ | ||
| పూర్వ విద్యార్థి | కెకె మహావిద్యాలయ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
అశోక్ కుమార్ దోహరే (జననం 23 సెప్టెంబర్ 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇటావా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
రాజకీయ జీవితం
[మార్చు]అశోక్ కుమార్ దోహరే గ్రామ పంచాయతీ అధికారిగా పని చేసి రాజకీయాల పట్ల ఆసక్తితో ఆ పదవికి రాజీనామా చేసి 2004లో అజిత్మల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2007లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి మదన్ సింగ్ పై 9227 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2007 నుండి 2011 వరకు మంత్రిగా పని చేశాడు.
అశోక్ కుమార్ దోహరే 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇటావా నుండి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ప్రేమదాస్ కతేరియాపై 64,437 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 16,570 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Ashok Kumar Doharey". The Times of India. 2 March 2025. Archived from the original on 2 March 2025. Retrieved 2 March 2025.
- ↑ "4th phase of Lok Sabha polls: 14 key constituencies to watch" (in ఇంగ్లీష్). The Week. 27 April 2019. Archived from the original on 2 March 2025. Retrieved 2 March 2025.
- ↑ "Etawah MP joins Congress, cites insult by party". The Times of India. 30 March 2019. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "How BJP wrested Dalit seats in UP… with help from turncoats" (in ఇంగ్లీష్). India Today. 30 July 2019. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.
- ↑ "Etawah Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 8 March 2025. Retrieved 8 March 2025.